20 January 2017 Written by 

ఆర్ధిక వ్యవస్థకు దన్ను... ఏక పన్ను

gstభారత ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలో, కేంద్రప్రభుత్వం మనదేశ ఆర్థిక వ్యవస్థను అన్నివిధాలా బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకోబోతోంది. ఇప్పటికే కొన్ని నిర్ణయాలు అమలులోకి వచ్చివున్నాయి కూడా. ఇటీవల పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఒక సంచలనం కాగా, దీని అమలులో కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఈ ఏడాది.. వచ్చే ఏడాది జీడిపి వృద్ధిరేటు తగ్గినా, భవిష్యత్తులో మాత్రం ఈ విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని ఆర్ధికవేత్తలు భావిస్తున్నారు. బ్యాంక్‌లలో డిపాజిట్లు బాగా పెరగడంతో పన్ను వసూళ్ళు కూడా బాగా పెరుగుతాయని, మరోవైపు నగదు రహిత లావాదేవీలతో ఆర్ధిక వ్యవస్థకు బలం చేకూరుతుందని, ఆర్థికవ్యవస్థ బలంగా వుంటే దేశాభివృద్ధికి, అభివృద్ధి పథకాలకు నిధుల కొరత వుండదని భావిస్తున్నారు. సాహసోపేతమైన ఈ నిర్ణయాల వల్ల దేశపురోభివృద్ధికి ఇక ఆటంకం వుండబోదని ప్రధానితో పాటు అత్యధికశాతం ప్రజలూ విశ్వసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, 'ఒకే దేశం..ఒకే పన్ను' అనే సరికొత్త ఆర్ధికవ్యవస్థకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో మన ఆర్థిక వ్యవస్థలో.. పన్నుల విధానంలో సంస్కరణలు తెస్తూ ఇంతటి బృహత్తరమైన నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రధమం. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ప్రారంభించేందుకు మోడీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తూండడం ఒక శుభపరిణామం. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ అతిపెద్ద పరోక్ష పన్నుల సంస్కరణ.. జిఎస్‌టి అత్యంత త్వరలోనే.. అంటే జులై నుంచే అమలులోకి వచ్చేందుకు కృషి జరుగుతోంది. జిఎస్‌టి విధానం అన్నివిధాల మంచిదే.. అందరూ స్వాగతించ దగినదే. దీనిని అమలుచేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గత కొద్దికాలంగా వున్న అవరోధాలు కూడా ఇక సమసిపోయినట్లే. సముద్ర వ్యాపారం విషయంలో పన్ను విధించే హక్కు కేంద్రానిదే అయినప్పటికీ రాష్ట్రాల డిమాండ్‌లను ఆమోదించడం జరిగింది. సరుకులు, సర్వీసులకు సంబంధించి అంతర్‌ రాష్ట్ర వాణిజ్యంపై సమీకృత జిఎస్‌టి వసూలు చేసే అధికారం కేంద్రప్రభుత్వానికే వుంటుంది. అయితే కొన్ని ప్రత్యేక చట్ట నిబంధనల ద్వారా ఆ హక్కును రాష్ట్రాలకు కూడా సంక్రమింపజేయడానికి నిర్ణయం తీసుకోవడంతో ఇంతకాలంగా జిఎస్‌టి అమలులో కేంద్ర-రాష్ట్రాల మధ్య వున్న ప్రతిష్టంభన తొలగిపోయినట్లేనని అనుకోవచ్చు. అంతేకాదు, నాలుగు రకాల శ్లాబ్‌లతో కూడిన జిఎస్‌టి పన్ను రేట్లకు ఇప్పటికే జిఎస్‌టి కౌన్సిల్‌ ఆమోదం లభించింది కూడా. ఒకటిన్నర కోట్ల రూపాయలలోపు వార్షిక టర్నోవర్‌ వున్న వ్యాపారుల్లో 90 శాతం మంది రాష్ట్రాల నియంత్రణలోకి, 10 శాతం మంది కేంద్రం పరిధిలోకి వచ్చేవిధంగా, ఒకటిన్నర కోట్ల రూపాయలకు పైబడిన టర్నోవర్‌ వున్న వ్యాపారసంస్థల్లో సగంమంది కేంద్ర పరిధిలో, మరో సగరమంది రాష్ట్ర పరిధిలో వుండేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సారధ్యంలో జరిగిన వస్తుసేవల పన్నుల (జిఎస్‌టి) మండలి సమావేశంలో పన్నుల సంస్కరణకు సంబంధించి ఇలాంటి పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సముద్రతీరం నుంచి 12 నాటికల్‌ మైళ్ల లోపు సముద్రంలో జరిగే వ్యాపారంపై పన్ను విధించే హక్కు తీరప్రాంత రాష్ట్రాలకే వుండేవిధంగా, పన్ను విధింపుకు సంబంధించి సప్లయ్‌ జరిగిన ప్రదేశంపై రాష్ట్రాల మధ్య ఒకవేళ ఏమైనా పేచీలుంటే ఆయా కేసుల్లో మాత్రం కేంద్రమే పన్ను విధించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. వచ్చేనెల 18న మరోసారి జరుగనున్న జిఎస్‌టి సమావేశంలో పూర్తిస్థాయి నిర్ణయాలు తీసుకోనున్నారు.

