06 January 2017 Written by 

పందెంకోళ్ళు

chir balఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు అంటేనే కోళ్ళ పందేలు, ఎడ్ల పందేలు... ఇవి కాకుండా ఇంకో పందెం కూడా వుంది. అదే సినిమా పందెం. ప్రతి సంక్రాంతికి కూడా అగ్రహీరోల సినిమాలు విడుదలవు తుంటాయి. వీటిలో ఒకరివి హిట్‌ కావడం, ఇంకొకరివి ఫట్‌ మనడం కామనే!

తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర హీరోల విభాగంలో ఇప్పుడు మూడో తరం వుంది. ఈ తరానికి తెలిసిన మొదటి తరం హీరోలు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణలు, రెండో తరానికి సంబంధించి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌! ఇప్పుడు మూడో తరం వాళ్లొచ్చారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌, రాంచరణ్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, నాగచైతన్య, రానా వంటి వాళ్లు. పదేళ్ల క్రితంవరకు కూడా తెలుగు చలనచిత్ర రంగంలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య పోటీ వుండేది. సంక్రాంతి పడ్డక్కి ఈ ఇద్దరి హీరోల సినిమాలు ఖచ్చితంగా విడుదలయ్యేవి! అభిమానుల మధ్య పోటీ కూడా తీవ్రంగా ఉండేది.

చాలాకాలం తర్వాత సంక్రాంతికి ఆ ఇద్దరి హీరోల సినిమాలు తెలుగు తెరపైకి రాబోతున్నాయి. వీళ్లిద్దరు కూడా చాలా కాలం నుండి సినిమాలు తగ్గించారు. రాజకీయాల్లో వేగం పెం చారు. కాకపోతే తమ పేరిట ఒక రికార్డు కోసం చెరొక సినిమా చేశారు. చిరంజీవి నటించిన 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' ఈ నెల 11న తెర కెక్కబోతుంటే, బాలకృష్ణ హీరోగా తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఈనెల 12న వెండి తెరపైకి రానుంది. ఈ ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒక్కరోజు తేడాలో విడుదలవుతుండ డంతో అభిమానుల్లో సందడి నెల కొంది. థియేటర్లకు సైతం పోటీ నెల కొంది. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన 'కత్తి' సినిమాను 'ఖైదీ నెం.150' పేరుతో రీమేక్‌ చేయగా, అమరావతి రాజధానిగా దేశం మొత్తాన్ని ఏలిన శాతకర్ణి రాజు చరిత్ర నేపథ్యంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని రూపొందించారు. బాలకృష్ణ సినిమా ఆడియోను తిరుపతిలో విడుదల చేయగా, చిరంజీవి సినిమా ట్రైలర్‌ విడుదలకు మాత్రం రాజకీయ ఆటంకాలొచ్చాయి. ఈ సినిమా ఆడియోను విజయవాడలో విడుదల చేయాలనుకున్నప్పటికి, ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో గుంటూరుజిల్లా, చినకాకాణి వద్ద వున్న హాయ్‌ల్యాండ్‌కు మార్చారు.

ఈ రెండు సినిమాల ఆడియో విడుదలలోనే రాజకీయ సెగ మొదలైంది. ఇక సినిమాలు విడుదలయ్యాక ఆ సెగ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter