11 January 2017 Written by 

పందెంకోళ్ళు రెడీ

pandemkodiసంక్రాంతి అంటేనే సరదాల పండుగ. కేవలం తెలుగు సంస్కృతిలోనే కనిపించే ఈ సరదాలను ఇంకెక్కడా చూడలేము. బుడబుక్కలవాళ్లు, గంగిరెద్దులు, హరిదాసులు, జంగమదేవరులు, ఎడ్లపందేలు, పశువుల పూజలు, పొంగళ్లు, పిండి వంటలు, భోగి మంటలు, కొత్తబట్టలు... ఇవన్నీ ఒకెత్తయితే సంక్రాంతి స్పెషల్‌ కోడిపందేలు! ఈ పందేలు అనగానే మనకు గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు. అక్కడి రాజులు ఆడే కోడిపందేలు! ఈ పందేల కోసం వాళ్లు దాదాపు అయిదారు నెలల నుండే పందెపుకోళ్లను మేపుతుంటారు. ప్రతి సంవత్సరం కోళ్ల పందేలను నిషేధించడం, అయినా ప్రతిచోటా లెక్కచేయకుండా వీటిని నిర్వహించడం. ప్రజాప్రతినిధులు సైతం ఈ పందేలకు హాజరవుతుండడం... ఒక ఆనవాయితీగా మారింది.

అయితే ఈసారి ఉన్నత న్యాయస్థానమే కోళ్ల పందేల రాయుళ్లకు రిలీఫ్‌ ఇచ్చింది. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టకుండా పందేలు నిర్వహించుకోండని చెప్పింది. కోర్టులు ఆ మాత్రం అవకాశమివ్వాలేగాని మన వాళ్లు రెచ్చిపోరూ...

ప్రతి సంవత్సరం నెల్లూరుజిల్లాలోని పలు గ్రామాలు, పల్లెల్లో కూడా కోడి పందేలను చాటుమాటుగా నిర్వహించేవాళ్లు. పోలీసులు వాటిపై దాడులు చేసి దొరికిన డబ్బుతో పాటు దొరికిన కోళ్లను తెచ్చి స్టేషన్‌లో పెట్టేవాళ్లు. ఈసారి కోర్టు ఇచ్చిన రిలీఫ్‌తో నెల్లూరుజిల్లాలో కూడా జోరుగా కోడి పందేలు నిర్వహించనున్నారు. ఈమేరకు కోళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఉదయగిరి, రాపూరు, ఆత్మకూరు, అల్లూరు, నెల్లూరు రూరల్‌లోని గ్రామాలలో ఈ కోళ్లపందేలు బాగా నిర్వహిస్తుంటారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు కార్పొరేషన్‌కు... కాగ్‌ అక్షింతలు
    నెల్లూరు కార్పొరేషన్‌ ఎంత దరిద్రంగా ఉందన్నది ఇంతవరకు నెల్లూరీయులకు మాత్రమే తెలిసిన రహస్యమనుకున్నాం. కాని దీని ఘనత ఢిల్లీ దాకా పాకిందన్న విషయం మొన్ననే బయటపడింది. ఆధునిక కాలానికనుగుణంగా మారడంలో నెల్లూరు కార్పొరేషన్‌ వెనుకబడిందంటూ 'కాగ్‌' అక్షింతలు వేసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని…
  • షిరిడి సాయిబాబా, యోగాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
    నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం …
  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • మెట్టు దిగాడు... మెట్లెక్కుతున్నాడు!
    జిల్లా రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిరపకాయలాంటి వాడు. చూడ్డానికి మిరపకాయ వేలెడంత వున్నా దాని ఘాటు తగిలితే చెట్టంత మనిషయినా గింగిరాలు తిరగాల్సిందే! సోమిరెడ్డి కూడా అంతే! జిల్లాలో కొమ్ములు తిరిగిన రాజకీయ కుటుంబాలను సైతం ఒంటి చేత్తో ఎదుర్కొన్న మనిషి.…

Newsletter