03 February 2017 Written by 

పోర్టులో పతంజలి

ramdevఅగ్గిపుల్ల అమ్ముకోవడానికైనా, సబ్బు బిళ్ల అమ్ముకోవడానికైనా ఈరోజు ఆయా ఉత్పత్తుల కంపెనీలు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్‌ ఇచ్చి స్టార్‌ హీరో, హీరోయిన్‌లతో ప్రకటనలు గుప్పిస్తుంటాయి. ఒక్క భారత దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా కార్పొరేట్‌ కంపెనీలు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం సినీ తారలు, లేదా క్రీడాకారుల మీదనే ఎక్కువుగా ఆధార పడుతుంటాయి. అలాంటి స్టార్‌ క్యాంపెయిన్‌ను కాదని, వస్తువుల మార్కెటింగ్‌కు తారలే అవసరం లేదని, ప్రజల్లో నమ్మకం వున్న వ్యక్తయితే చాలని నిరూపించిన స్టార్‌ మార్కెటింగ్‌ అంబాసిడర్‌, యోగా గురువు బాబా రాందేవ్‌! కేవలం ఒంటి మీద కాషాయం గుడ్డతో, పెరిగిన గడ్డంతోనే వందలు, వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సన్యాసి ఆయన! ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ ఆదరణ పొందుతున్న 'పతంజలి' కంపెనీ ఉత్పత్తులకు ఆయనే ప్రచారకర్త! ఆయన ప్రకటనలు చూసే ప్రజలు వేలంవెర్రిగా పతంజలి ఉత్పత్తులను కొంటున్నారు. వస్తువుల అమ్మకానికి సిక్స్‌ప్యాక్‌ బాడీగాని, సెక్సప్పీల్‌ వున్న తారలు గాని అవసరం లేదని లోకానికి చాటిన బాబా రాందేవ్‌ ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకు నెల్లూరుజిల్లాలోని కృష్ణపట్నం పోర్టును వేదికగా చేసుకోబోతున్నాడు. సోమవారం కృష్ణపట్నంపోర్టుకు విచ్చేసిన ఆయన దేశంలోనే అతిపెద్ద పతంజలి ఆయుర్వేద ఫుడ్‌పార్క్‌ను పోర్టు సెజ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పోర్టు యాజమాన్యంతో చర్చించి త్వరలోనే శంకుస్థాపన తేదీని నిర్ణయిస్తామని, ఏడాదిలోపే తమ ఫుడ్‌పార్క్‌లో వస్తువుల ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోర్టు ఎం.డి చింతా శశిధర్‌, సి.ఇ.ఓ ఎండ్లూరి అనిల్‌, పి.ఆర్‌ హెడ్‌ జి.వేణుగోపాల్‌ పాల్గొన్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…
  • జిల్లాలో వైకాపా... బలముంది... బలమైన నాయకత్వమే కావాల్సివుంది
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. కడప, కర్నూలు తర్వాత నెల్లూరుజిల్లానే వైసిపికి కంచుకోట! ఇంకోరకంగా చెప్పాలంటే ఆ రెండు జిల్లాల్లో వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది తెలుగుదేశంలోకి జంప్‌ అయినా, నెల్లూరుజిల్లాలో మాత్రం ఒకే…

Newsletter