10 February 2017 Written by 

ప్రకంపనలు సృష్టిస్తున్న ట్రంప్‌

trumpఅగ్రదేశమైన అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలో గడబిడలకు తావిస్తుంటే, ప్రపంచవ్యాప్తగా ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ప్రజలకిచ్చిన హామీలను ఇప్పుడు అధ్యక్షునిగా విజయం సాధించి అమలుచేసేందుకు సమాయత్త మవుతున్న నేపథ్యంలో, పలు కీలక నిర్ణయాలు వివాదాస్పదం అవుతుండడం పట్ల ప్రపంచం విభ్రాంతికి గురవుతోంది. అసలే సంచలనాలకు మారుపేరుగా వున్న ట్రంప్‌, తన నిర్ణయాలతో ప్రపంచాన్ని మరింత కలవరానికి గురిచేస్తున్నారు.

అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా వుంటున్నాయనే అభిప్రాయాలున్నాయి. అయితే, ఆయన ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన హామీల మేరకు ముందుకు సాగడానికి, అమెరికా భద్రతకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో అధ్యక్షుని వైఖరిని ఎవరూ కాదనలేరు కానీ, ఈ దశలో కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడమే ఆందోళన కలిగించే అంశమని, దీంతో అమెరికాలో సైతం అశాంతి వాతావరణం అలముకుంటోందని, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వున్న ఇతరదేశాలపై కూడా పడుతోందనే అభిప్రాయాలు సర్వత్రా వెల్లు వెత్తుతున్నాయి.

మొన్నటిదాకా వలస దారులకు స్వర్గధామంగా వుండే అమెరికా ఇప్పుడు ట్రంప్‌ విధానాలతో..అందుకు పూర్తిగా భిన్నంగా మారుతోంది. అన్నింటా అమెరి కన్లకే తొలి ప్రాధాన్యం అనే నినాదంతో ఎన్నికల్లో నిలిచిన ట్రంప్‌ అధికార పగ్గాలు చేపట్టాక ఆ నినాదాన్ని అమలుచేయడానికి సంకల్పించారు. ఆ మేరకు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను చూసి అమెరికా లోని అనేక ప్రసిద్ధమైన కంపెనీలతో పాటు, ప్రపంచ దేశాలు సైతం బిత్తర బోతున్నాయి. మరోవైపు, ఎంపికచేసిన కొన్ని ముస్లిం దేశాలపై నిషేధం విధించడం ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇలాంటి విధానాలు చివరికి ఏ పరిస్థితులకు దారితీస్తాయోమోననే భయం ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. ఇలాంటి కొన్ని నిర్ణయాల వల్ల అమెరికన్లలో కూడా అసంతృప్తి పెల్లుబుకుతోందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

ఏదేమైనా, అవకాశాలు అందరికీ సమానంగా వున్నప్పుడే సమాజంలో వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. అలా కానప్పుడు, అవకాశాలు ఏ కొందరికి మాత్రమే లభించినప్పుడు ఆయా ప్రాంతాల్లో అశాంతి ప్రబలుతుంటుంది. ఇప్పుడు అమెరికాలో కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోందని అభిప్రాయాలు వినవస్తున్నాయి. ప్రపంచంలో వున్న అత్యధికశాతం ప్రతిభావంతులు అమెరికాలోని పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. అమెరికా ఆర్ధికాభివృద్ధిలో మొన్నటిదాకా వారు అలా పాలు పంచుకున్నారు. అందువల్ల అక్కడి స్థానికులకు ఉద్యోగాలు తగ్గిపోయాయి. ట్రంప్‌ తన ఎన్నికల ప్రచారంలో స్థానికతను ప్రాతిపదికగా తీసుకుని ప్రచారం నిర్వహించడం ఫలితంగా విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు, ఆ మేరకు ట్రంప్‌ తన ఎన్నికల హామీలను నిలబెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ, ఈ పరిస్థితుల్లో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆయా దేశాలకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా సంకటస్థితిని కలిగిస్తుండడంతో అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు అమెరికాలోని తెలుగు వారిలో కూడా అభద్రతాభావం ఏర్పడుతోంది. పూర్తిస్థాయి పౌరసత్వం వున్నవారు మినహా మిగిలినవారి పరిస్థితి ఏమవుతుందో.. అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడాలనుకునేవారు ట్రంప్‌ నిర్ణయాలతో ఎప్పుడు అమెరికాను వీడిపోవలసి వస్తుందోననే ఆందోళనలో వున్నారు. హెచ్‌1-బి వీసాలపై అమెరికా ఆంక్షలు విధించడంతో, ఆ దేశంలో స్థిరపడ్డ లక్షలాదిమంది భారతీయుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. చట్టబద్ధంగా అమెరికాలో వుండే వలసదారులను సగానికి తగ్గించేందుకు అమెరికాలో ప్రయత్నాలు జరుగుతుండడంతో, అమెరికాలో గ్రీన్‌కార్డు పొంది స్థిరనివాసం ఏర్పరుచుకోవాలనుకునేవారికి గట్టి ఇబ్బందులు ఎదురుకానున్నాయనే ఆందోళన కనిపిస్తోంది. ఆ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఆచరణ లోకి వస్తే అమెరికాలో వుండేందుకు వెళ్లినవారికి ఇబ్బందులు తప్పవని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా.

అయితే, భూగోళం నుంచి ఉగ్రవాదాన్ని తుడిపేస్తానని ట్రంప్‌ శపధం చేయడం, ఆ మేరకు ఉగ్రమూకలపై కఠినచర్యలకు సమాయత్తం కావడం ఎంతైనా హర్షదాయం. అందులోనూ రాక్షసత్వానికి మారుపేరైన ఐఎస్‌ లాంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచానికి ముప్పుగా తయారైవున్న నేపథ్యంలో ఉగ్రవాదం ఎక్కడ ఏ తీరులో వున్నా దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు. ఇలాంటి అంశాల్లో అమెరికాతో పాటు, ప్రపంచమంతా కలసి పోరా డాల్సిందే. ఈ విషయంలో అమెరికాకు అందరి మద్దతు వుంటుంది కూడా.

ఏదేమైనా, అపారమైన సైనిక శక్తి. అమేయమైన సాంకేతిక పరిజ్ఞానం.. అత్యద్భుతమైన ప్రతిభా పాటవాలతో ప్రపంచంలోనే అమెరికా ఒక భూతలస్వర్గంగా అవతరించింది. అగ్రరాజ్యమైన అమెరికాకు ఎప్పుడు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా..అందుకు అవసరమైన సాధనసంపత్తి, శక్తిసామర్ధ్యాలు అన్నీ వున్నాయి. అమెరికా ఎవరికీ భయపడాల్సినదేమీ లేదు. అగ్రరాజ్యంగా ఆ ధైర్యస్థైర్యాలు అమెరికాకు ఎప్పుడూ వుండనే వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజానీకానికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. వారి అభ్యున్నతికి బాటలు వేస్తూ..మరోవైపు ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో సహా పెకలించివేసి, ప్రపంచంలో శాంతిని, సుస్థిరతనీ పాదుకొల్పినప్పుడే అగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచ ప్రజలందరి హర్షాతిరేకాలందుకుంటుంది. ఎంతో విజ్ఞతతో.. సంయమనంతో ప్రపంచమానవాళి అంతా హర్షించే విధంగా తగు నిర్ణయాలు తీసుకుని.. ప్రపంచానికే అమెరికా ఆదర్శవంతం కావాలన్నదే అందరి ఆకాంక్ష!..



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter