17 February 2017 Written by 

నేతల పాపం...నిధులకు శాపం

currencyఓ పక్క అభివృద్ధి పనులకు నిధులు కావాలని అడుక్కుం టుంటారు. ఇంకోపక్క వచ్చిన నిధులను ఖర్చుపెట్టే దిక్కు లేక అవి తిరిగి పోతుంటాయి. ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల తాత్సారం మూలంగా మంజూరు చేసిన పనులు కూడా రద్దయ్యి, నిధులు వెనక్కిపోతున్నాయి. జిల్లాలో నిధులు మంజూరు చేసినా కూడా ఇంకా మొదలుకాని పనులను రద్దు చేస్తూ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కన్నబాబు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఆయా మున్సిపాల్టీల్లో అభివృద్ధి పనులకు 51.40కోట్లు మంజూరు చేశారు. అయితే ఇంతవరకు 12.14 కోట్లు మాత్రమే ఖర్చ య్యాయి. 42.67కోట్ల పనులను మొదలుపెట్టలేదు. ఈ నిధులను ఖర్చు చేయాల్సిన గడువు ముగియడంతో ఆ పనులను రద్దు చేశారు. 2016 మార్చి 9న జిల్లాలో మున్సిపాల్టీలకు 51.40కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేస్తూ రాష్ట్ర మున్సిపల్‌ శాఖ

ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పనులకు ఈ నిధులు కేటాయించారు. నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో 36.16 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 200 పనులు ప్రతిపాదించగా ఇప్పటివరకు 8.94 కోట్ల ఖర్చుతో 89పనులు పూర్తి చేశారు. మిగతావి మొదలుకాకపోవడంతో 27.32కోట్లతో చేపట్టాల్సిన 111 పనులు రద్దయ్యాయి. కావలి మున్సిపాల్టీ ఈ విషయంలో కొంచెం బెటర్‌. వారికి 4కోట్లు మంజూరయ్యాయి. 3.20కోట్ల ఖర్చుతో 19పనులు పూర్తి చేశారు. పెండింగ్‌లో వున్న 80లక్షలతో చేపట్టాల్సిన నాలుగు పనులు రద్దయ్యాయి. కాని వెంకటగిరి, సూళ్లూరుపేట, ఆత్మకూరు, నాయుడుపేట మున్సిపాల్టీల్లో ప్రతి పాదించిన ఏ పనీ చేపట్టకపోవడంతో మంజూరు చేసిన పనులన్నీ కూడా రద్దయ్యాయి.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
 • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
  దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
 • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
  దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
 • ఠారెత్తిస్తున్న సూరీడు
  మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
 • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
  అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter