03 March 2017 Written by 

ఇంకెన్నాళ్ళు ఈ చెత్త పనులు

chettaరాజ్యసభ టిక్కెట్‌ కావాలా నాయనా... తెలుగుదేశం టిక్కెట్‌ కావాలంటే ఇవే అర్హతలు... కనీసం వెయ్యి కోట్లన్నా బ్యాంకులకు అప్పుండాలి, కార్పొరేట్‌ కంపెనీలకు అధిపతై ఉం డాలి. ఎగ్గొట్టిన వేలకోట్లలో నుండి పార్టీకి రెండు మూడొందల కోట్లన్నా ఖర్చుపెట్టాలి.

గమనిక : రాష్ట్ర శాసనమండలి సీటును అభ్యర్థిస్తున్న నాయకులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఇట్లు... ