03 February 2017 Written by 

03-02-2017 రాశిఫలాలు

rasi 03

1Ariesమేషం

శుభకార్య ప్రయత్నములలో పాల్గొంటారు. ఉద్యో గార్ధులకు అవకాశాలు కలసివస్తాయి. కొత్త వసతులు సమకూర్చుకొంటారు. రాజకీయ వర్గాలకు ఇబ్బందికర దినములివి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనండి. కుటుంబ సౌఖ్యముంటుంది. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు తొలగి రాబడి పెరుగు తుంది. అవసరాలు ఏదో ఒక విధంగా నెరవేరగలవు.

 

2Taurusవృషభం

కోర్టు కేసులు వాయిదా పడగలవు. సభలు, సమా వేశాలలో పాల్గొంటారు. ప్రముఖులతో చర్చలుండగలవు. కుటుంబసభ్యులకు గాని బంధువర్గంలో గాని అనారోగ్య బాధితులుంటారు. ఉద్యోగులకు బాగా శ్రమ పని భారం ఉంటుంది. ఉద్యోగావకాశాలు లభించగలవు. కుటుంబ సౌఖ్యము, విద్యాప్రగతి బాగుంటుంది. శుభకార్య ప్రయ త్నాలను ముమ్మరంగా చేస్తారు.

 

3Geminiమిధునం

దూరప్రయాణాలు, సామాజిక సేవా కార్యక్ర మాలకు వెళతారు. ఉద్యోగులు అధికారులతో పబ్లిక్‌తో జాగ్రత్తగా ఉండాలి. యజమానులు వర్కర్లతో జాగ్రత్త పడండి. విద్యాప్రగతి బాగుంటుంది. రాజకీయ వర్గాల వారు విమర్శనలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అనుకున్న పనులు ఆటంకాలు తొలగి సవ్యంగా జరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెంది ఆదాయం పెరుగుతుంది.

 

4Cancerకర్కాటకం

దూరప్రయాణాలుంటాయి. కొత్త కాంట్రాక్టులు, లీజులు లభించగలవు. బంధువర్గం నుండి అనారోగ్య వార్తలు వింటారు. విద్యాప్రగతి బాగుంటుంది. ఇతరుల పనులు చేయబోయి ఇబ్బందుల్లో పడతారు. కోర్టు వ్యవ హారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. పంతాలు పట్టుదలకు పోకుండా పనులు జరుపుకొనాలి. ఖర్చులు ఎక్కువుగా ఉంటాయి. పరిమితి విధించుకొనండి.

 

5Leoసింహం

కొత్త పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. ఋణాలివ్వడం, హామీలివ్వడం చేయవద్దు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. పనులు నిదానంగా జరుగుతూ టెన్షన్‌ కలిగిస్తాయి. ఆరోగ్యం సరిగా ఉండదు. అనవసర విషయాలు, కుటుంబవ్యక్తుల పనులు ఆందోళన కలిగిస్తాయి. ఆదాయ ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి. వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం పెరుగుతుంది.

 

6Virgoకన్య

ఉద్యోగ ప్రయత్నాలలో అవకాశాలు దొరుకుతాయి. షేర్లు, స్థిరాస్తుల మీద ఆదాయం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులకు పనిభారం అధికారుల వత్తిడి ఎక్కువుగా ఉంటుంది. ముఖ్య ఆర్ధిక లావాదేవీలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు అయినవి అనిపిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహ కరంగా జరుగుతాయి.

 

7Libraతుల

కోర్టు కేసులు, రావలసిన బాకీలు వాయిదా పడ తాయి. ఉద్యోగార్ధులకు అవకాశాలు లభించగలవు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. తొందరపడి అతిగా విశ్వసించి ఇబ్బందులు పడతారు. విద్యా కృషి అవసరం. ఖర్చుల తాకిడి పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంది. కుటుంబసభ్యుల పనుల వల్ల ఇబ్బందులు పడతారు. ఆదాయం సామాన్యం.

 

8Scorpioవృశ్చికం

శుభకార్యాలు నిర్ణయం కాగలవు. సామాజిక సేవ, సమావేశాలలో పాల్గొంటారు. ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితులుంటాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఇంటర్వ్యూ అవకాశాలు, అనుకోని దూరప్రయాణాలు, కోర్టు వ్యవ హారాలు వాయిదా పడటం ఉంటుంది. వ్యవహారాలు ఇంటా బయటా స్వయంగా పర్యవేక్షించండి.

 

9Sagittariusధనుస్సు

కుటుంబసభ్యుల సహకారం, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఉద్యోగులు తమ అధికారులతోను పబ్లిక్‌ తోనూ జాగ్రత్తగా మెలగండి. సమస్యలను రాజీమార్గంలో పరిష్కరించుకొంటే మంచిది. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. కొత్త కాంట్రాక్టులు, లీజులకు అనుకూలత బాగుంది. ఆర్ధిక ఇబ్బందులుండినా డబ్బులు సర్దుబాటు కాగలవు. వృత్తివ్యాపారాల్లో సామాన్య ఆదాయం.

 

10Capricornమకరం

ఉద్యోగులకు పనిభారం, వత్తిడి ఎక్కువగా ఉం టుంది. విద్యాప్రగతి బాగుంటుంది. వస్తు వాహన రిపే ర్లుంటాయి. శుభకార్యాలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆరోగ్యం జాగ్రత్త. కార్యనిర్వహణ సామర్ధ్యం బాగుండినా జరుపదలచిన పనులకు ఆటంకాలుండగలవు. అందుచే కోపం టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులుం టాయి. కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడతారు.

 

11Aquariusకుంభం

ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉన్నది. అను కోని ప్రయాణాలుండటం, శుభవార్తలు వినడం, పెట్టు బడులు, వాణిజ్య విస్తరణకు అవకాశాలు దొరకడం ఉంటుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఆర్ధికంగా పరిస్థితులు సంతృప్తికరం. స్థిరాస్తులు, షేర్ల మీద ఆదాయం ఉంటుంది. కొత్త పరిచయాలు బలపడి, పలుకుబడి పెరుగుతుంది.

 

12Piscesమీనం

ఉద్యోగావకాశాలు లభించగలవు. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యసామర్ధ్యం, అధికారుల ఆదరణ బాగుంటుంది. విద్యాప్రగతి బాగుంటుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. బంధుమిత్రులను కలుసు కొంటారు. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపా రాలలో మంచి అభివృద్ధి, రాబడి ఉంటుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter