Friday, 23 December 2016 07:59

అంతా 'స్మార్ట్‌' మాయ! ఎన్నిసార్లు ప్రకటిస్తారో...

Written by 
Rate this item
(0 votes)

smar cityముఖ్యమంత్రి చంద్రబాబు అమరా వతిని సింగపూర్‌ రాజధానిని చేసినట్లే నెల్లూరును కూడా స్మార్ట్‌ సిటీ చేస్తున్నారు. అయితే ఈ స్మార్ట్‌ అన్నది ఒకటికి మూడు సార్లు ప్రకటనలకు పరిమితమైందే తప్ప ఆచరణలో అడుగు కూడా ముందుకు పడ లేదు.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో వంద నగరాలను స్మార్ట్‌ సిటీలుగా చేస్తామని ప్రకటించడం తెలిసిందే! కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సొంతూరు నెల్లూరు కాబట్టి, ఆయన సిఫార్సుతో నెల్లూరు స్మార్ట్‌ సిటీల జాబితాలోకి చేరడం ఖాయమను కున్నారు. అయితే కేంద్రం ప్రకటించిన స్మార్ట్‌సిటీల జాబితాలో నెల్లూరు లేకపోయే సరికి నెల్లూరువాసులు నిరాశపడ్డారు. ఆ తర్వాత కేంద్రం బడ్జెట్‌లో కృష్ణపట్నంను ఇండస్ట్రియల్‌ పోర్టు సిటీగా ప్రకటించింది. అయితే దీని ఫలితం ఏంటన్నది ఇంత వరకూ తెలియలేదు. ఇండస్ట్రియల్‌ పోర్టు సిటీ అన్నారు తప్పితే ఇది ప్రకటించిన తర్వాత ఆ విధంగా అభివృద్ధికి నిధులివ్వ డంగాని, పరిశ్రమలను ప్రకటించడం గాని, అభివృద్ధి ప్రణాళికలుగాని ఏవీ లేవు.

ఆ తర్వాత గత ఏడాది రాష్ట్ర ప్రభు త్వం కొన్ని స్మార్ట్‌ సిటీలను ప్రకటించింది. ఈ సిటీలన్నీ కూడా పిపిపి పద్ధతిలో అభివృద్ధి చేయాలనుకున్నవే! తాజాగా రాష్ట్ర మంత్రివర్గం ఒంగోలు, ఏలూరు, అనంత పురం, శ్రీకాకుళం, కర్నూలులతో పాటు నెల్లూరును కూడా స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలని ఆమోదించింది. అయితే స్మార్ట్‌ సిటీ విధి విధానాలేంటి, ఏ విధంగా అభి వృద్ధి పనులుంటాయి, ఒక్కో సిటీకి ఎన్ని నిధులు మంజూరు చేస్తారన్నదానిపై స్పష్టత లేదు.

ముఖ్యంగా ఇప్పుడు నగరంలో వున్న రోడ్లు, మంచినీటి వసతి, డ్రెయిన్‌లు, పార్కులు, రిజర్వ్‌ స్థలాలు, మురికివాడలు వంటివాటిపై పూర్తి స్థాయి డేటా ఉం డాలి. నెల్లూరు చూస్తే నికృష్టానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటుంది. నగరంలో పరిస్థి తులు చాలా అధ్వాన్నంగా వున్నాయి. మురికివాడలు ఎక్కువ. అంతకుమించి ఆక్రమణలు ఎక్కువ. నగరంలో పంట కాలువలుగా పిలవబడే డ్రెయిన్‌లన్నీ ఆక్రమణలకు గురైవున్నాయి. ఈ ఆక్ర మణలు తొలగించడం మున్సిపల్‌ మంత్రిగా నారాయణ వల్ల కావడం లేదు. ఇక ఈ ఆక్రమణలు తొలగిస్తే బాధితులకు ప్రత్యామ్నాయం ఎక్కడ చూపాలన్నదానిపై స్పష్టత లేదు. నగరంలో జిఎన్‌టి రోడ్డు బాగా ఇరుకైపోయింది. ముఖ్యంగా జాతీయ రహదారి నుండి యం.జి మాల్‌ దాకా ట్రంకురోడ్డు విస్తరణ జరిగింది. అక్కడ నుండి బోసుబొమ్మ దాకా రోడ్డు విస్తరణ పెండింగ్‌లో వుంది. గతంలో ఒకసారి విస్తరించాలని చూసినా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ఆ పని మానుకున్నారు.

నెల్లూరులో 1100కోట్లతో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్‌ల పనులు జరుగుతున్నాయి. ఈ నిధుల భారం కార్పొ రేషన్‌ మీద పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వడంతో నగర ప్రజల నెత్తిన భారం దించినట్లయ్యింది. ఇప్పుడు స్మార్ట్‌ సిటీ కూడా పిపిపి పద్ధతిలో అంటున్నారు. అంటే ఖర్చు చేసిన వ్యయభారం కొంత వరకు ప్రజలపై పడే అవకాశముంది. ఇప్ప టికే నోట్ల రద్దు, పెరిగిన పన్నులు, తగ్గిన ఆదాయాలతో జనం సతమత మవుతు న్నారు. మళ్ళీ స్మార్ట్‌ సిటీ పేరుతో పన్నులు బాదితే ప్రజలు భరించే స్థితిలో లేరు. కాబట్టి స్మార్ట్‌ను స్మార్ట్‌గా పూర్తి చేస్తేసరి... ప్రజలను బాదే పనైతే ఆ స్మార్ట్‌ అక్కర్లేదు.

Read 1957 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మళ్ళీ చెడింది
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గెలిచింది వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ తరఫున! మేయర్‌ అయిన కొన్ని నెలలకే చేసిన ప్రమాణాలను పక్కనపెట్టేసి, తన వర్గం వారి మనో భావాలను వెనక్కి నెట్టేసి, వైసిపిని వదిలేసి సైకిలెక్కేసాడు. మేయర్‌ అజీజ్‌ తెలుగుదేశంలోకి రావడానికి ప్రధాన…
  • యువతకు ఒప్పుకునేనా?
    తెలుగుదేశం పార్టీలో జిల్లా కమిటీలన్నీ దాదాపు భర్తీ అయ్యాయి. పార్టీ అనుబంధ కమిటీలలో కీలకమైన 'యువత' ఎంపికే ఇంకా ప్రశ్నార్థకంగా వుంది. కాంగ్రెస్‌ నుండి టీడీపీలోకి వచ్చారని చెప్పి ఆనం సోదరులను సంతృప్తి పరచడానికి ఆనం వివేకా తనయుడు, కార్పొరేటర్‌ ఆనం…
  • కొండమీద కొత్త రూటు...
    ఒక చిన్న వంతెన, కొద్ది దూరం ఘాట్‌రోడ్డు నిర్మాణంతో నెల్లూరు - ఆత్మకూరు మధ్య ముంబై రహదారిలో వెళ్ళే ప్రయాణీకులకు దాదాపు ఐదు కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గబోతోంది. ఇంకో నెల రోజుల్లోపే వాహనదారులకు ఈ ఘాట్‌రోడ్డు అందు బాటులోకి రాబోతోంది.…
  • మేఘం మెరిసెను... వర్షం కురిసెను
    ఓ పక్క సోమశిల రిజర్వాయర్‌లో 50 టిఎంసీల నీళ్ళు రావడం, ఇంకోపక్క ఐఏబి సమావేశంలో జిల్లాలో రబీ సీజన్‌కు 5లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళివ్వాలని నిర్ణయించడం, అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో రైతాంగం ఆనందంలో వుంది. గత ఏడాది…
  • 'దేశం'లో... పాదయాత్ర ప్రకంపనలు
    ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై దండెత్తుతూ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వై.యస్‌.ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుండి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్‌ పాదయాత్రను తెలుగుదేశం వాళ్ళు మొదట…

Newsletter