Friday, 10 February 2017 09:51

టార్గెట్‌ ఎమ్మెల్యే...

Written by 
Rate this item
(0 votes)

azizజిల్లాలో మంత్రి నారాయణను మొదలుకొని ఏ ప్రధాన తెలుగుదేశం నాయకుడిని కూడా లెక్కపెట్టకుండా వ్యవహరిస్తున్న మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఎట్టకేలకు తన మనసులోని మాటను బయటపెట్టాడు. తన లక్ష్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నుండి పోటీ చేయడ మేనని చెప్పుకొచ్చాడు. దీంతో నెల్లూరు నగరంలో సరికొత్త వర్గపోరుకు తెరతీసి నట్లయ్యింది. మేయర్‌ అజీజ్‌ మొదట నుండి కూడా ఎవరినీ పట్టించుకోకుండా, ఏ నాయకుడినీ సంప్రదించకుండా సొం తంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా కార్పొరేషన్‌ పరిధిలోకి నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాలు రెండూ వస్తు న్నప్పటికీ, నగర నియోజకవర్గ ప్రాంతాల పైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. కొందరు కార్పొరేటర్లను కాంట్రాక్ట్‌ పనుల ఆశ చూపి తన అనుచరులుగా మార్చుకున్నాడు. తనకు వ్యతిరేకంగా వున్న కార్పొరేటర్ల డివిజన్‌ లలో తానే సొంతంగా వేలుపెడుతు న్నాడు. ఇవన్నీ కూడా రేపటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే! నెల్లూరు నగరంలో ముస్లింల ఓట్లు ఎక్కువ! రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి వుం టుంది. ఆ కోటాలో సీటు తెచ్చుకోవాలని అజీజ్‌ ఆలోచన! అందుకే లోకేష్‌ వద్ద ముస్లిం ట్రంప్‌కార్డును బాగానే విని యోగిస్తున్నాడు.

2014 ఎన్నికల సమయంలో కూడా నెల్లూరు నగరం వైకాపా సీటుకు అజీజ్‌ బలంగానే ప్రయత్నించాడు. ఇందుకు మేకపాటి మద్దతు కూడా తీసుకున్నాడు. అయితే నెల్లూరు నగరంలో అనిల్‌ పాతుకు పోవడం, పని చేసుకుపోవడంతో అతనికే జగన్‌ టిక్కెటిచ్చాడు. అలాగే అజీజ్‌ను నెల్లూరుకు తొలి ముస్లిం మేయర్‌ను చేశాడు. మేయర్‌ అయిన నెలకే అజీజ్‌ జగన్‌కు హ్యాండిచ్చి, తెలుగుదేశంలో చేరి పోయాడు.

వైకాపాలో నెరవేరని తన ఎమ్మెల్యే కలను టీడీపీలో నెరవేర్చుకోవాలనే ప్రయ త్నాల్లో అజీజ్‌ ఉన్నాడు. అయితే ఇప్పటికే ఆనం, ముంగమూరు, కోటంరెడ్డి శీనయ్యలు బలంగా పోటీ పడుతున్న నెల్లూరు నగరం సీటు అజీజ్‌కు అందడం అనుమానమే!

Read 857 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నేలటూరువాసులకు సివిఆర్‌ జ్యోతులు
    ఈ నెల 20వ తేదీన కృష్ణపట్నం పోర్టు సివిఆర్‌ జ్యోతి పథకంలో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులోని 150మంది మత్స్యకార కుటుంబాల వారికి ఉచితంగా గ్యాస్‌స్టౌలను అందించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరణ మార్పు శాఖ అధికారులు దీపక్‌ శ్యామ్యూల్‌, భూమత్‌…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter