10 February 2017 Written by 

నెల్లూరు 'దేశం'లో... నేతల కల్లోలం!

netaluపాత తెలుగుదేశం, కొంచెం కాంగ్రెస్‌, కొత్త వైయస్సార్‌ కాంగ్రెస్‌, కొంత బీజేపీ... ఈ పార్టీ లన్నింటిని గ్రైండర్‌లో వేసి రుబ్బి తీస్తే వచ్చిన పిండే నెల్లూరుజిల్లా తెలుగుదేశంపార్టీ! ఇక్క డున్నది నూరుశాతం తెలుగుదేశం కాదు, అన్ని పార్టీల నుంచి వచ్చిన నాయకుల సమూహమే ఈ జిల్లా పార్టీ!

కాబట్టే వర్గపోరులో కాంగ్రెస్‌పార్టీ కంటే కంపుగా తయారైంది. రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ బలహీనంగా వున్న జిల్లాల్లో నెల్లూరు ప్రధానంగా వుంది. 2014ఎన్నికల్లో ఎంపీ సీటును కోల్పోవడంతో పాటు,కేవలం 3 అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలి చింది. అది కూడా వైకాపా వాళ్ల స్వయం కృతాపరాధం వల్ల! తెలుగుదేశం అధికా రంలోకి వచ్చినా జిల్లాలో ఇంతవరకు పార్టీ బలపడే పనులేవీ జరగలేదు. కాం గ్రెస్‌ నాయకులను, ఒక వైసిపి ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నా, దానివల్ల పార్టీకి కలిగే ప్రయోజనం పెద్దగా లేదు. జిల్లా మంత్రిగా నారాయణ ఉన్నప్పటికీ పార్టీ పటిష్టత కోసం ఆయన ఏ మాత్రం పని చేయడం లేదు. సోమిరెడ్డి లాంటి సీనియర్‌ నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పించక పోవడంతో కేడర్‌లో నిస్తేజం నెలకొంది.

జిల్లాలో ఇంత వరకు కూడా పార్టీ పరిస్థితి నిరాశాజనకంగానే వుంది. కాగా తాజాగా జిల్లాలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి. నెల్లూరుజిల్లా స్థానిక శాసనమండలి పార్టీ టిక్కెట్‌ తెలుగుదేశం నేతల మధ్య చిచ్చు రగిల్చింది. ఈ టిక్కెట్‌ నాదేనంటూ ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి చెప్పుకుని తిరుగుతుండగా, ఇదే సీటు కోసం మాజీఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాకాటికి సీటిస్తే వైకాపాకు పండుగ. ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తారు. అదే ఆదాల అయితే గెలుపుకు ఢోకా లేదు. ఈ ఎమ్మెల్సీ టిక్కెట్‌ పోటీ పార్టీలో కుమ్ములాటలకు కేంద్రంగా మారింది. ఇక జిల్లాలో ముఖ్యమైన నాయ కులను సంప్రదించకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం కూడా విభేదాలకు దారితీస్తోంది. ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయ సమా వేశంలో ఎవరిని అడిగి అభ్యర్థిని నిర్ణ యించారంటూ మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇక నెల్లూరు కార్పొరేషన్‌ చూస్తే అధికారపక్షం, విపక్షం అంతా తెలుగుదేశం వాళ్లే! కార్పొరేషన్‌ కేంద్రంగా తెలుగుదేశంపార్టీలోనే ఐదు గ్రూపులు ఏర్పడ్డాయి. మేయర్‌ అజీజ్‌ ఏ ఒక్కరినీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు. మేయర్‌ వైఖరితో మిగిలిన నాయకులు విసుగెత్తిపోతున్నారు. ఆనం వర్గీయులు మేయర్‌పై ప్రత్యక్షంగానే ఎదురుదాడికి దిగుతున్నారు. అటు మేయర్‌కు ఇటు మేయర్‌ వ్యతిరేకులకు మధ్య మంత్రి నారాయణ నలిగిపో తున్నాడు. కార్పొరేషన్‌ వేదికగా తెలుగు దేశం నాయకులు వీధికెక్కి కొట్టుకుం టున్నారు. అలానే కోవూరు నియోజక వర్గంలో చూస్తే ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం పావులు కదుపుతోంది. గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌, బల్లి దుర్గాప్రసాద్‌, డాక్టర్‌ టి.జ్యోత్స్నలతలు ఎవరి గ్రూపులు వాళ్లు నడుపుకుంటు న్నారు. సూళ్లూరుపేటలో వేనాటి రామ చంద్రారెడ్డి ఓవైపు, వాకాటి, గంగా ప్రసాద్‌లు ఓ వైపు వర్గ రాజకీయాలు నడుపుతున్నారు. వెంకటగిరిలోనూ ఎమ్మెల్యే కురుగొండ్ల ఒంటెత్తుపోకడలు నచ్చక కొందరు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. మొత్తానికి జిల్లా తెలుగుదేశం గందరగోళంగా తయారైందని చెప్పొచ్చు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter