10 February 2017 Written by 

రకుల్ స్పీడ్ కు బ్రేకులు పడుతున్నాయా?

rakulటాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం తెగ స్పీడ్‌ చూపించేస్తోంది. వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేస్తూ సెన్సేషన్స్‌ సృష్టించేస్తోంది రకుల్‌. రామ్‌ చరణ్‌ తో రెండు సినిమాలు వరుసగా చేసిన తర్వాత.. మహేష్‌ బాబుతో మూవీలో నటిస్తుండడంతో.. అమ్మడికి స్టార్‌ స్టేటస్‌ వచ్చేసినట్లే అనుకున్నా రంతా. కానీ ఇప్పుడు రకుల్‌ ప్రీత్‌ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ఓ విషయం అర్ధమవుతుంది. ఈ నెలలో విడుదల అవుతున్న విన్నర్‌ మూవీలో సాయిధరం తేజ్‌ తో నటిస్తోంది రకుల్‌. దీని తర్వాత మహేష్‌ బాబుతో చేస్తున్న సినిమా తప్ప ఈ భామ చేతిలో పెద్ద హీరోలతో చేస్తున్న సినిమాలేవిూ లేవు. సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్‌ కళ్యాణ్‌ కృష్ణ దర్శ కత్వంలో నాగ చైతన్యతో ఓ మూవీ చేస్తోంది రకుల్‌. దీంతోపాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీని వాస్‌కి హీరోయిన్‌ గా నటిస్తోంది ఈ భామ. ఇప్పటికే టాప్‌ లీగ్‌ లోకి ఎంటర్‌ అయిపోయిందని అనుకుంటున్న టైం లో.. స్టార్‌ హీరోలతో సినిమాలు లేక పోవడం మాత్రం రకుల్‌ కెరీర్‌ కి లోటు అనే చెప్పాలి. అర్జంటుగా ఒకరిద్దరు స్టార్స్‌ అయినా ప్రాజెక్టుల్లో చోటు దక్కించుకోలేకపోతే.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌కి జోష్‌ తగ్గినట్లే అనుకోవాల్సిందే.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • దండగ... పండగ...
    పర్యాటక అభివృద్ధి అంటే సంవత్సరంలో 365రోజులు జరగాల్సిన ప్రక్రియ. దానిని రెండుమూడు రోజులు జాతరగా మార్పు చేయడం సబబు కాదు. మూడురోజుల సంబడం కోసం మూడు కోట్లు తగలెయ్యడం కరెక్ట్‌ కాదు. ఆ నిధులనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి వెచ్చిస్తే సంవత్సరం…
  • చిలికి చిలికి... గాలివాన కానుందా?
    ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పునాదులుగా వుండి, పార్టీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన నాయకుల వల్ల పార్టీకి ఎప్పుడూ సమస్యలు ఎదురు కాలేదు. వారి వ్యక్తిగత ఆర్ధిక లావాదేవీల వల్ల పార్టీకి చెడ్డపేరొచ్చింది కూడా లేదు. కాని, ఇతర…
  • సమన్వయ లోపం... వైకాపాకు శాపం!
    2014 ఎన్నికల ప్రచారంలో జగన్‌ సభలకు జనం జాతర మాది రిగా వచ్చారు. అంతకుముందు నిర్వహించిన ఓదార్పుయాత్రలకు పోటెత్తినట్లు వచ్చారు. అదే చంద్ర బాబు సభలకు లారీలు, బస్సులు పెట్టి తోలినా జనం రాలేదు. అయినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు…
  • సినిమానూ వదలని సెగ
    నేనెందుకు పార్టీ పెట్టానో నాకే తెలి యదు, నేనెందుకు ప్రచారం చేస్తున్నానో నాకే తెలియదు, ఎన్ని సీట్లకు పోటీ చేయాలో నాకే తెలియదు... అన్నంత అజ్ఞానంలో వున్న హీరో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ఒక దశ దిశ నిర్దేశం లేకుండా రాజకీయపార్టీని…
  • అజీజ్‌ బ్రదర్స్‌పై కేసు
    నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. ఆయన పైన ఆయన తమ్ముడు, కార్పొరేటర్‌ జలీల్‌ మీద చెన్నైలో చీటింగ్‌ కేసు నమోదైంది. మేయర్‌ అజీజ్‌కు చెందిన స్టార్‌ ఆగ్రో కంపెనీలో వాటా కోసం తాము ఇచ్చిన 42కోట్ల…

Newsletter