20 January 2017 Written by 

పడకేసిన పారిశ్రామిక ప్రగతి

parisramikకృష్ణపట్నం పోర్టు... మేనకూరు సెజ్‌... అపాచీ షూ ఫ్యాక్టరీ... శ్రీసిటీ... యంబిక్యూ స్టీల్స్‌... మాస్‌హోల్డింగ్‌ గార్మెంట్స్‌... ఈ సెల్‌లలో ఎన్నో పరిశ్రమలు... వేలమందికి ఉద్యోగాలు... పెరిగిన భూముల విలువలు... కోట్లకు చేరిన రైతుల ఆస్తులు... ఆదాయాల్లో వ్యాపారాలు... దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనలో జిల్లాలో చోటుచేసుకున్న ప్రగతి కేంద్రాలు. ఆవిష్కరణకు నోచుకున్న అభివృద్ధి మార్గాలు.

నెల్లూరుజిల్లాలో భూమికి విలువ పెరిగినా, సెజ్‌లు ఏర్పడి పదిమందికి

ఉద్యోగాలు వచ్చినా, వ్యాపారాలు వృద్ధి చెందినా, రైతులు సంతోషంగా వున్నా అది వై.యస్‌. పాలనాకాలం పుణ్యమే! వై.యస్‌. కాలం నాటి ఊపుతోనే పారిశ్రామిక ప్రగతి జరిగి వుంటే నెల్లూరుజిల్లా ఇప్పటికే ఒక నోయిడా, ఒక గుర్‌గావ్‌ మాదిరిగా తయారై ఉండేది. వై.యస్‌. మరణం తర్వాత ఐదేళ్ళ రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో పారిశ్రామిక ప్రగతి మందగిం చింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పూర్తిగా ముసుగుతన్ని పడుకుంది.

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా పరిశ్రమ లంటూ లేకుండాపోయాయి. దగదర్తి వద్ద బిఎంఆర్‌ కట్టిన ఫ్యాక్టరీ, ఇఫ్కో సెజ్‌లో గమేషా పరిశ్రమ మాత్రమే వచ్చాయి. దేశంలోనే అత్యున్నతమైన సెజ్‌గా రూపొం దించిన శ్రీసిటీ సెజ్‌లో కూడా కేవలం యాజమాన్యం శ్రద్ధ, ఆసక్తి మూలంగానే ఒకటి అరా పరిశ్రమలు వస్తున్నాయి. జిల్లా పారిశ్రామిక చరిత్రనే మార్చిన కృష్ణపట్నం పోర్టు సెజ్‌లోకి కొత్తగా ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవు. క్రిబ్‌కో ఎరువుల ఫ్యాక్టరీ మంజూరైనా ఇంతవరకు శంకు స్థాపన జరగలేదు. జెన్‌కో, సెంబ్‌కార్ప్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు రన్నింగ్‌లో ఉన్నాయి. సింహపురి థర్మల్‌ కేంద్రం, ఎంబిక్యూ స్టీల్స్‌ను మూసివేశారు. కృష్ణపట్నం పోర్టులో మొత్తం 42బెర్తుల నిర్మాణం జరగాలి. ఇప్పటికే పది పూర్తయ్యాయి. అయితే ఇటీవలకాలంలో ఆ పది బెర్త్‌లకే బిజినెస్‌ లేదు. ముఖ్యంగా బళ్లారి నుండి ఐరన్‌ఓర్‌ ఎగుమతి ఆగిపోవడం పోర్టు వాణిజ్యంలో పెద్ద కుదుపు! పవర్‌ ప్రాజెక్ట్‌లు ఉండబట్టి బొగ్గుల నౌకలు వస్తున్నాయి. యూరియా, చక్కెర వంటివి దిగుమతి చేసుకుంటుండ బట్టి కొంత వ్యాపారం జరుగుతోంది. కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకపోతుండడమే పారిశ్రామిక ప్రగతికి ప్రతిబంధకంగా మారుతోంది. ఈ మూడేళ్లలో జిల్లాలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటీ ఏర్పాటు కాలేదు. కొత్తగా ఉపాధి అవకాశాలు లేవు. పరిశ్రమలు లేకపోవడం వల్లే రియల్‌ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలలో ఒడిదుడుకులు మొదలయ్యాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter