17 February 2017 Written by 

రోజా ఎపిసోడ్లో... తప్పులో కాలేసిన బాబు

roj cmచంద్రబాబు కలల రాజధాని అమరావతి వేదికగా మూడురోజులు మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మొదలుకొని మహిళా మంత్రులు, మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలతో పాటు సీఎంల కూతుర్లు, కోడళ్లు, కేంద్రమంత్రుల కూతుర్లు కూడా ఈ సదస్సులో పాల్గొని మహిళా సాధికారత గురించి మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోవాలని పిలుపునిచ్చారు.

అయితే వారి పిలుపులన్నీ కూడా అక్కడ కూర్చున్న వారి చెవులకు మాత్రమే చేరాయి. దేశ వ్యాప్తంగా వున్న మహిళల మనసులను తాకలేదు. వ్రతం చెడ్డా ఫలితం దక్కనట్లయ్యింది ఈ మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు తీరు! దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం వేసిన తప్పటడుగే!

కోట్లు ఖర్చుపెట్టి మూడురోజులు నిర్వహించిన మహిళా సదస్సులోని మహిళల సందేశాలకంటే కూడా పోలీసుల చేతిలో అరెస్ట్‌ కాబడిన వైకాపా ఎమ్మెల్యే రోజా మాటలనే రాష్ట్ర ప్రజలు ఎక్కువుగా విన్నారు. ఆమెను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలనే ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కువుగా చూసారు. రోజా అక్రమ నిర్భంధంతో మూడురోజుల పాటు ఆర్భాటంగా చేసిన మహిళా సదస్సుకు అర్ధం పర్ధం లేకుండాపోయింది.. రోజాను నిర్భంధించిన తీరే హైలెట్‌ అయ్యింది. రోజా ఉగ్రవాది కాదు, నేరస్థురాలు కాదు. అదీగాక మహిళా సదస్సు కమిటీలో సభ్యురాలు కూడా! ఇక శాసనసభ్యురాలు. మహిళా సదస్సులో ఆమె ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడాలనుకుంటున్నది కూడా ఎవరికీ తెలియదు! కాకపోతే గత మూడేళ్లలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు కలల రాజధాని అమరావతి వేదికగా మూడురోజులు మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు నిర్వహించారు. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మొదలుకొని మహిళా మంత్రులు, మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలతో పాటు సీఎంల కూతుర్లు, కోడళ్లు, కేంద్రమంత్రుల కూతుర్లు కూడా ఈ సదస్సులో పాల్గొని మహిళా సాధికారత గురించి మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోవాలని పిలుపునిచ్చారు.

అయితే వారి పిలుపులన్నీ కూడా అక్కడ కూర్చున్న వారి చెవులకు మాత్రమే చేరాయి. దేశ వ్యాప్తంగా వున్న మహిళల మనసులను తాకలేదు. వ్రతం చెడ్డా ఫలితం దక్కనట్లయ్యింది ఈ మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు తీరు! దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం వేసిన తప్పటడుగే!

కోట్లు ఖర్చుపెట్టి మూడురోజులు నిర్వహించిన మహిళా సదస్సులోని మహిళల సందేశాలకంటే కూడా పోలీసుల చేతిలో అరెస్ట్‌ కాబడిన వైకాపా ఎమ్మెల్యే రోజా మాటలనే రాష్ట్ర ప్రజలు ఎక్కువుగా విన్నారు. ఆమెను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలనే ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కువుగా చూసారు. రోజా అక్రమ నిర్భంధంతో మూడురోజుల పాటు ఆర్భాటంగా చేసిన మహిళా సదస్సుకు అర్ధం పర్ధం లేకుండాపోయింది.. రోజాను నిర్భంధించిన తీరే హైలెట్‌ అయ్యింది. రోజా ఉగ్రవాది కాదు, నేరస్థురాలు కాదు. అదీగాక మహిళా సదస్సు కమిటీలో సభ్యురాలు కూడా! ఇక శాసనసభ్యురాలు. మహిళా సదస్సులో ఆమె ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడాలనుకుంటున్నది కూడా ఎవరికీ తెలియదు! కాకపోతే గత మూడేళ్లలో ఈ రాష్ట్రంలో

మహిళలకు జరిగిన అన్యాయాలను ప్రస్తావించి ఉండేది. ప్రశ్నించి ఉండేది! మహిళా సదస్సులు పెట్టేది మహిళలపై జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించడానికి, చర్చించడానికి కూడా! అంతేగాని చంద్రబాబు కమ్మగా భోజనం పెట్టాడని చప్పట్లు తట్టి పొగడడానికి కాదు. ప్రతి విషయం మీద చర్చ జరగాలి! మహిళలపై జరిగిన అరాచకాలను ప్రశ్నించి నప్పుడు ప్రభుత్వం కూడా దానికి వివరణ ఇవ్వాలి. కాని ఈ రాష్ట్రంలో జరిగిన కొన్ని మహిళలకు సంబంధించిన నేరాలపై వివరణ ఇచ్చే సామర్ధ్యం ప్రభుత్వం వద్ద లేదు. సదస్సులో రోజా ఈ అంశాలను ప్రస్తావిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం పరువుపోతుంది. అందుకే గన్నవరం ఎయిర్‌పోర్టులోనే పోలీసులు రోజాను అడ్డుకుని ఒక ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసినట్లుగా తమ వాహనంలో ఎక్కించి తిరిగి హైదరాబాద్‌లో ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టారు. రోజా ఒక ఎమ్మెల్యే... మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంను అరెస్ట్‌ చేయడానికి ఇచ్చినంత బిల్డప్‌ను రోజాను అరెస్ట్‌ చేయడానికి సృష్టించారు. రోజా సదస్సుకు వచ్చి మాట్లాడుంటే చంద్రబాబు ప్రభుత్వానికి డామేజీ జరిగి ఉండేదో లేదో గాని ఆమెను అరెస్ట్‌ చేసి నిర్భంధంగా తరలించిన చర్యల వల్ల మాత్రం తెలుగుదేశంకు తీరని డ్యామేజీ జరిగింది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • రాజకీయమా? రక్త సంబంధమా?
    నెల్లూరుజిల్లాలో బెజవాడ, మేకపాటి, సోమిరెడ్డి, నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి రాజకీయ కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలలో కూడా పదవుల వద్దో, ఆస్తుల దగ్గరో మనస్పర్ధలు, విభేదాలు వచ్చాయి. సొంత అన్నదమ్ములే విరోధులుగా మారారు. అయితే ఈ కుటుంబాలన్నింటితో పోలిస్తే ఆనం సోదరుల మధ్యే…
  • పంచాయితీలకు ప్రమోషన్‌!
    జిల్లాలో ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్‌గా ఉండగా గూడూరు, కావలి, వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేటలు మున్సిపాల్టీలుగా ఉన్నాయి. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్చడం జరిగింది. కాగా, జిల్లాలో మరో 9 మేజర్‌ పంచాయితీలను…
  • చుక్కలు చూపించిన జగన్‌
    ఉత్తరాన నదీ ప్రవాహం, ఈశాన్యంలో నీళ్ళు వంటి పక్కా వాస్తు చూసి చంద్రబాబు అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. ఆయన వాస్తు పిచ్చికి పాత రాజధాని హైదరాబాద్‌లోనే కాదు, అమరావతిలోనూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి…
  • ఆనంకు 'హై'షాక్‌
    వందేళ్ళకు పైగా చరిత్ర... లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత... ఒకే ప్రాంగణంలో ఆరో తరగతి నుండి న్యాయవాద విద్య, పీజీ కోర్సుల వరకు... అతి తక్కువ ఖర్చుతో చదువు పూర్తి చేసుకునే వేదిక... నెల్లూరులోని వి.ఆర్‌. విద్యాసంస్థలు... వాస్తవానికి వెంకటగిరి…
  • నెంబర్‌ గేమ్‌లో నెగ్గేదెవరు?
    బేరాలు... రాయబారాలు... క్యాంపులో మందు కంపు... పెరుగుతున్న ఓటు రేటు... ఎత్తులు... పైఎత్తులు... పార్టీ అధినేతల స్వీయ పర్యవేక్షణ... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో 'స్థానిక' ఓటర్లకు గాలాలు... మాకు రెండు చేపలు పడ్డాయంటే, మా వలలో మీవి నాలుగు చేపలు పడ్డాయంటూ పోటాపోటీగా…

Newsletter