03 February 2017 Written by 

జిల్లాలో 'స్వైన్‌' విహారం

pigsకొత్త సంవత్సరం ఆరంభంలోనే కొత్త వ్యాధులు జిల్లా ప్రజలను భయపెడు తున్నాయి. చికున్‌గున్యా, మలేరియా, అతిసార, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రతిఏటా జిల్లా ప్రజలను చుట్టం చూపుగా వచ్చి పలకరించిపోతుంటాయి. ఇప్పుడు చుట్టపు చూపుగా వచ్చే రోగాల్లో స్వైన్‌ఫ్లూ కూడా చేరడం జిల్లా ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

ఈ సీజన్‌లో వ్యాధులు వస్తేనే జిల్లాలో డాక్టర్లకు గాని, లేబొరేటరీలకు గాని, మందుల షాపుల వాళ్లకు గాని పెద్దపండుగ లెక్క! క్రమం తప్పకుండా ఈ రోగాలు వస్తుండబట్టే నెల్లూరుజిల్లాలో చాలా మంది డాక్టర్లు స్థిరాస్థులు పెంచుకోగలుగుతున్నారు. కట్టిన కార్పొరేట్‌ ఆసుపత్రులకు సక్రమంగా బ్యాంకులకు ఈఎంఐలు కట్టగలుగుతున్నారు. స్వైన్‌ఫ్లూ ప్రాణానికే ప్రమాదం. ఈ రోగం రాకుండా నివారించడం ఉత్తమ మార్గం. స్వైన్‌ఫ్లూ బారిన పడ్డా రంటే, దానికి తగ్గ వైద్యసదుపాయాలు నెల్లూరులో లేవు. చెన్నై వంటి నగరాలలో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఖచ్చితంగా ఈ రోగం తగ్గుతుందన్న నమ్మకం లేదు.

జిల్లాలో మొన్ననే ఓజిలి, తడ మండలాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు బయటపడ్డాయి. కాగా, తాజాగా కావలి మున్సిపాల్టీలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న బోరెడ్డి రాధామోహన్‌రెడ్డి(40) స్వైన్‌ఫ్లూతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కావలి పట్టణంలోనే మరో వ్యక్తి స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలతో కావలి పట్టణంలోనూ భయాం దోళనలు నెలకొంటున్నాయి.

జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సివుంది. స్వైన్‌ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. దాహం వేసాక బోరు వేయించుకుందాం అన్నట్లుగా ఉండే వైద్యఆరోగ్యశాఖ దీనిపై తక్షణం స్పందించాలి. స్వైన్‌ఫ్లూపై అవగాహన సదస్సులు, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలి.

నెల్లూరు నగరంతోపాటు పలు పట్టణాలు, గ్రామాల్లో మనుషులతో కలిసి పందులు కూడా నివసిస్తున్నాయి. పందుల ఏరివేతపై నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఏ మున్సిపాల్టీవాళ్లు కూడా పట్టించుకోవడం లేదు. స్వైన్‌ఫ్లూ వైరస్‌ అన్నది పందుల నుండే వస్తుంది. జనావాస ప్రాంతాల్లో పందుల సంచారం లేకుండా చేయాలి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ గట్టిగా అదిలిస్తేగాని వైద్యఆరోగ్య సిబ్బంది ఈ విషయంపై కదిలి పని చేయరు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…

Newsletter