20 January 2017 Written by 

20-01-2017 రాశిఫలాలు

rasi 20

1Ariesమేషం

ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతుంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార విస్తరణ ఆలోచనలను తాత్కాలి కంగా వదలండి. ఖర్చులు ఎక్కువగా వుండి రుణం చేయవలసివస్తుంది. ఆలోచనలు పెరిగి మానసిక వత్తిడి వుంటుంది. అనుకున్న పనులు నిదానంగా జరుగు తాయి. వృత్తి వ్యాపారాలలో సామాన్య ఆదాయం వుంటుంది. రావలసిన బాకీలు నిలబడిపోతాయి.

 

2Taurusవృషభం

పనులు హడావిడిగా సాగుతాయి. వృత్తిపరంగా అభివృద్ధి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు సామా న్యంగా సాగుతాయి. కోర్టు కేసులు వాయిదా పడగలవు. ఉద్యోగులకు అదనపు పనిభారం వుంటుంది. అధికా రులకు కొత్త బాధ్యతలు స్థానచలనం ఉంటుంది. దూర ప్రయాణాల శ్రమ. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఆర్ధికంగా కుదుటపడతారు. విద్యాప్రగతి కలదు.

 

3Geminiమిధునం

ఆర్ధికస్థితి బాగుంటుంది. వ్యాపార విస్తరణ, కొత్త ఆదాయ అవకాశాలు దొరుకుతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా వుంటాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. విద్యార్థులకు చదువుపై మరింత శ్రద్ధ అవసరం. ప్రభుత్వ అనుమతులలో ఆలస్యం కాగలదు. దూరప్రయాణాలు నిర్ణయం కాగలవు. సోదరవర్గంతో చిన్న సమస్యలుండవచ్చును.

 

4Cancerకర్కాటకం

చేయదలచిన ఆలోచనలు కార్యరూపంలోనికి వస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా వుండి కొద్ది లాభాలుంటాయి. అవసరాలకు డబ్బు చేతికి అందు తుంది. వస్తు వాహన రిపేర్లు, కుటుంబ సభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. కొత్త అగ్రిమెంట్లు, సంప్రదిం పులు ఫలించగలవు. ముఖ్య వ్యక్తులను కలుసుకొనలేక పోవచ్చును. కోర్టు కేసులు వాయిదా పడతాయి.

 

5Leoసింహం

ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. నిర్ణయాలు సొంతంగా తీసుకుంటే మంచిది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగి ఆదాయం పెరుగు తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలుంటాయి కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభకార్యముల నిర్ణయం జరుగుతుంది. అనుకున్నపనులు సరిగా జరగక చికాకు, టెన్షన్‌ వుంటుంది.

 

6Virgoకన్య

ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత బాగుంటుంది. ఆడిటర్లు, పరిశ్రమ యజమానులకు, న్యాయవాదులకు, చిన్న పరిశ్రమల వర్గాలకు ఆదాయం బాగుంటుంది. చేయదలచిన పనులు నిదానంగా జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు, రావలసిన బాకీలు వాయిదా పడగలవు. శుభకార్యాల ప్రయత్నాలు పెరుగుతాయి. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

7Libraతుల

వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా వుంటాయి. ఆదాయానికి ధీటుగా ఖర్చులుంటాయి. అవసరాలకు డబ్బు రూపంలో ఇతరులనుంచి సహాయం దొరుకుతుంది. అనుకున్న పనులకు అవకాశాలు బాగుండి నెమ్మదిగా జరుగుతాయి. ముఖ్య వస్తువులు పత్రాలు నగదు జాగ్రత్తపరచుకొనండి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. ఉద్యోగార్థులు కొద్దికాలం వేచివుండాలి.

 

8Scorpioవృశ్చికం

కొత్త పరిచయాలు జరిగి ప్రయోజనం పొందు తారు. అనుకున్న పనులు ఏదో ఒకవిధంగా నెరవేరు తాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. సభలు సమావేశాల్లో ప్రముఖ పాత్ర నిర్వహిస్తారు. కోర్టుకేసులు కొంత సానుకూలం కాగలవు. ఉద్యోగులకు పనిభారం బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగార్థులకు అనుకూలత బాగుంటుంది. విద్యాప్రగతి బాగుంటుంది.

 

9Sagittariusధనుస్సు

కుటుంబంలో కొద్దిపాటి భేదాభిప్రాయాలుండి సర్దుబాటు కాగలదు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి బాగుండి ఆదాయం పెరుగుతుంది. కొన్ని అనవసర ఖర్చులు తప్పనిసరిగా వుంటాయి. ఇతరులతో నెమ్మదిగా, శాంతంగా వ్యవహారాలు జరపడం మంచింది. కాకుంటే తగవులు ఏర్పడే అవకాశం వున్నది. కోర్టు కేసులందు కొంత అనుకూలత కలదు.

 

10Capricornమకరం

అవసరాలకు ఇతరులను బట్టి సర్దుకునిపోతూ పనులు జరుపుకొనవలసివుంటుంది. చిరువ్యాపారులు, వృత్తిజీవనం కలవారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. శుభ కార్యాలు నిర్ణయం కాగలవు. వ్యాపార విస్తరణకు, కొత్త పెట్టుబడులకు అవకాశాలు సరిగా వుండవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అధికార వర్గంతో సత్సంబంధాలు వుంటాయి.

 

11Aquariusకుంభం

కుటుంబంలో సమస్యలుంటే చర్చించి పరిష్క రించగలరు. జీవితభాగస్వామికి ఆరోగ్య లోపం కలుగ వచ్చును. దూర ప్రయాణాలుంటాయి. ప్రభుత్వ సమ్మా నాలు పొందడం, అధికారులతో సన్నిహితంగా మెలగడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సామాన్య ఆదాయం వుంటుంది. ఆర్థిక ఇబ్బంది లేకున్నను సంతృప్తి వుండదు. అనుకున్న పనులు సరిగా జరుగక టెన్షన్‌ పడుతుంటారు.

 

12Piscesమీనం

అనుకున్న పనులు సక్రమంగా జరుపుకొనగలిగిన సమర్థత వుంటుంది. ఆర్థికస్థితి బాగుంటుంది. రావలసిన బాకీలు కొంతవరకు లభిస్తాయి. ప్రభుత్వ అనుమతులు పొందగలరు. చెల్లింపులు, పన్నులు చెల్లించగలరు. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. పట్టింపులు పంతాలకు పోకుండా ఎదుటివారికి విలువ ఇవ్వవలసి వుంటుంది. విద్యార్థులకు విద్యాప్రగతి బాగుంటుంది.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
 • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
  నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
 • నేరం మా వాళ్ళది కాదు
  రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
 • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
  ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
 • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
  నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter