Friday, 23 December 2016 08:15

అమరావతి నిర్మాణానికి నెల్లూరు మేస్త్రీలు

Written by 
Rate this item
(0 votes)

galpikaవెలగపూడిలోని హైటెక్‌ రత్న, సీఎం చంద్రబాబు కార్యాలయం. చంద్ర బాబు, సహచర మంత్రులు సిఎం ఛాం బర్‌లో వున్నారు. చంద్రబాబును కలవా లని చెప్పి స్టైల్‌ ఆఫ్‌ సింహపురి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(66+) అప్పుడే అక్కడకు వచ్చాడు. చంద్రబాబు విచారంగా ఉండడాన్ని వివేకా గుర్తించి, ఏం అలా వున్నారని అడిగాడు. అందుకు మంత్రి నారాయణ... అమరావతి రాజ ధాని గురించి సార్‌ ఆందోళన పడుతు న్నాడు. అధికారంలోకి వచ్చి రెండున్న రేళ్లు దాటాయి. శంకుస్థాపన శిలాఫలకా లకు బూజుపట్టింది... అని చెబుతుండగా వివేకా కలుగజేసుకుని... బూజుదేముంది దులిపితే పోతుంది కదా, దానికి బాధ పడడమెందుకన్నాడు. దానికి నారా యణ... సార్‌ బాధ బూజు కోసం కాదు, రాజధాని నిర్మాణానికి ఇంకా ఒక్క ఇటుక రాయి కూడా పేర్చనందుకు... ఇంత వరకు ఏ ఒక్క డిజైన్‌ ఫైనల్‌ కాలేదు. ఇక రాజధానిని ఎప్పుడు పూర్తి చేయా లన్నదే ఆయన ఆందోళన అని అన్నాడు. అసలు సబ్జెక్ట్‌ ఏంటో నాకు పూర్తిగా చెప్పండని వివేకా అడిగాడు. ఇది చెబితే అర్ధమయ్యేది కాదు, చూస్తేనే అర్ధం చేసుకో గలవు అంటూ చంద్రబాబు వివేకా కళ్ల ముందు వేళ్లతో స్క్రీన్‌ గీసి ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లి సీన్‌లు ప్లే చేశాడు.

---

2014 డిసెంబర్‌ నెల... హైదరా బాద్‌లోని హైటెక్‌రత్న, ఆంధ్రా సిఎం చంద్రబాబునాయుడు కార్యాలయం... చంద్రబాబుతో పాటు మంత్రులు పి. నారాయణ, కె.ఇ.కృష్ణమూర్తి, దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లా రావులు వున్నారు. అప్పుడే అక్కడకు అమెరికాకు చెందిన ఇంజనీర్లు జాన్‌కెనడీ, రూదర్‌ఫోడ్‌, డాన్‌ఫ్రంట్‌, సండేసన్‌ వచ్చారు. చంద్రబాబు వారితో... మా అమరావతి రాజధానిని మీ న్యూయార్క్‌ సిటీలా కట్టాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన భూసేకరణ పూర్తి చేసాం. మీరు రాజధాని స్కెచ్‌ గీసి ఇవ్వండి అని చెప్పాడు. ఓకే షెండ్రబాబు... ఓన్లీ టూ డేస్‌లో మీకు ప్లాన్‌ అరేంజ్‌ చేస్తాం అంటూ సండేసన్‌ హామీ ఇచ్చి లేచాడు.

రెండ్రోజుల తర్వాత చంద్రబాబు ఆఫీసుకు ఎయిర్‌ కొరియర్‌లో ఓ కవర్‌ వచ్చింది. చంద్రబాబు దానిని చించాడు. లోపల రాజధాని స్కెచ్‌ పేపర్లున్నాయి. తీసి చూసాడు. న్యూయార్క్‌ సిటీని ఆకా శం నుండి ఒక ఫోటో, నాలుగు దిక్కుల నుండి నాలుగు ఫోటోలు తీసి పంపి నట్లుగా వున్నాయి ఆ స్కెచ్‌లు. అవి చూసి చంద్రబాబు... ఈ మాత్రం ఫోటోలు మనం తెచ్చుకోలేమా...వీళ్లతో కాదు గాని జపాన్‌ ఇంజనీర్లను పిలిపించండి మాట్లా డుదామని నారాయణను ఆదేశిం చాడు.

----

2015జూన్‌ నెల... చంద్రబాబు ఛాంబర్‌లో యధాఫలంగా మంత్రులు, జపాన్‌ నుండి వచ్చిన ఇంజనీర్లు పింగ్‌ పాంగ్‌, యంగ్‌టాంగ్‌, జువాన్‌జింకో, కుత్సుబిషి నిపాన్‌లు అక్కడ వున్నారు. చంద్రబాబు వారితో... అమరావతి రాజ ధానిని అచ్చం మీ టోక్యో సిటీలా కట్టాలను కుంటున్నాం. అందుకు అవసరమైన భూమిని కూడా తీసిపెట్టాం. మీరు మాకు టోక్యో సిటీని తలపించేలా డిజైన్‌ ఇస్తే చాలు... దీనికి ఎన్ని కోట్లయినా ఇస్తా మన్నాడు. అందుకు వాళ్లు నాలుగు రోజుల్లో డిజైన్‌ పంపిస్తామని చెప్పి వెళ్లిపోయారు.

నాలుగు రోజుల తర్వాత... జపాన్‌ ఇంజనీర్లు పంపించిన రాజధాని డిజైన్‌ లను చంద్రబాబు చూస్తున్నాడు. ఆ డిజైన్‌లలో కృష్ణపట్నం జెన్‌కో ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలులాగా అన్నీ కూలింగ్‌ టవర్లే కనిపిస్తున్నాయి. ఆ డిజైన్‌ చూస్తుంటే చంద్రబాబుకు ఏమీ అర్ధం కాలేదు. అంతలో అక్కడకు మీడియా ప్రతినిధులు వచ్చారు. అందరూ ఆ డిజైన్‌లను ఫోటోలు తీసుకున్నారు పక్కరోజు తెలుగు జ్యోతి, ఈరోజు పత్రికల్లో 'అమరావతి రాజధానికి అద్భుత డిజైన్‌' అని ఫోటోలు పెట్టి వార్తలు వ్రాస్తే, 'ఆత్మసాక్షి' పత్రికలో మాత్రం 'అమరావతిలో అణువిద్యుత్‌ కేంద్రం' అంటూ ఆ డిజైన్‌ ఫోటో పెట్టి ఫ్రంట్‌ పేజీలో ప్రచురించింది. ఆ వార్త చూసి చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. అంతలో జపాన్‌ ఇంజనీర్‌ పింగ్‌పాంగ్‌ చంద్రబాబుకు ఫోన్‌ చేసాడు. చంద్రబాబు ఫోన్‌ ఎత్తాడు. పింగ్‌పాంగ్‌ వుండి... సార్‌, పొరపాటు జరిగింది. మా దేశంలో నిర్మించ తలపెట్టిన అణురియా క్టర్ల డిజైన్‌ మీకు పంపించారు. దానిని వెనక్కిపంపిస్తే మీకు టోక్యో డిజైన్‌ పంపి స్తామన్నాడు. చంద్రబాబు కోపంతో... మీ డిజైన్‌ అవసరం లేదు. మేం సింగపూర్‌ వాళ్ల చేత గీయించుకుంటాం, మాకు వాళ్లే కరెక్ట్‌ అంటూ ఫోన్‌ పెట్టేసాడు.

న న న

2016ఫిబ్రవరి... సింగపూర్‌ ఇంజ నీర్లు పెంగ్‌లీ, మిచిలాస్‌, షిబురాలతో చంద్రబాబు మీటయ్యాడు. యధాఫలంగా అమరావతి రాజధాని గురించి చర్చ... అమరావతిని సింగపూర్‌లా చేయాలి... ఆ నిర్మాణ బాధ్యత కూడా మీరే తీసు కోండి, దానికి ఖర్చంతా మేమే పెట్టు కుంటాం, బిల్డింగ్‌లు కట్టాక ఆదాయం మాత్రం మీరు తీసుకోండి అని చంద్ర బాబు ప్రతిపాదించాడు. దానికి వాళ్లు ఆనందంగా ఒప్పుకున్నారు. త్వరలో డిజైన్‌తో మీ ముందు వాలుతామంటూ వాళ్లు లేచి వెళ్లిపోయారు.

చంద్రబాబు ఇక్కడితో ఫ్లాష్‌బ్యాక్‌ ముగించాడు. ఆ తర్వాత ఏమైంది అని వివేకా ప్రశ్నించాడు. అప్పుడు చంద్ర బాబు... ఏమైంది, నా బొందైంది... సింగపూర్‌ కంపెనీకి అన్ని లైన్‌లు క్లియర్‌ చేసారు, వారి కోసం నిబంధనలే మార్చాను, వాళ్లు డిజైన్‌లు కూడా గీసేసారు. ఇక సింగపూర్‌ అమరావతి రాజధాని మొదలు పెడదామనుకున్న తరుణంలో ఇదిగో ఈ మోడీ పెద్దనోట్లు రద్దు చేసి నా కొంప ముంచాడు. ఇప్పటి దాకా ప్రభుత్వానికొచ్చిన ఆదాయాన్నంతా పుష్కరాలు, పట్టిసీమ, మజ్జిగ ప్యాకెట్లకు పెట్టేసాను. కరెక్ట్‌గా రాజధానికి వచ్చే డబ్బు తగలబెడదామనే టైంకు పెద్దనోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయం పడిపోయింది. అప్పటికీ తక్కువ బడ్జెట్‌తో రాజధానిని కంప్లీట్‌ చేద్దామని బాహుబలి సినిమా

సెట్టింగ్‌లు నచ్చి దర్శకుడు రాజమౌళిని కూడా పిలిపించాను. అమరావతిలో టక కట సెట్టింగ్‌లు వేయించి రాజధానిని పూర్తి చేసామని చెప్పి కలరింగ్‌ ఇద్దామను కున్నాను. కాని ఆ రాజమౌళికి ఇక సంవత్సరం తీరిక లేదట అని ఆవేదన చెందాడు. అదంతా విన్న వివేకా... ఓస్‌, దీనికే ఇంత ఇదైపోతున్నారా... అయినా పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా వెదికినట్లుగా వుంది మీ వ్యవహారం. మా చింతారెడ్డిపాలెం నుండి జమాజెట్టీల్లాంటి నలుగురు మేస్త్రీలను పంపిస్తాను... దీనికి ఇంజనీర్లు పల్లేదు. సినిమా డైరెక్టర్లు అక్కర్లేదు... సంవత్సరం లోపు మీకు ఎట్ట కావాలంటే అట్లా బిల్డింగ్‌లు కట్టేస్తారు. వాళ్లకు ఇంజనీరింగ్‌ ప్లాన్‌లు కూడా పల్లేదు. కావాలంటే మన నారాయణను అడగండి... ఆయన కాలేజీ బిల్డింగ్‌లన్నీ కట్టింది వాళ్లే కదా.ఆ సింగపూర్‌, జపాన్‌ వాళ్లు అంతకంటే బాగా కడతారేంటి, కావాలంటే నారాయణనే మళ్లీ అడగండి అని అన్నాడు. అప్పుడు నారాయణ వుండి ... అవును సార్‌, నిజమే, మా చింతా రెడ్డిపాలెం వాళ్ళే బ్రహ్మాండంగా కడ తారు. మీరు జపాన్‌, సింగపూర్‌ అంటూ వుంటే, మీ అభిప్రాయాన్ని ఎందుకు కాదనాలని ఇంతకాలం చెప్పలేదన్నాడు. ఇంతకాలం వజ్రాలను పక్కనపెట్టుకుని గులకరాళ్ల కోసం విదేశాలకు పరుగులు తీసానన్నమాట... వెంటనే నెల్లూరు మేస్త్రీ లను పిలిపించి పనులు మొదలు పెట్టిం చండంటూ చంద్రబాబు ఆనందంగా లేచాడు.

Read 79 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • రాజకీయమా? రక్త సంబంధమా?
    నెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే…
  • పంచాయితీలకు ప్రమోషన్‌!
    జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌గా ఉండగా గూడూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేటలు మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడం జరిగింది. కాగా, జిల్లాలో మరో 9 మేజర్‌ పంచాయితీలను…
  • చుక్కలు చూపించిన జగన్‌
    ఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి…
  • ఆనంకు 'హై'షాక్‌
    వందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి…
  • నెంబర్‌ గేమ్‌లో నెగ్గేదెవరు?
    బేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా…

Newsletter