17 February 2017 Written by 

ఆకాశమంత విజయం

pslv c37మన కళ్ళ ముందే పుట్టిన బిడ్డ... తప్పటడుగులు వేస్తూ పెరిగి... ఆటుపోట్లను ఎదుర్కొంటూ చదివి... ఎన్నో స్థాయిలను దాటుకుని ఎత్తుపల్లాలు అధిగమిస్తూ ఐఏఎస్‌ ర్యాంక్‌ను కొడితే ఎంత ఆనందిస్తామో... ఈరోజు మన దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాధిస్తున్న విజయాలను చూస్తే కూడా అంతే ఆనందమేస్తుంది. మన 'ఇస్రో' అంతర్జాతీయంగా ఎదిగినందుకు మనసు ఉప్పొంగుతుంది. ప్రపంచంలో అగ్రరాజ్యాలు సాధించలేని ఘనతను మన ఇస్రో సాధించినందుకు ఛాతి గర్వంతో ఉప్పొంగుతుంది.

స్వాతంత్య్రానంతరం ఈ ఏడు దశా బ్దాలలో భారతదేశం ఎన్నో రంగాలలో విజయాలు సాధించింది. అయితే ఇతర రంగాలలో అనుకున్న ప్రగతిని అందు కోవడం కష్టంగానే వుంది. దీనికి కారణం మిగిలిన రంగాలన్నింటికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ వ్యవస్థలతో సంబంధముండడమే! మన రాజకీయ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయి వున్నాయో చూస్తూనే వున్నాం. ఇలాంటి రాజకీయ వ్యవస్థలున్న చోట ఆశించిన అభివృద్ధిని సాధించడం కూడా కష్టమే!

అయితే రాజకీయ వ్యవస్థలతో ఏ మాత్రం సంబంధాలు పెట్టుకోకుండా ప్రతిభనే వేదికగా మలచి, దేశ ప్రతిష్టనే లక్ష్యంగా పెట్టుకుని అగ్రరాజ్యాలకు ధీటుగా దూసుకుపోతున్న ఏకైక వ్యవస్థ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో). అమెరికా, జపాన్‌, రష్యా, చైనా వంటి అగ్రదేశాలకు అంతరిక్ష ప్రయోగాలలో ధీటుగా సమాధానమిస్తున్న మన ఇస్రో మరో అంతరిక్ష అద్భుతాన్ని మనకు కానుకగా అందజేసింది. ఒకే రాకెట్‌ ద్వారా 104ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. అంతరిక్ష ప్రయోగాలలో వరల్డ్‌ రికార్డును సృష్టించింది. ఇంతవరకు ఏ అగ్రదేశం కూడా ఒకే రాకెట్‌ ద్వారా ఇన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపలేదు. రష్యా మాత్రం 2014లో ఒకే రాకెట్‌ ద్వారా 37 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. 104 ఉపగ్రహాల ప్రయోగంతో ఇస్రో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.

ఇంతటి అద్భుత ప్రయోగానికి నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికగా నిలిచింది. 15వ తేదీ ఉదయం 9.28 గంటలకు తన కడుపులో దాచుకున్న 104 ఉపగ్రహాలతో పిఎస్‌ఎల్‌వి-సి37 నింగికి దూసుకుపోయింది. 28నిముషాల పాటు 524 కిలోమీటర్లు ప్రయాణించాక ఉప గ్రహాలన్నింటిని కూడా వాటివాటి కక్ష్యల్లో జాగ్రత్తగా చేర్చింది. ఈ 104 ఉపగ్రహా లలో మన దేశానికి చెందిన కార్టోశాట్‌-2, ఐఎన్‌ఎస్‌-1ఏ, ఐఎన్‌ఎస్‌-1బి ఉప గ్రహాలున్నాయి. మిగిలిన 101 ఉపగ్రహా లలో 96 అమెరికావి కాగా, ఇజ్రాయిల్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, యూఏఇ దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఒక్కోటి లెక్కన ఉన్నాయి.

ఈ చరిత్రాత్మక ప్రయోగంతో ఇస్రో ప్రపంచ దేశాలకే సవాల్‌గా నిలిచింది. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయో గాలను విజయవంతం చేస్తున్న ఖ్యాతి ఇస్రో సొంతమవుతోంది. ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగంతో మనం అగ్ర దేశాలకు పోటీగా మారడం కాదు, ఆ దేశాలే మనతో పోటీ పడే పరిస్థితి కల్పించాము. ముఖ్యంగా నిన్న జరిపింది వాణిజ్య ప్రయోగం. సాధించింది వాణిజ్య విజయం. అతితక్కువ ఖర్చుతో అత్యంత నమ్మకంతో మీ ఉపగ్రహాలను మేం కక్ష్యలోకి చేరుస్తామన్న భరోసాను ఇస్రో ప్రపంచ దేశాలకు ఇవ్వగలిగింది. ఇక ఏ దేశమైనా తమ ఉపగ్రహాల ప్రయోగాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చేది ఇస్రోకే! ఎందుకంటే ఇస్రో ప్రయోగాలు తక్కువ ఖర్చుకే కాదు, విజయాలకు కూడా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది కాబట్టి!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నేలటూరువాసులకు సివిఆర్‌ జ్యోతులు
    ఈ నెల 20వ తేదీన కృష్ణపట్నం పోర్టు సివిఆర్‌ జ్యోతి పథకంలో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులోని 150మంది మత్స్యకార కుటుంబాల వారికి ఉచితంగా గ్యాస్‌స్టౌలను అందించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరణ మార్పు శాఖ అధికారులు దీపక్‌ శ్యామ్యూల్‌, భూమత్‌…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter