24 February 2017 Written by 

24-02-2017 రాశిఫలాలు

rasi 24

1Ariesమేషం

ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. వారం మధ్యలో అదనపు ఖర్చు పైనబడవచ్చును. గృహ వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. బిడ్డల యొక్క విద్యా, వివాహ ఉద్యోగ విషయాలలో ఆందోళన ఉంటుంది. ఉద్యోగప్రయత్నాలు వెనుకబడతాయి. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యోగులు పనిచేయాలి.

 

2Taurusవృషభం

కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారా లలో వ్యాప్తి బాగుండి ఆదాయం పెరుగుతుంది. నూతన వస్తువులు సమకూరుతాయి. ఉద్యోగార్ధులకు అవకాశాలు బాగుంటాయి. భూ సంబంధ లావాదేవీలను వాయిదా వేసికొనండి. పనులు నెమ్మదిగా జరుగుతాయి. వేడుకలు శుభకార్యాలలో ప్రముఖంగా పాల్గొంటారు. ఉద్యోగులకు కార్యసామర్ధ్యంతో పాటు పనివత్తిడి ఉంటుంది.

 

3Geminiమిధునం

ఆర్ధిక ఇబ్బందులు, వ్యవహారంలో ఇబ్బందులు సర్దు కుంటాయి. వృత్తి వ్యాపారాలు విస్తృతి మరియు ఆదాయ వృద్ధి కలదు. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరగవచ్చును. భాగస్వామిక చర్చల్లో ఫ్రధాన పాత్ర వహిస్తారు. ముఖ్యమైన సర్టిఫికేట్‌, ప్రభుత్వ అనుమతులు పొందగలరు. పనులు సానుకూలం కాగలవు. విలువైన వస్తువులు సమకూ రటం, దూరప్రయాణాలుంటాయి.

 

4Cancerకర్కాటకం

వ్యవహారాలలో తొందరపాటు ప్రదర్శించకండి. ఇబ్బందికరమగు పరిస్థితులు క్రమంగా చక్కబడగలవు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూ లిస్తాయి. అధికారులకు పనివత్తిడి స్థానమార్పులుండ వచ్చును. వ్యాపారవృద్ధి, అవకాశాలు, పెట్టుబడులకు అవకాశాలు బాగుంటాయి. ఆదాయం షుమారుగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.

 

5Leoసింహం

ఆర్ధిక పరిస్థితి క్రమంగా బాగుంటుంది. ఖర్చులు అదుపు చేయాలి. బంధువర్గంతో సంబంధాలు బలపడ గలవు. ఉద్యోగులకు శ్రమ ఎక్కువైనా కార్యసమర్ధత, గౌరవాలు బాగుంటాయి. వ్యాపార వృత్తి జీవనాలు లాభ సాటిగా జరుగుతాయి. క్రయవిక్రయాలు వాయిదా వేయడం మంచిది. వస్తు వాహన, ఇంటి రిపేర్ల ఖర్చులు అదనం. అనుకున్న పనులు టెన్షన్‌తో సాగుతాయి.

 

6Virgoకన్య

చేయదలచిన పనులందు ఆర్ధిక వ్యవహారాలందు పొరపాట్లు రాకుండా చూచుకొనాలి. పనుల తీవ్రత ఇబ్బంది పెట్టవచ్చును. అయినా లగ్న గురువు వల్ల సమర్ధ వంతంగా పనులు నిర్వహిస్తారు. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. శుభకార్యాలు నిర్ణయం కావడం జరుగుతుంది. ఇతరులను అతిగా నమ్మవద్దు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

 

7Libraతుల

వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఆదాయం బాగుం టుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అవసరాలకు ఋణం చేయవలసి వస్తుంది. ముఖ్య నోటీసులు అందు కుంటారు. బంధువర్గంతో పేచీలు రావచ్చును. విద్యార్థులు చదువుపై బాగా దృష్టి పెట్టాలి. బిడ్డల విద్యా ఉద్యోగ శుభకార్య విషయాలు ఆందోళన కలిగిస్తాయి. అనుకున్న పనులు జరుపుకొనడానికి శ్రమపడాల్సి ఉంటుంది.

 

8Scorpioవృశ్చికం

బంధుత్వ స్నేహాలు బలపడతాయి. వ్యాపార విస్తరణకు పెట్టుబడులకు అవకాశాలు బాగుంటాయి. వృత్తి వ్యాపా రాలలో ఆదాయం పెరిగి అభివృద్ధి ఉంటుంది. నిరుద్యో గులకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు విధి నిర్వ హణలో గుర్తింపు గౌరవాలు పొందుతారు. దూరం నుండి ఆహ్వానాలు అందుతాయి. శుభకార్యాలు నిర్ణయం కాగలవు. సన్నిహితులే ఇబ్బందులుపెట్టే అవకాశముంది.

 

9Sagittariusధనుస్సు

తొందరపాటు మాటలు, ప్రవర్తన లేకుండా జాగ్రత్త పడండి. ముఖ్యవిషయాలలో ఇతరుల సలహాలు తీసి కొంటే మంచి జరుగుతుంది. ఉద్యోగ నిర్వహణలో సామర్ధ్యం, గుర్తింపు గౌరవాలు బాగుంటాయి. కొత్త వస్తువులు సమకూర్చుకొంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత, బంధుమిత్ర వర్గంతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రముఖులతో పరిచయాలుంటాయి.

 

10Capricornమకరం

కుటుంబంలో కొంత అనుకూలత లేకున్నా సర్దుబాటు చేసికొంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత, కొత్త వ్యాపారాలు, పెట్టు బడులకు అవకాశాలు దొరుకుతాయి. ఆర్ధికంగా కుదుట పడతారు. తొందరపాటు లేకుండా ఆలోచన ముందు చూపుతో నిర్ణయాలు చేయండి. వృత్తి వ్యాపారాలు లాభ దాయకంగా ఉంటాయి. విద్యా ప్రగతి బాగుంటుంది.

 

11Aquariusకుంభం

ఆర్ధిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు జరగవచ్చును. కుటుంబసౌఖ్యం బాగుం టుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతున్నా, టెన్షన్‌ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు, బ్యాంకు ఋణాలు అందుతాయి. శుభకార్య నిర్ణయాలు జరుగు తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలుంటాయి.

 

12Piscesమీనం

పనులు సక్రమంగా సానుకూలంగా జరుగుతాయి. కుటుంబసభ్యులకు అనారోగ్య బాధలుంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా జరిగి సామాన్యంగా ఆదాయ ముంటుంది. మంచి ఆర్ధికావకాశాలు చేజారిపోవచ్చును. శుభకార్యాలలో పాల్గొంటారు. అదనపు ఖర్చులు తప్పని సరిగా ఉంటాయి. ఆహ్వానాలు, నోటీసులు అందుకుం టారు. కుటుంబసౌఖ్యం కలదు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • హద్దులు మీరిన నేతలు కోటలు దాటిన మాటలు
    నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పేరు నిలబడుతుంది. అదే నోరు హద్దు దాటితే దశాబ్దాల చరిత్ర కాదు, శతాబ్దాల చరిత్రకల వాళ్ళు కూడా చరిత్రగర్భంలో కలిసిపోతారు. మాట, మన్నన రాజకీయ నాయకులకు చాలా అవసరం. ప్రజలలో వారి ఔన్నత్యాన్ని పెంచేది కూడా…
  • దుగరాజపట్నం పోయింది... ఇక రామాయపట్నం మిగిలింది
    దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం…
  • దుగరాజపట్నం ఎత్తేసినట్లే?
    దాదాపు పదేళ్ళుగా నెల్లూరుజిల్లా ప్రజలను ఊరిస్తూవస్తున్న దుగరాజపట్నం పోర్టు అంశం ఎత్తిపోయినట్లే కనిపిస్తోంది. ఈ పోర్టు కోసం గత కొన్నేళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. గత యూపిఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో మూడు ప్రాంతా లను పోర్టు నిర్మాణానికి పరిశీలించి, చివ రకు…
  • ఠారెత్తిస్తున్న సూరీడు
    మే నెల... రాళ్ళు, రోళ్ళు పగిలే ఎండలు... దీనికితోడు వడగాల్పులు... పగలు లేదు రాత్రి లేదు... ఎప్పుడైనా ఉక్కపోతే. ఈ వేసవిలో 38డిగ్రీలతో మొదలైన ఉష్ణో గ్రతలు ఇప్పుడు 45డిగ్రీలను తాకాయి. 14వ తేదీ 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15వ…
  • మండుటెండల్లో... వణుకుతున్న చంద్రన్న!
    అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి అన్నంత ఉద్వేగానికి లోనవుతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసిపి అధినేత జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడాన్ని ఆయన ఓ పట్టాన జీర్ణించు కోలేకపోతున్నాడు. ఆయన అమెరికాలో…

Newsletter