06 January 2017 Written by 

06-01-2017 రాశిఫలాలు

rasi 06

1Ariesమేషం

డబ్బుకు ఇబ్బంది లేకుండా వృత్తి వ్యాపారాలు బలపడి ఆదాయం పెరుగుతుంది. అదనపు ఖర్చులు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. అనుకున్న పనులకు అవరో ధాలు కలిగి తొలగుతాయి. బంధుమిత్రులు, ప్రముఖులతో సత్సంబంధాలు బలపడతాయి. శుభకార్యాలను నిర్ణయం చేస్తారు. రావలసిన బాకీలు కొంత లభించగలవు. ముఖ్య పనుల బాధ్యతలను ఇతరులకు అప్పగించవద్దు.

 

2Taurusవృషభం

మీ సలహాలు సూచనలు ఇతరులకు ఉపయోగ పడతాయి. అనుకున్న పనులు సవ్యంగా జరగడానికి ఇతరుల సహాయం లభించగలదు. కొత్త వస్తువులు, యంత్రాలు, వాహనాలు సమకూరుతాయి. వృత్తి పరంగా రాబడి సంతృప్తికరం. వ్యాపార వర్గాలకు సామాన్య ఆదాయం మరియు వ్యాపారవృద్ధి అవకాశాలు సన్నగిల్లు తాయి. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

3Geminiమిధునం

ఆదాయ వ్యయాలు సరిపోతుంటాయి. వృత్తి వ్యాపార వృద్ధికి మీ ప్రయత్నాలు అనుకూలమై ఆదాయం పెరుగు తుంది. స్థిరాస్తుల లావాదేవీలు వాయిదా పడతాయి. కొత్త గృహోపకరణాలు సమకూరుతాయి. శుభకార్య ప్రయ త్నాలు, ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉన్నది. అనుకున్న పనులకు ఆటంకాలను అధిగమిస్తారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం వల్ల సమస్యలుండగలవు.

 

4Cancerకర్కాటకం

ఆర్ధిక స్థితి క్రమంగా మెరుగు కాగలదు. వ్యాపారాలు, వృత్తి జీవనాలు సామాన్యంగా జరిగి ఆదాయం సామా న్యంగా ఉంటుంది. అనుకున్న పనులు హడావిడిగా జరుపుతారు. బంధుముఖ్యులకు ఆరోగ్యం సరిగా ఉం డదు. పిల్లల వల్ల సమస్యలు కొద్దిగా ఉంటాయి. స్త్రీలు పోటీలలో పాల్గొంటారు. ఋణాలు లభించడం జరుగు తుంది. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

5Leoసింహం

వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి విస్తరణ జరుపుతారు. ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు సమర్ధ వంతంగా జరుపుకొంటారు. నూతన వస్తువులు సమకూరుతాయి. శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నవారికి అనుకూలత ఉన్నది. బంధువర్గంలో తీవ్ర అనారోగ్య బాధితులుంటారు. కళా క్రీడా సాంకేతిక రంగాల వారికి అవకాశాలు బాగుంటాయి.

 

6Virgoకన్య

మీ సమర్ధతకు గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ బాగుంటుంది. గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చులు అదనంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టు లీజులు లభించగలవు. శుభకార్య ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కలదు.

 

7Libraతుల

సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించగలరు. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. బంధువులతో విభేదాలు సర్దుబాటు కాగలవు. ఇతరుల విమర్శలు ఆరోపణలను ఎదుర్కొంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించవచ్చును. అనుకోని ప్రయాణాలుం టాయి. మీది కాని విషయాలలో జోక్యం వద్దు.

 

8Scorpioవృశ్చికం

కొత్త పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు అనుకూలత బాగుంది. ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది. కొన్ని వివాదాలు, పెండింగ్‌ సమస్యల నుండి బయపడే అవకాశం ఉన్నది. అనుకోని ఖర్చులుండినను ఇబ్బంది ఉండదు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు గుర్తింపు గౌరవాలు, అధికారుల ఆదరణ బాగుంటుంది. ఆరోగ్యం ఫరవాలేదు.

 

9Sagittariusధనుస్సు

అనుకున్న పనులు నిదానంగా సానుకూలం కాగ లవు. కుటుంబవ్యక్తులతో స్వల్ప విభేదాలుండవచ్చును. ఆర్ధిక వ్యవహారాలందు అనుకూలత, వృత్తి వ్యాపారా లందు అభివృద్ధి, రాబడి పెరుగుదల ఉంటుంది. అదనపు ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్త అవసరం. నూతన వస్తు, వస్త్రాలు సమకూరుతాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కలదు.

 

10Capricornమకరం

ఈ వారం ఖర్చులు అధికంగా ఉండగలవు. అయినా డబ్బుకు ఇబ్బంది కలగదు. వృత్తి పరంగా సంపాదన బాగుంటుంది. వ్యాపారవర్గాలకు సామాన్య ఆదాయం, అభివృద్ధి అవకాశాలు చేజారిపోవడం జరుగుతుంది. బంధువర్గంతో విభేదాలు కలుగవచ్చును. ప్రభుత్వ అనుమతులందు ఆలస్యం, ఋణాలు మంజూరు వాయిదా పడగలవు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

 

11Aquariusకుంభం

చేయదలచిన పనులకు సొంత పర్యవేక్షణ అవసరం. అధికారులకు కొత్త బాధ్యతలు, ఉద్యోగులకు పనివత్తిడి ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. అన్నింటా టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల అభివృద్ధి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎటువంటి వత్తిడులకు మొగమాటాలకు లొంగవద్దు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

 

12Piscesమీనం

అనుకున్న పనులు విజయవంతంగా జరుగుతాయి. ఈ వారం ఖర్చులు పెరిగిపోతాయి. కాని ఆర్ధిక ఇబ్బందు లుండక సర్దుబాటు కాగలదు. పెద్దలు ప్రముఖులను కలుసుకొంటారు. ఉద్యోగులకు పనిభారం బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారవృద్ధి ప్రయత్నాలు అనుకూ లించి ఆదాయం పెరుగుతుంది. గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. బాకీలు నిలబడిపోతాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter