10 February 2017 Written by 

నెల్లూరుపై 'చిన్న'చూపు

railwaప్రతి రైల్వే బడ్జెట్‌లోనూ నెల్లూరుజిల్లాకు మొండిచేయే చూపిస్తున్నారు. ప్రతి బడ్జెట్‌ సమయంలోనూ ఏదేదో వస్తాయనుకోవడం, బడ్జెట్‌లో ఏమీ రాక నిరాశ చెందడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఏడాది ఆర్ధిక బడ్జెట్‌లోనే రైల్వేబడ్జెట్‌ను మిక్స్‌చేసి ప్రవేశపెట్టడం తెలిసిందే! ఈసారి బడ్జెట్‌లో జిల్లాకు పెద్దగా ఒరిగిందేమీ లేకపోయినా ఒకట్రెండు పనులపై మాత్రం దయతలిచారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా జిల్లాలోని మెట్టప్రాంతానికి వరమైన నడికుడి - శ్రీకాళహస్తి రైల్వేలైన్‌కు 10కోట్లు ముష్టి వేశారు. ఈ పదికోట్లతో ఏం పనులు జరుగుతాయో ఆ దేవుడికే తెలియాలి. కృష్ణపట్నం, ఓబులాపురం రైల్వేలైన్‌కు మాత్రం 100కోట్లు కేటాయించడం కొంత సంతోషించాల్సిన విషయం. ఇక కృష్ణపట్నం - వెంకటాచలం మధ్య డంబ్లింగ్‌కు, విద్యుద్దీకరణకు కేవలం కోటి మాత్రమే కేటాయించారు. గూడూరు-దుగరాజపట్నం లైన్‌ సర్వేకు 10లక్షలు, గూడూరు- తిరుపతిల మధ్య గేజ్‌ మార్పిడికి 50లక్షలు కేటాయించారు. ఇవి ఏ మూలకూ సరిపోవు. ఇవి కాక జిల్లాలో కొన్ని రైల్వేఓవర్‌ బ్రిడ్జిలు, రైల్వే క్రాసింగ్‌లు, రైల్వేస్టేషన్‌ల ఆధునీకరణకు కొంత నిధులు విదిల్చారు. అయితే జరగాల్సిన అభివృద్ధి పనులకు ఇచ్చిన నిధులకు ఏ మాత్రం పొంతన లేదు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నంద్యాల 'ఉప'ద్రవం!
    కర్నూలు జిల్లాలో హఠాన్మరణం చెందిన భూమా నాగిరెడ్డిని కోల్పోవడం ఒక లోటైతే, ఆయన మృతితో రానున్న నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్‌గా మారనున్నాయి. నంద్యాల సీటు మాదే... కాబట్టి మేము పోటీ చేయడం ఖాయమంటూ వైకాపా అధినేత వైయస్‌…
  • కోడ్‌ ముగిసింది... కుర్చీలు నిండాల్సి వుంది!
    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మూలంగా దాదాపు నెల నుండి జిల్లాలో ఎటువంటి అధికారిక నియామకాలు, బదిలీలు జరగ లేదు. 22వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇక అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టవచ్చు. ముందుగా భర్తీ చేయాల్సింది నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌…
  • అన్నదాతను ముంచిన అకాలవర్షం
    వాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన…
  • బాబుకు పమ్రాద సంకేతాలు!
    అధికారాన్ని ఫణంగా పెట్టి, విలువలను పాతిపెట్టి, డబ్బు సంచులు తెచ్చిపెట్టి, మాట వినని వారిపై కేసులు పెట్టి, ఓటర్ల తరలింపుకు ప్రత్యేక విమానాలే పెట్టి, రిసార్ట్స్‌లో క్యాంపులు పెట్టి, అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో అవతల వారిని భయపెట్టి... గెలిచిన గెలుపు…
  • న(వ)మో భారత్‌
    భారతదేశ చరిత్ర మారుతోంది... కుటుంబ రాజరిక వ్యవస్థ నుండి సామాన్య జనావళి వైపుకు చరిత్ర మళ్ళుతోంది. ఇంతకాలం సంపన్న కుటుంబాలలో పుట్టిన నాయకుల చరిత్రను, తండ్రి, తాతల వారసత్వంతో రాజకీయాలను శాసించిన నాయకురాళ్ళ చరిత్రను చదువుకున్న భారతం... భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో…

Newsletter