10 February 2017 Written by 

టీడీపీని బట్టే... వైసిపి అభ్యర్థి!

tdp ycpఏప్రిల్‌లో నెల్లూరుజిల్లా స్థానిక శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అధికార తెలుగుదేశం పార్టీలో ఈ సీటుకు పోటీ ఉండగా, ప్రతిపక్ష వైకాపా మాత్రం పోటీ పెట్టడానికి గట్టి అభ్యర్థి అన్వేషణలో వుంది. తొలుత వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిని నేను చూస్తానని, బెంగుళూరులో అభ్యర్థి ఉన్నాడని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అయితే, ఆయన మనసులో వున్నోళ్లు పోటీకి విముఖత చూపడంతో అభ్యర్థిని పెట్టే బాధ్యత నుండి రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరుజిల్లా ఎమ్మెల్సీ నుండి ఆరునూరైనా అభ్యర్థిని నిలబెట్టాలన్న పట్టుదలతో వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ఉన్నాడు.

అయితే తెలుగుదేశం అభ్యర్థిని నిర్ణయించాక వైసిపి అభ్యర్థి తెరమీదకొచ్చే అవకాశాలున్నాయి. తెలుగుదేశం అభ్యర్థిని బట్టి ఎన్నికల వాతావరణం మారే అవకాశముంది. తెలుగుదేశం ఎమ్మెల్సీ టిక్కెట్‌ను ప్రస్తుత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితో పాటు నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడుగుతున్నారు. వాకాటి ఎమ్మెల్సీ అయితే ఏదో సూళ్లూరుపేటలో తిరుగుతుంటాడు. అదే ఆదాల ఎమ్మెల్సీ అయితే నెల్లూరులో మరో పవర్‌ సెంటర్‌ ఏర్పాటవుతుంది. ఇప్పటికే మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్రలు తలా ఒక పవర్‌ సెంటర్‌ అయ్యారు. ఇప్పుడు ఆదాల కూడా ఎమ్మెల్సీ అయితే మూడు కిలోమీటర్ల పరిధిలోనే నాలుగు పవర్‌ సెంటర్‌లు ఏర్పడతాయి. కాబట్టే పార్టీలోని కొందరు ఆదాలకు ఎమ్మెల్సీ సీటు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారాయణ వాకాటి నారాయణరెడ్డి వైపే మొగ్గు చూపుతుండడంతో ఆయనకే సీటు ఖరారయ్యే అవకాశాలున్నాయి.

అయితే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆదాల అయితే గెలుపుకు ఢోకా వుండదు. వైసిపి పోటీ ఇచ్చినా ఆదాల గెలుపును ఆపలేక పోవచ్చు. అదే వాకాటి అభ్యర్థి అయితే మాత్రం వైసిపికి ఒక మంచి అవకాశమిచ్చినట్లే! వాకాటికి ప్రత్యర్థిని తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక తెలుగుదేశంలోనే చాలామందికి వాకాటి అంటే పడదు. ఆ పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీ టీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లే వైసిపి నుండి గట్టి అభ్యర్థి దిగా లని కోరుకుంటారు. అదీగాక, ఇప్పుడు వైసిపిలో వున్న స్థానిక ఓటర్లకు పార్టీ మారాలన్న ఆలోచన లేదు. ఇక రాదు కూడా! ఇక తెలుగుదేశంలో వైసిపి నుండి గెలిచి వచ్చినవాళ్లు వందమంది దాకా ఉన్నారు. వాళ్లంతా రేపు వాకాటికి ఓట్లేస్తారన్న గ్యారంటీ లేదు. అదీగాక, వాకాటి మీద నారాయణ బ్రాండ్‌ వుంది. ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు నారాయణ అంటే గిట్టడం లేదు. వాకాటిని ఓడిస్తే నారాయణను దెబ్బకొట్టినట్లవుతుంది. ఈ క్యాలిక్యులేషన్‌ నేపథ్యంలో ఆదాల కంటే కూడా వాకాటి అభ్యర్థి అయితే వైసిపికి వరమే!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter