20 January 2017 Written by 

పల్లెల్లో కళకళ... పట్టణాలు వెలవెల!

sankraపల్లెసీమలు... పాత తరాలవారు తప్పితే కొత్త జనరేషన్‌ అక్కడ ఉండడం లేదు. పొలాల మీద ప్రేమ వున్నోళ్లు, పశువుల మీద మమకారం చావని వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటున్నారు. ఈ జనరేషన్‌లో ఒంటికి చదువు అబ్బని వాళ్ళు ఆ పల్లెల్లో స్థిరపడిపోతున్నారు. అంతేగాని చదువు వంటబట్టి, చిన్నదో పెద్దదో ఉద్యోగం తెచ్చుకున్న వాళ్లెవరూ పల్లెటూర్లలో ఉండడం లేదు. ప్రతి గ్రామంలోనూ వృద్ధులు, వారి బిడ్డలు మాత్రమే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మనవళ్లు, మనుమరాళ్లు మాత్రం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తూనో, ఇతర ఉద్యోగాలు, వ్యాపారులు చేసుకుంటూనో విదేశాలు, నగరాలు, పట్టణాలలో ఉంటున్నారు. ఏడాది పొడవునా వ్యాపారాలు, ఉద్యోగాలలో బిజీగా వుంటూ, ఆధునిక పోకడల మోజులో పడి పల్లెటూరు మట్టివాసనను మరచిపోతుంటారు. ఏడాది పొడవునా నగరం నీడలో గడిపిన నేటి తరం వాళ్లను మూడురోజులు మాత్రం పల్లెలు అక్కున చేర్చుకుంటాయి. గుండెలకు హత్తుకుంటాయి. వారి పొలాలను, పొలాల్లో పైర్లను, వాటిలోని పరిమళాలను చూపిస్తాయి. పట్టణాలు, గ్రామాలలో 362రోజులు పడ్డ కష్టాన్ని ప్రజలు పల్లె సీమల్లో అడుగుపెట్టిన ఈ మూడురోజుల్లోనే మరచిపోతారు.

ప్రతి ఏడాది పల్లెలకు పట్టణాల కళ వచ్చేది సంక్రాంతి పండుగ మూడురోజులే! ఎంతటి దూరభార ప్రాంతాల్లో ఉన్నోళ్లయినా సంక్రాంతికి తమ ఊర్లకు పోవడానికి ఇష్టపడతారు. విదేశాలలో వున్నోళ్లు సైతం రెక్కలు కట్టుకుని సంక్రాంతికి తమ ఊర్లలో వాలుతారు. జిల్లాలోని అన్ని గ్రామాలు ఈ సంక్రాంతి పండుగ మూడురోజులు కళ కళలాడాయి. అమెరికా, ఇంగ్లాండ్‌, గల్ఫ్‌ దేశాలతో పాటు ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాలలో వున్న జిల్లా వాసులందరూ సంక్రాంతికి తమ ఊర్లకు పరుగెత్తారు. ఈ మూడురోజులు తల్లిదండ్రులు, బంధుమిత్రులతో సరదాగా గడిపారు. చిన్ననాడు చదివిన స్కూళ్లు, మొక్కిన గుళ్లకు వెళ్లారు. ఈత కొట్టిన చెరువును, తాత కొట్టిన దెబ్బలను గుర్తు చేసుకున్నారు. ఎడ్ల పందేలు, కోళ్ల పందేలను తిలకించారు. బోగి మంటలు వేసుకున్నారు. హరిదాసు, బుడబొక్కల వేషాలను ఆస్వాదించారు. ఊరేగింపులో వచ్చిన దేవుడికి మొక్కుకున్నారు. ఎలిమెంటరీ స్కూల్‌లో, హైస్కూల్‌లో చదువుకున్న స్నేహితులను కలుసుకున్నారు. ఈ మూడురోజులు నగరాలు, పట్టణాల నుండి బస్సులు, కార్లన్నీ పల్లెలవైపే పరుగులు తీసాయి. సంక్రాంతి పండుగలో పల్లెసీమలు కళకళలాడితే పట్టణాలు కళతప్పాయి.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…

Newsletter