Friday, 03 February 2017 07:20

అంతుబట్టని అజీజ్‌... అటు లోకేష్‌ భజన.. ఇటు వైసిపితో మంతనాలు!

Written by 
Rate this item
(0 votes)

azizఎవ్వరి మాటా వినడు ఈ సీతయ్య అన్నటైపులో తయారయ్యాడు నెల్లూరు మేయర్‌ అజీజ్‌. నాకెవరూ బాస్‌లు లేరు. నాకు నేనే బాస్‌ని అన్నట్లుగా వ్యవహరిస్తూ తన పార్టీ వాళ్లకు, తనను పార్టీలోకి తీసుకొచ్చిన వాళ్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాడు. జిల్లా తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క నాయకుడితోనూ ఆయనకు సఖ్యత, సమన్వయం లేకుండా పోయాయి. సోమిరెడ్డి, ఆదాల, బీద... ఇలా అందరితో దూరమే! ఆనం అంటే ముందు నుండీ పడదు. సరే, వీళ్లందరినీ పక్కనపెట్టినా తనను పార్టీలోకి తీసుకొచ్చిన మంత్రి నారాయణతోనన్నా బాగుంటున్నాడా? ఆయన మాటకు గౌరవమిస్తున్నాడా అంటే అదీ లేదు. మంత్రి నారాయణ అంటే ఆయనకు బొటనవేలి మీద వెంట్రుకతో సమానమైంది. మేయర్‌కు మంత్రితో పాటు ముఖ్యమైన జిల్లా తెలుగుదేశం నాయకులతో సఖ్యత లేదు. తన పార్టీ కార్పొరేటర్ల మద్దతు లేదు. అయినా అజీజ్‌ అందరినీ ఢీకొంటున్నాడు. ప్రతి ఒక్కరితో కయ్యానికి సై అంటున్నాడు. అతని ధైర్యానికి కారణమేంటి? అతను ఆడుతున్న గేమ్‌ ఏంటి?

అతనికి జిల్లా తెలుగుదేశం నాయకులతో సఖ్యత లేకపోయినా తెలుగుదేశం యువరాజు లోకేష్‌తో సన్నిహితంగా ఉంటున్నాడు. తనపై లోకేష్‌ బ్రాండ్‌ వేయించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అజీజ్‌కు మైనార్టీ ముద్ర కూడా కలిసొచ్చే అంశం. వచ్చే ఎన్నికల్లో మైనార్టీ కోటా నుండి నెల్లూరు నగరం సీటును దక్కించుకోవాలని అతని ప్లాన్‌. అందుకు లోకేష్‌ ఆశీస్సులుంటేచాలని నమ్మకం. కాబట్టే లోకేష్‌ను కాకా పడుతున్నాడు. అదే సమయంలో నెల్లూరు కార్పొరేషన్‌లో వైకాపా వారితో మంతనాలకు తెరతీసి డబుల్‌ గేమ్‌ ఆడుతున్నాడు. పార్టీ మారి తప్పు చేసానని, వైకాపా కార్పొరేటర్లు సహకరిస్తే కార్పొరేషన్‌లో తెలుగుదేశం వాళ్లతో ఫుట్‌బాల్‌ ఆడుకుంటానంటున్నాడు. ఈమేరకు కార్పొరేషన్‌లో వైకాపా ప్రతినిధులుగా వ్యవహరించే పి.రూప్‌కుమార్‌యాదవ్‌, బొబ్బల శ్రీనివాసయాదవ్‌ల సహకారం అభ్యర్థించాడు. అయితే ఒకసారి అజీజ్‌ చేతిలో మోసపోయిన వాళ్లు మళ్లీ అంత తొందరగా అజీజ్‌ను నమ్మలేరుగా! అదీగాక ఈ విషయంలో వైకాపా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనిల్‌ల నిర్ణయమే కీలకం. అజీజ్‌ తెలుగుదేశంలోనే వుంటే ఆయనకు సహకరించినంత మాత్రాన వైకాపాకు అదనంగా వచ్చే ప్రయోజనమేదీ లేదు.

రాజకీయంగా మంత్రి నారాయణకు ఇంతవరకు ఎవరితోనూ పెద్ద ఇబ్బంది రాలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తనపై తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు కూడా ఆయన ఏదో నాలుగు సినిమా డైలాగ్‌లు వదిలి సరిపెట్టుకున్నాడు గాని, వారితో తీవ్రమైన రాజకీయ యుద్ధం జరిపింది లేదు. అజీజ్‌ రూపంలో ఎదురైన సవాలే మంత్రి నారాయణను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అజీజ్‌పై ఏదన్నా చర్య తీసుకుందామా? అంటే మైనార్టీ ముద్ర అడ్డమొస్తోంది. అలాగని చూస్తూ వదిలేస్తే సొంత కార్పొరేషన్‌లో అడ్డం తిరిగిన మేయర్‌నే ఏం పీకలేని నారాయణ ఇక మంత్రిగా ఏం వెలగబెడతాడనే ప్రశ్న వస్తుంది! మొత్తానికి అజీజ్‌ వైఖరితో జిల్లా తెలుగుదేశంలోనే అంతర్మధనం మొదలైందని చెప్పొచ్చు.

Read 307 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నారాయణను వదలని అనిల్‌
    మున్సిపల్‌ మంత్రి నారాయణకు ఎవరితోనూ సమస్యలు లేవు. ప్రతిపక్ష నాయకులు కూడా ఆయనపై పెద్దగా విమర్శలు చేయరు. కాని, నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ మాత్రం నారాయణకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయనకు కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఈ నాలుగేళ్ళలో మంత్రి…
  • వేసవి సెలవులు... వినోదం కావాలే గాని విషాదం కాదు
    వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు.…
  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆదాల ఏ పార్టీ ఆటగాడో?
    ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో కొన్ని సెంటిమెంట్లున్నాయి. దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసినోళ్ళు తర్వాత ఎన్నికల్లో గెలవరని. ఎన్నికలకు ముందు శ్రీకాళహస్తికి వెళితే ఓడిపోతారని... ఇలా కొన్ని సెంటిమెంట్లున్నాయి. అలాగే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్‌ కూడా…

Newsletter