జులై 1వ తేదీ నుంచి ఈ ఏకరూప పన్ను విధానాన్ని అమలుచేసేందుకు కేంద్రప్రభుత్వం పెద్దకసరత్తే చేస్తోంది. వస్తువులు ఉత్పత్తి జరిగేచోటు నుంచి, అవి టోకు వర్తకుల వద్దకు, చిల్లర వర్తకుల వద్దకు చేరి..వినియోగదారుల చెంతకు చేరేదాకా వివిధ దశల్లో వున్న పన్నుల చక్రాన్ని సక్రమమైన గాడిలో పెట్టేందుకు, తద్వారా వినియోగదారునికి అన్నివిధాలా మేలైన పన్నుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతమైతే, ఇప్పటిదాకా అస్తవ్యస్తంగా వున్న పన్నుల మీద పన్నుల వ్యవస్థ ఒక క్రమబద్ధమైన రీతిలోకి వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఆ కలను సాకారం చేసే దిశగా మోడీ ప్రభుత్వం చేయాల్సిన కృషినంతా చేస్తోంది. ఎక్సైజ్‌ సుంకం, సేవా పన్నుతోసహా కేంద్ర స్థాయిలో ఎనిమిదిరకాల పన్నులు, ఎంట్రీ ట్యాక్స్‌తో సహా రాష్ట్రాల పరిధిలోని మరో 9 రకాల పన్నుల స్థానంలో జిఎస్‌టి ఆవిర్భవించి..'ఏక్‌ భారత్‌' అనే సవ్యమైన.. భవ్యమైన దిశలో... ఒకే పన్ను విధానానికి మార్గం వేసినట్లవుతుందని భావిస్తున్నారు. ఆకాశా న్నంటిన ధరలు కూడా దీంతో నేలకి దిగివస్తాయని, దేశీయ ఉత్పత్తులకు బాగా డిమాండ్‌ ఏర్పడి విదేశీ ఉత్పత్తులకు ధీటుగా నిలుస్తాయని, అంతర్జా తీయ మార్కెట్లలోనూ మన ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడుతుందని ఆర్ధికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. జిఎస్‌టి వల్ల వృద్ధిరేటు పెరిగి దేశానికి ప్రతిఏటా సుమారు లక్షకోట్ల దాకా ఆదాయం చేకూరుతుందని కూడా నిపుణుల అంచనా.

అనేక దేశాలు ఇప్పటికే ఏకీకృత రేటు విధానంతో పన్ను పరిధిని, వసూళ్ళ రాబడిని బాగా పెంచుకుంటున్న నేపథ్యంలో జిఎస్‌టి విధానం మనదేశానికెంతో మేలు చేకూరుస్తుందని భావిస్తున్నారు. అయితే, దీని ఆచరణలో సవాలక్ష సమస్యలూ వున్నాయి. అన్నిటినీ అధిగమిస్తూ కేంద్రరాష్ట్ర

ప్రభుత్వాలు, ఆర్థిక నిపుణులు అందరూ సమిష్టిగా, సమన్వయంతో కృషిచేస్తే.. జిఎస్‌టి అమలు సత్ఫలితాలనిస్తుందని వేరే చెప్పనక్కరలేదు. ఆర్ధిక వ్యవస్థే దేశానికి వెన్నెముక కనుక, అది ఎంత పుష్టి కరంగా వుంటే దేశానికంత ఆరోగ్యం. ఏదేమైనా, త్వరలో రానున్న ఈ సరికొత్త జిఎస్‌టి విధానం పటిష్టవంతంగా అమలులోకి వచ్చి.. దేశాభ్యున్నతికి మెరుగైన దారులు వేస్తుందనే ఆశిద్దాం!..



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter