11 January 2017 Written by 

మోడీకి ఫైనల్సే...

modiఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఎన్నికల కమిషన్‌ పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరి 4వ తేదీ తొలిదశ పోలింగ్‌తో మొదలయ్యే ఈ సంగ్రామం మార్చి 11వ తేదీ ఓట్ల లెక్కింపుతో ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్‌(403), పంజాబ్‌(117), ఉత్తరాఖండ్‌(70), మణిపూర్‌(60), గోవా(40)... మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆయా పార్టీలు తమ భవిష్యత్‌ను తేల్చుకోబోతున్నాయి.

సాధారణంగా పార్లమెంట్‌ ఎన్నికలకు ముందొచ్చే ఇలాంటి అసెంబ్లీ ఎన్నికలను ఆయా ప్రభుత్వాలు లేదా పార్టీల పనితీరుకు రెఫరెండంగా భావిస్తుంటారు. వీటినే సెమీఫైనల్స్‌ అని కూడా అంటుంటారు. అయితే ఈసారి జరిగే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఓ ప్రత్యేకత వుంది. పలు పార్టీలకు ఇవి సెమీఫైనల్సే కావచ్చునేమో... ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం ఇవి ఫైనల్స్‌ లాంటివే!

దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత, పాక్‌ పై సర్జికల్‌ దాడుల తర్వాత జరుగుతున్న ఎన్నికలివి. పెద్దనోట్ల రద్దు, సర్జికల్‌ దాడుల విషయంలో ప్రభుత్వం కంటే కూడా ప్రధాని నరేంద్రమోడీ ఎక్కువ ఫోకస్‌ అయ్యారు. ఆయన వ్యక్తిగత నిర్ణయాలుగానే ఇవి ప్రచారంలోకి వచ్చాయి. సర్జికల్‌ దాడులను ప్రజలు ఆమోదిస్తారు. కాని పెద్దనోట్ల రద్దును స్వాగతించారా? దీనికి కొల మానమే ఈ ఎన్నికలు. పెద్దనోట్ల రద్దు దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దేశంలో ఎక్కువ శాతంమంది ప్రజలు ఎంతో కొంత ఇబ్బందికి గుర య్యారు. ఈ ఇబ్బందులను అధిగమిస్తే అవినీతి, నల్లధనం లేని స్వచ్ఛభారత్‌ను నిర్మించవచ్చంటూ ప్రధాని నమ్మకంగా చెబుతూ వచ్చారు. మరి ఆయన మాటలను ప్రజలు ఎంతగా విశ్వసించారన్నది ఈ ఎన్నికల్లో తేలబోతోంది.

సాధారణంగా ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనైనా అక్కడి స్థానిక సమస్యలే ప్రభావం చూపాలి. ఫలితాలు కూడా ఆ రాష్ట్రంలో వున్న ప్రభుత్వానికి అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో ఉండాలి. లోక్‌సభ ఎన్నికల ప్రాధాన్యత వేరు. అసెంబ్లీ ఎన్నికల ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ అనూహ్యంగా దాదాపు అన్ని సీట్లను గెలుచుకుంది. అలాగే ఢిల్లీలోనూ 8 లోక్‌సభ స్థానాలలో ఏడింటిని గెలుచుకుంది. అయితే ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. బీహార్‌ అసెంబ్లీలో జెడి(యు) ఆర్జేడీ కూటమి బీజేపీని తుడిచిపెట్టినందుకు కారణం అక్కడ ప్రాంతీయ పరిస్థితులు. అక్కడ ప్రజల్లో నితీష్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు. నితీష్‌కు ప్రజాదరణ వుంది. కాబట్టే మోడీని దేశ ప్రధాని కావాలనుకున్న బీహార్‌ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసారు. ఏడాది తర్వాత తమ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌ ఉండాలని కోరుకున్న ఆ రాష్ట్ర ప్రజలు దళ్‌(యు) కూటమిని గెలిపించారు. ఢిల్లీలోనూ ఇదే సీన్‌. లోక్‌సభ ఎన్నికల్లో మోడీకి జైకొట్టిన ఢిల్లీ వాసులు, అసెంబ్లీ ఎన్నికలొచ్చేసరికి బీజేపీ కంటే ఆప్‌ వైపే మొగ్గు చూపారు.

కాబట్టి రేపు జరగబోయే ఐదు రాష్ట్రాలలో కూడా ఆయా ప్రభుత్వాల పట్ల అనుకూల, లేదా వ్యతిరేకత ప్రభావం చూపవచ్చు. దీంతోపాటు జాతీయ ప్రాధాన్యత అంశమైన నోట్ల రద్దు కూడా ఈ ఎన్నికల ఫలితాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలపై పెద్దగా ప్రత్యక్ష ప్రభావం చూపవు. కాని నోట్ల రద్దు ప్రభావం దేశంలో అడుక్కునే వారి దగ్గర నుండి అంబానీ వరకు అందరి మీదా పడింది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం పెద్దనోట్ల రద్దును ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ ప్రచారాస్త్రంగానే వాడుకోబోతున్నారు. పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైందన్న విమర్శలను ఆయన పట్టించుకోవడం లేదు. పేదల కోసమే పెద్దనోట్లు రద్దు చేసామంటూ ప్రజల్లోకి పోతున్నారు. పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత పేద ప్రజలకు ఏ విధంగా మేలు జరిగిందన్నది మాత్రం ప్రధానిగాని, ఆయన మంత్రివర్గ సహచరులుగాని, ఆర్‌బిఐ వాళ్లు గాని ఇంతవరకు వెల్లడించలేదు. తమకు ఏ రూపంలో మేలు జరిగిందో కూడా ఇంతవరకు జనానికి అర్ధం కావడం లేదు. మరి అర్ధంకాని ప్రధాని ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పేదల కోసం మోడీ ఏదన్నా మ్యాజిక్‌ చేయబోతున్నారా? ప్రస్తుతం ప్రజల ఆశలు కూడా ఈ ఎన్నికల పైనే!

ముఖ్యంగా యూపి ఎన్నికలు కీలకం కానున్నాయి. ఎక్కువ లోక్‌సభ స్థానాలు, ఎక్కువ అసెంబ్లీ స్థానా లతో పాటూ ఎక్కువ జనాభా వున్న రాష్ట్రం ఇది. ప్రస్తుతం బీజేపీకి ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేదు. కాని ప్రభుత్వంపై కన్నేశారు. దీనికోసం ఎప్పటి నుండో వ్యూహరచన చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతి రేకతతో పాటు, సమాజ్‌వాదీ పార్టీలో వచ్చిన అంత ర్యుద్ధం బీజేపీకి కలిసొచ్చే అంశాలు. కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా, లేదా పెద్ద పార్టీగా అవతరించినా అది మోడీ ఘనతే అవుతుంది. అలాకాకుండా పార్టీ రెండో స్థానానికో మూడో స్థానంలోకి వెళ్లినా అది పెద్దనోట్ల రద్దు ఎఫెక్టే అవుతుంది.

అలాగే ప్రస్తుతం ఎన్నికలు జరిగే గోవాలో బీజేపీ అధికారంలో వుంది. మణిపూర్‌లో ఇటీవలే కాంగ్రెస్‌ చీలికవర్గంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పంజాబ్‌లో మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్‌తో కలిసి అధికారంలో వుంది. ఉత్తరాఖండ్‌లో మాత్రం కాంగ్రెస్‌ అధికారంలో వుంది. ఈసారి పంజాబ్‌, గోవాలలో బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే!

ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి బీజేపీయే రావచ్చు. ఈ ఐదు రాష్ట్రాల్లో యూపితో పాటు మరో రెండు రాష్ట్రాల్లోనన్నా బీజేపీ జెండా ఎగిరితేనే మోడీ పదవి పదిలం! ఆయన నోట్ల రద్దును ప్రజలు ఆదరించినట్లు! యూపితో పాటు మిగతా రాష్ట్రాలలో బీజేపీ చతికిలబడితే మోడీ కుర్చీ

క్రిందకే నీళ్ళు ఖాయం.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter