11 January 2017 Written by 

నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ స్థానంపై.. జగన్‌ ప్రత్యేకశ్రద్ధ!

ysr nelloreత్వరలో జరగబోయే స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలపై వైకాపా అధి నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధ చూపిస్తున్నాడు. 2019 ఎన్నికల ప్రచా రానికి ఈ ఎన్నికల నుండే శ్రీకారం చుట్టా లని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారపార్టీని అన్ని స్థాయిలలో ఢీ కొట్టే దిశగా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధ మవుతున్నారు. తన సొంత జిల్లా అయిన కడప జిల్లా స్థానిక ఎమ్మెల్సీతో పాటు నెల్లూరుజిల్లా ఎమ్మెల్సీని కూడా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కడప జిల్లా అభ్యర్థిగా తన చిన్నాన్న వై.యస్‌.వివేకా నందరెడ్డినే నిలబెట్టబోతున్నారు.

సొంత జిల్లా కడప తర్వాత వైకా పాకు బలంగా ఉండేది, జగన్‌కు వెన్ను దన్నుగా ఉండేది నెల్లూరుజిల్లానే! ఈ జిల్లా నాయకులు, ఎమ్మెల్యేల మీద కూడా జగన్‌కు నమ్మకమెక్కువ. ఎందుకంటే సొంత జిల్లాలో ఇద్దరు వైకాపా ఎమ్మె ల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశంకు మారారు. కాని నెల్లూరుజిల్లా నుండి ఒకే ఒక్క ఎమ్మెల్యే తెలుగుదేశంలోకి వెళ్లాడు. మిగతా ఎమ్మెల్యేల మీద ఎంత ఒత్తిడి వచ్చినా ఎవరూ పార్టీ మారలేదు.

ఈ జిల్లాలోని తన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల మీద వున్న నమ్మకంతోనే జగన్‌ ఈ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని దించాలనుకుంటున్నాడు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యం లోనే వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థి తెరమీదకు రానున్నాడు. నెల్లూరుజిల్లాకే చెందిన ఒక రియల్టర్‌ బెంగుళూరులో ఉంటున్నాడని, అతనినే ప్రతాప్‌ సూచించాడని సమా చారం. అతను ఎవరైందీ పేరు బయటకు రాలేదు. ఈ ఎన్నికలలో అతను ఓడిపో యినా భవిష్యత్‌లో నామినేటెడ్‌ ఎమ్మెల్సీ ఇవ్వాలనే హామీతో రంగంలోకి వస్తున్నట్లు సమాచారం. 2014లో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఈ జిల్లాలో వైకాపాకే ఎక్కువ ఓట్లుండేవి. తెలుగుదేశం అధికా రంలోకి వచ్చాకే వైకాపా నుండి గెలిచిన జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు చాలామంది ఆ పార్టీలోకి మారారు. దీంతో తెలుగుదేశం కంటే వైకాపా 50ఓట్లకు పైనే మైనస్‌లో వుంది. అయితే వైకాపా నుండి తెలుగుదేశంలోకి వెళ్లిన వాళ్లంతా ఆ పార్టీ మీద భక్తితోనో, చంద్రబాబు మీద అభిమానంతోనో వెళ్లి నోళ్లు కాదు... రాజకీయ అవసరాల కోసం వెళ్లిన వాళ్లే! వీళ్లకు మనసులో జగన్‌ అంటే అభిమానం వుంది. అదీగాక తెలుగు దేశంలో చేరి వీళ్లు లబ్దిపొందిందేమీలేదు. అక్కడింకా రోతగా ఉంది. జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గట్టిగా ఎలక్షన్‌ చేస్తే తెలుగుదేశం వాళ్లకు ముచ్చెమటలు పట్టించవచ్చు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter