31 December 2016 Written by 

30-12-2016 రాశిఫలాలు

rasi 31

1Ariesమేషం

ఆర్ధిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు కొంత మెరుగుగా ఉండి ఆదాయం పెరుగుతుంది. అయితే తప్పనిసరి ఖర్చుల భారం తప్పదు. పనులన్నీ నిదానంగా జరుగుతాయి. ప్రభుత్వ అను మతులు ఆలస్యం కావచ్చు. అధికారుల అనుకూలత ఉద్యోగులకు బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగుం టుంది. శుభవార్తలు వింటారు.

 

2Taurusవృషభం

సమస్యలుండినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. అధికారుల ప్రసన్నత ఉద్యోగులకు బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం తగ్గు తుంది. కోర్టు కేసులందు కొంత ఊరట ఉంటుంది. వ్యాపారులకు అధికారుల వల్ల సమస్యలుంటాయి. బిడ్డల విద్యా వివాహ శుభకార్యాలపై దృష్టి పెడతారు. స్నేహితుల సహకారం బాగుంటుంది.

 

3Geminiమిధునం

వ్యాపారపరంగా అభివృద్ధి పెట్టుబడి అవకాశాలు బాగుంటాయి. యజమానులు వర్కర్లతో జాగ్రత్తగా ఉం డండి. ఉద్యోగులు సహచరులతోను పబ్లిక్‌తోను జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రుల ప్రోత్సాహం బాగుండి కొత్త ఆర్ధికాభివృద్ధి ప్రయత్నాలు చేస్తారు. పనులు అనుకున్న విధంగా నిర్వహించగలరు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తారు.

 

4Cancerకర్కాటకం

ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో అపార్ధాలు చోటు చేసికొనకుండా జాగ్రత్తపడాలి. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. అనుకున్న పనులకు ఆటంకాలు కలగడం వల్ల చికాకుగా ఉంటుంది. గృహ రిపేర్లు, వస్తు వాహన రిపేర్లుంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అవసరాలకు ఋణం చేయవలసి రావచ్చును. ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కాగలవు.

 

5Leoసింహం

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగిపోతాయి. అనుకోని అదనపు ఖర్చులుంటాయి. జాగ్రత్త పడవలసి ఉంటుంది. కొత్త పరిచయాలు, బంధుత్వాలు బలపడ తాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. చిన్న వ్యాపా రులు, కాంట్రాక్టర్లకు ఇబ్బంది రోజులివి. అధికారుల వల్ల సమస్యలు రాగలవు. ఉద్యోగులకు అదనపు బాధ్యత లుంటాయి. క్రయవిక్రయాలు వాయిదా పడతాయి.

 

6Virgoకన్య

వృత్తి వ్యాపారాలలో వేసికొన్న ప్రణాళిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం బాగుంటుంది. అయితే ఆశించిన అదనపు ఖర్చుల వల్ల ఋణం చేయవలసి వస్తుంది. వస్తు నష్టము, వాహన రిపేర్లు, కుటుంబ సభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. అనుకున్న పనులను పట్టుదలతో జరుపుకొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

 

7Libraతుల

ఖర్చులను అదుపు చేసుకుంటూ నిర్ధిష్ట ప్రణాళికలతో వృత్తి వ్యాపారాలను నడపండి. సామాన్య ఆదాయానికి లోపం రాదు. ఉద్యోగులకు పని వత్తిడి, కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. వ్యాపారవృద్ధికి అవకాశాలు దొరుకుతాయి. పిల్లల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. కుటుం బంలో స్వల్ప భిన్నాభిప్రాయాలుంటాయి. కోర్టు వ్యవహా రాలు, కుటుంబ వ్యవహారాలు సర్దుబాటు కావచ్చును.

 

8Scorpioవృశ్చికం

వ్యవహారాలలోల దూకుడు తొందరపాటు తగ్గించు కొనండి. ఆలోచించి నిర్ణయాలు చేయండి. రావలసిన బాకీలు నిలబడిపోతాయి. ఆర్ధిక ఇబ్బందులుంటాయి. అయినవాళ్ళ వల్ల మాటలు పడవలసి వస్తుంది. కావున అనవసర విషయాల జోలికి వెళ్ళవద్దు. శుభకార్య ప్రయత్నాలు ఫలించగలవు. ఉద్యోగులు విధి నిర్వహణ బాధ్యతాయుతంగా చేయండి.

 

9Sagittariusధనుస్సు

అక్రమ వ్యవహారాలకు ప్రోత్సహిస్తారు. కాబట్టి జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. వ్యాపారవృద్ధి ప్రయత్నాలు అనుకూలించగలవు. వ్యవ సాయదారులు, వడ్డీ వ్యాపారులకు ఇబ్బంది సమయం. సభలు సమావేశాలలో పాల్గొంటారు. రియల్‌ ఎస్టేట్‌, స్టాక్‌ వ్యాపారులు నష్టపడతారు.

 

10Capricornమకరం

వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరుగుతాయి. అభివృద్ధికి మరింత శ్రమ పడాలి. అదనపు ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. బంధువులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వ అనుమతులలో ఆలస్యం జరుగుతుంది. ఉద్యో గులు అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెల గండి. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

11Aquariusకుంభం

సాహస నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు చేసే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఖర్చులు పెరిగినా జాగ్రత్తపడగలరు. ప్రముఖులను కలుసుకొనడం, సభలలో పాల్గొనడం జరుగుతుంది. హోల్‌సేల్‌ వ్యాపారులకు ఇబ్బందులుంటాయి.

 

12Piscesమీనం

అనుకున్న పనులు సరిగా జరగడానికి మరింత శ్రమ పడాలి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరిగి ఆదాయం ఫరవాలేదనిపించగలదు. ఆర్ధిక ఇబ్బందులుండి సమ ర్ధించుకొని ముందుకు పోగలరు. టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. అనవసర విషయాలలోకి పోవడం, సలహా లివ్వడం చేయవద్దు. విద్యార్థులకు మంచి కృషి ఉంటుంది. పెట్టుబడులు నిలబడిపోతాయి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
  కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
 • తీరంకు సిఇజడ్‌ హారం
  డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
 • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
  నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
 • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
  ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
 • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
  రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter