10 February 2017 Written by 

ఆర్టీసీ డ్రైవర్లపై 'రెడ్‌'మార్క్‌

driverవాళ్లు ఆర్టీసీ డ్రైవర్లు... ఆక్యుపెన్సీ కోసం ఆరాటపడతారు. మైలేజీ పెంచ డానికి తాపత్రయపడతారు. తద్వారా అవార్డులు వస్తాయని ఆశ! అలాగే ప్రయాణంలో లగేజీ వేసుకుంటే నాలుగు రూపాయలు వస్తాయని చిన్న ఆశ! అంతకుమించి అవినీతి పరులేమీ కాదు. ప్రజలను పీడించి వేలు, లక్షలు దోచే అధికారులు కాదు. కుంభకో ణాలు చేసి కోట్లు కొల్లగొట్టే ప్రజాప్రతి నిధులు అంతకన్నా కాదు. కాని ప్రయా ణీకుల రూపంలో వచ్చిన ఎర్రచందనం కూలీలను ఎక్కించుకున్న నేరానికి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు.

కావలి డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సులు కావలి- బెంగుళూరు, బెంగుళూరు - కావలిల మధ్య ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. బెంగుళూరు నుండి బయలుదేరే ఈ బస్సులు కడప, వింజమూరుల మీదుగా కావలికి వెళతాయి. అయితే కొందరు ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్రచందనం కూలీలను ఈ బస్సుల్లో ఎక్కించేవాళ్లు. వీళ్లు కడప జిల్లా బద్వేలు వద్ద అటవీప్రాంతంలో బస్సులు ఆపి దిగిపోయేవాళ్లు. ఇలా చాలారోజుల నుండి జరుగుతూ వస్తోంది. డ్రైవర్లు కూడా తమకు సీట్లు ఫుల్‌ అయ్యాయని చూసుకుంటు న్నారేగాని, తమ బస్సుల ద్వారా ఎర్రచందనం కూలీలు అటవీ ప్రాంతాల్లోకి వెళుతున్నారనే సమాచారాన్ని పోలీసులకు అందించలేదు. కావలి డిపోకు చెందిన బస్సుల ద్వారానే ఎర్రచందనం కూలీలు అడవుల్లోకిపోయి ఎర్రచందనం చెట్లను నరుకుతున్నారని పసిగట్టిన కడపజిల్లా పోలీసులు ప్రత్యేకనిఘా పెట్టారు. బెంగుళూరు- కావలి మధ్య నైట్‌సర్వీసుల్లో పనిచేస్తున్న 9మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం కూలీల తరలింపుపై డ్రైవర్ల పాత్ర ఎంతవరకు ఉందన్న దానిపై పోలీసుల విచారణ లోతుగా జరుగుతోంది. ఈ సంఘటనతో కావలి, ఆత్మకూరు డిపో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఇద్దరు డ్రైవర్ల అకౌంట్లలో పెద్దమొత్తంలో నగదు జమ కావడాన్ని కనుక్కు న్నారు. అలాగే ఆత్మకూరు డిపోకు చెందిన కొందరు డ్రైవర్ల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter