24 February 2017 Written by 

ఛైర్మెన్‌ వద్దు... మంత్రే ముద్దు

somiత్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమనుకుంటున్న పరిస్థితుల్లో నెల్లూరుజిల్లా నుండి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. పార్టీలోనూ సోమిరెడ్డికి మద్దతు పెరుగుతోంది. సోమిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకూడదు అని అడ్డు చెప్పడానికి బలమైన కారణాలేవీ లేవు. ఆయన పార్టీకి వెన్నుపోట్లు పొడవలేదు. పార్టీ రాజకీయాలను బజారున పెట్టలేదు. పార్టీలోని కొందరు నాయకులతో అంతర్గత విభేదాలున్నా ఏరోజూ వారిని రాజకీయంగా గాని వ్యక్తిగతంగా గాని పల్లెత్తుమాట అనలేదు. కేవలం తన పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు. పార్టీ ప్రతిపక్షంలో వున్న పదేళ్లయినా, అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో అయినా క్రమశిక్షణగల పార్టీ సైనికుడిలా పనిచేసాడే గాని పార్టీ అధిష్టానం గీసిన గీతను దాటి ప్రవర్తించలేదు. కాబట్టే సోమిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనే సానుకూల వైఖరి పార్టీలో ఎక్కువుగా కనిపిస్తోంది. ఇక నెల్లూరు వంటి 'రెడ్ల' ప్రాధాన్యత వున్న జిల్లాలో ఆ సామాజిక వర్గానికి చెందిన సోమిరెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం అన్ని విధాలా బెటర్‌! గత 30ఏళ్ల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నెల్లూరుజిల్లా నుండి 'రెడ్డి' సామాజిక వర్గానికి చెందిన మంత్రి లేకపోవడం ఇప్పటి ప్రభుత్వంలోనే జరిగింది.

ఒక దశలో శాసనమండలి ఛైర్మెన్‌గా సోమిరెడ్డిని పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. త్వరలో శాసనమండలి ఛైర్మెన్‌గా చక్రపాణి రెటైర్డ్‌ కానున్నారు. ఆయన స్థానంలో సోమిరెడ్డిని పంపిస్తే, నెల్లూరుజిల్లాలో మంత్రిగా వున్న నారాయణకు ఇబ్బంది లేకుండా ఉంటుందనుకున్నారు. కాని సోమిరెడ్డికి శాసనమండలి ఛైర్మెన్‌ పదవి ఇవ్వడమంటే నోటికి ప్లాస్టర్‌ వేసి ఒక గదిలో బంధించడమే! తిట్టే నోరు తిరిగే కాలు వూరికే ఉండాలంటే కష్టం కదా! మండలి ఛైర్మెన్‌ కుర్చీలో కుర్చుంటే జగన్‌ను తిట్టలేడు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయలేడు. చాలా పద్ధతిగా ఉండాల్సి ఉంటుంది. ఆ బాధంతా ఎందు కనే ఉద్దేశ్యంతోనే ఆయన మండలి ఛైర్మెన్‌ వద్దు, ఇస్తే గిస్తే ఆ మంత్రి పదవినే చూడమని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter