31 December 2016 Written by 

నోట్లు మారాయి... పాట్లు మారేనా?

notesడిసెంబర్‌ 30వ తేదీ... 52రోజులుగా భారతదేశంలోని 125కోట్ల మంది ప్రజలు ఈరోజు కోసమే చూస్తున్నారు. అయితే ఇంతకాలం డిసెంబర్‌ 30వ తేదీని ఒక కోణంలో చూసేవాళ్లు.

అది ఆ ఏడాది ముగింపు దినంగా భావించేవాళ్లు. కొత్త సంవత్సరం కోసం ఎదురుచూసే వాళ్లు.

ఈ సంవత్సరం పరిస్థితి అదికాదు. పాత నోట్ల రద్దుకు అది తుదిగడువు. నవంబర్‌ 8వ తేదీన పాత వెయ్యి, ఐదొందల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. బ్యాంకుల్లో పాత నోట్లు జమచేయడానికి డిసెంబర్‌ 30వ తేదీని తుదిగడువుగా నిర్ణయించారు. ఆ తేదీయే ఈరోజు. ఈ 52 రోజులు దేశమంతా ప్రజలు ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డారు. వ్యాపారాలలో, వేతనాల రూపంలో నష్టపోయారు. ఇంతకాలం కూడబెట్టిన సొమ్మును బ్యాంకుల్లో కట్టేసారు. ఇంట్లో ఖర్చుల కోసం, వ్యాపార అవసరాల కోసం బ్యాంకుల ముందు, ఏటిఎంల ముందు గంటల తరబడి నిలబడి నగదు తీసుకున్నారు.

భారతదేశ చరిత్రలోనే నోట్ల రద్దు అతిపెద్ద సంఘటన. 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే ఇబ్బందిపడ్డారు. కాని ఇప్పుడు పెద్దనోట్ల రద్దుతో వాళ్లు, వీళ్లు అనే తేడా లేకుండా దేశప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. పడుతున్నారు కూడా!

నోట్ల రద్దు గడుపు ముగిసాక ప్రజల కష్టాలు తీరుతాయని, దేశ ప్రజల భవిష్యత్‌ దివ్యంగా ఉండబోతుందని ప్రధాని నరేంద్రమోడీ ధీమాగా చెబుతూ వచ్చారు. అయితే ఆ ధీమాకు తగ్గట్లుగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? అన్నది ప్రశ్న!

పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్రం ఆశించింది దాదాపు 4లక్షల నుండి 5లక్షల కోట్ల దాకా నల్లధనం బ్యాంకులకు రాకుండా ఆగిపోతుందని, బ్యాంకులకు రాని ఆ నల్ల డబ్బు ప్రభుత్వానిదే అవుతుందని, కాబట్టి ఆ డబ్బుతో దేశ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్ట వచ్చని భావించారు. కాని ఆ అంచనా తప్పింది. దేశంలో 15.5లక్షల కోట్లు వెయ్యి, 500 రూపాయల నోట్లుండగా డిసెంబర్‌ 10వతేదీ నాటికే బ్యాంకులలో 14లక్షల కోట్లు దాకా పోగయినట్లు సమాచారం. ఇక మిగిలిన ఈ 20రోజులలో వచ్చి చేరిన పెద్దనోట్ల పై లెక్క రావాలి. ఇంకో లక్ష కోట్లు సులభంగా జమవుతాయి. ఈ లెక్కన చూస్తే బ్లాక్‌పై కేంద్రం పెట్టుకున్న ఆశలు గల్లంతైనట్లే!

నల్లధనం అంతా తెల్లధనంగా మారిపోయింది. దేశంలో పేద ప్రజలబ్యాంకు ఖాతాలెక్కువ. కాబట్టి నల్లకుబేరుల డబ్బు పేదల ఖాతాలలో బాగా అడ్జస్ట్‌ అయిపోయింది. స్థిరాస్తుల కొనుగోలు, బంగారం కొనుగోళ్ల ద్వారా మరికొంత నలుపు తెలుపై పోయింది. అన్నింటికి మించి ఆర్బీఐ కొత్తగా జారీ చేసిన 2వేల కోట్లు బ్యాంకులు, ఏటిఎంల ముందు 'క్యూ'లలో నిల్చున్న వారికి మనిషికి ఒకటి, రెండు నోట్ల లెక్కన చేరితే నల్లకుబేరు లకు మాత్రం వందల కోట్ల లెక్కన చేరాయి. కొత్త కరెన్సీని కూడా బ్లాక్‌కు పంపించడంలో బ్యాంకులు తమదైన పాత్ర పోషించాయి. కాబట్టి దేశంలో భారీస్థాయి నల్లధనం అన్నదానికే ఆస్కారం లేకుండా పోయింది. నోట్ల మార్పిడిలో నల్లధనం పెద్దగా బయటపడకపోవడం వల్లే దేశ వ్యాప్తంగా కూడా కేంద్రం అక్రమార్జులపై ఐటి దాడులు నిర్వహిస్తోంది. అసలు ఈ దాడులనెప్పుడో మొదలుపెట్టివుంటే పెద్దనోట్ల రద్దు అవసర ముండేది కాదు. పెద్దనోట్ల రద్దు మూలంగా కాశ్మీర్‌లో అల్లర్లు ఆగడమొక్కటే సంతోషించాల్సిన విషయం.

పాతనోట్ల రద్దుతో 2016 వెళ్లిపోతుంది. కొత్త నోట్లతో 2017లోకి ప్రవేశిస్తున్నాం. ప్రధాని చెబుతున్న 'అచ్చేదిన్‌'కు 2017లోనే అంకురార్పణ జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు. పెద్దనోట్ల రద్దువల్ల ఆశించిన నల్లధనం రాకపోగా దేశ ఆర్ధిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఆఖరుకు 2శాతం జిడిపి రేటును కూడా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడాలంటే స్వేచ్ఛాయుత ఆర్ధిక సంస్కరణలు తప్పనిసరి! పన్నుల విధానాన్ని సరళం చేయాలి. దేశంలో ముందు అన్ని వ్యాపారాలకు మూలస్థంభాలైన వ్యవసాయం, రియాల్టీ రంగం కోలుకోవాలి. వీటికి చేయూతనిచ్చే విధంగా కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…
  • మేకపాటిని తప్పిస్తేనే మేలు?
    నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా మేకపాటి రాజ మోహన్‌రెడ్డి మూడుసార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాడు. నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో ఆయన పేరిట ఇదో రికార్డు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ రిజర్వుడ్‌లో ఉన్నటువంటి నెల్లూరు లోక్‌సభ జనరల్‌లోకి…
  • ఈ మలుపులు... ప్రమాదాలకు పిలుపులు
    కోవూరు నుండి విజయవాడ దాకా జాతీయ రహదారిని ఆరులైన్లుగా మార్చారు. ప్రతి క్రాసింగ్‌ వద్ద అండర్‌పాస్‌ ఏర్పాటు చేసారు. చిన్న పల్లెటూరుకు కూడా ఇవి ఏర్పడడంతో హైవేను దాటి పోవడం అన్న ప్రశ్నేలేదు. కాబట్టి ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చు. దరిద్రం ఏంటంటే…
  • పేద గుండెల ధ్వని... 'జై ఆంధ్రా' ఉద్యమ సేనాని... మెట్టలో పుట్టిన మేటి నేత మాదాల జానకిరామ్‌
    ఉదయగిరి అంటే గుర్తొచ్చేది అలనాడు శ్రీకృష్ణ దేవరాయలు అయితే.. ఆధునిక రాజకీయ కాలంలో గుర్తొచ్చేది స్వర్గీయ బెజవాడ గోపాలరెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడులు. వారి రాజ కీయ ప్రస్తానం మొదలైంది ఇక్కడే! అలాగే వారితో పాటు గుర్తొచ్చే నాయకుడు మాజీ మంత్రి…

Newsletter