24 February 2017 Written by 

గెలుపు కోసం పరుగు

gelupuమండలి ఎన్నికల తేదీ దగ్గరకొచ్చే కొద్ది రాజకీయ వేడి పెరుగుతోంది. తూర్పు రాయలసీమ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ ప్రధానపోటీ తెలుగుదేశం, యూటిఎఫ్‌ల మధ్యే నెలకొనివుంది.

యూటిఎఫ్‌ తమ అభ్యర్థులుగా గత ఎన్నికల్లో గెలిచిన యండపల్లి శ్రీనివాసులురెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యంలను ఖరారు చేయడం తెలిసిందే! తెలుగుదేశం నుండి పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా మంత్రి నారాయణ ముఖ్యఅనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని చాలా ముందే నిర్ణయించారు. కాని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను నాన్చారు. మాజీమంత్రి పరసా రత్నంతో పాటు టిటిడి ట్రస్ట్‌బోర్డ్‌ ఛైర్మెన్‌ చదలవాడ కృష్ణమూర్తి సతీమణి శ్రీమతి సుచరిత, చిత్తూరుజిల్లాకు చెందిన వాసుదేవనాయుడు ఈ సీటు కోసం ప్రయత్నించారు. మిత్రధర్మంగా ఈ సీటును తమకివ్వాలని బీజేపీ కూడా కోరింది. అయితే చివరకు చిత్తూరుజిల్లాకు చెందిన వాసుదేవనాయుడునే అభ్యర్థిగా నిర్ణయించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి కూడా రంగంలో వున్నారు. ఇక రెండు నియోజకవర్గాలలోనూ ఆయా సంఘాల తరఫున ఇండిపెండెంట్‌లుగా కొందరు రంగంలో వున్నారు. రాష్ట్ర రాజకీయాలలో ప్రతిపక్షంగా వున్న వైకాపా ఈ రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను పెట్టకుండా వామపక్ష అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించింది.

రాష్ట్ర శాసనమండలి ఏర్పాటైన తర్వాత ఇంతవరకు రెండుసార్లు తూర్పురాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే రెండుసార్లు కూడా ఈ రెండు నియో జకవర్గాలలో యూటిఎఫ్‌ అభ్యర్థులే గెలిచారు. మరి ఈసారి హ్యాట్రిక్‌ మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఉపాధ్యాయ నియోజకవర్గంలో యూటిఎఫ్‌ తిరుగులేని ఆధిపత్యం చూపుతోంది. ఉపాధ్యాయుల ఎన్నికల్లో వాళ్ళను అధిగమించడం మిగతావాళ్లకు కష్టమే! అదీగాక తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసు దేవనాయుడు కంటే అభ్యర్థి పరంగా యూటిఎఫ్‌ నుండి పోటీ చేస్తున్న విఠపు బాలసుబ్రహ్మణ్యం ఎంతో బెటర్‌. రెండుసార్లు ఎమ్మెల్సీగా చేసాడు. ఉపాధ్యా యులు, నిరుద్యోగుల సమస్యలపై మండలిలో గళమెత్తాడు. బయట కూడా పోరాడాడు. ఇక ఆయా ఉపాధ్యాయ సంఘాల మధ్య ఓట్లు చీలే అవకాశా లున్నాయి. ఉపాధ్యాయ నియోజకవర్గంలో యూటిఎఫ్‌ను నిలువరించడం కష్టమే!

పట్టభద్రుల నియోజకవర్గంపై తెలుగుదేశం గంపెడాశలు పెట్టుకుంది. వారి ఆశల్లా కొత్తఓట్లు అధికసంఖ్యలో చేర్పించామని. యూటిఎఫ్‌ ఓట్లు ఇక్కడ బలం గానే వున్నాయి. కాకపోతే కొత్తగా చేరిన ఓటర్లు ఎవరువైపు మొగ్గుచూపుతారన్నది చూడాలి. ఇక అభ్యర్థుల పరంగా చూసినా యూటిఎఫ్‌ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులు రెడ్డికి మంచి పేరుంది. గత ఎన్నికల్లోనూ ఆయనే గెలిచాడు. యూటిఎఫ్‌ నుండే కాక విద్యావంతులైన పట్టభద్రుల మొదటి ఛాయిస్‌ కూడా ఆయనే ఉంటాడు. తెలుగుదేశంకు అభ్యర్థి ప్రధాన మైనస్‌. వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి అభ్యర్థిత్వం పట్ల తెలుగుదేశంలోనే వ్యతిరేకత వుంది. పార్టీలో అందరు నాయకులు ఆయనకు పూర్తిగా సహకరించే పరిస్థితి లేదు. మిగిలిన అభ్యర్థులు రంగంలో వున్నా నామమాత్రపు పోటీనే ఇవ్వగలరు. ప్రధాన పోటీ వుండేది టిడిపి, యూటిఎఫ్‌ల మధ్యే!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter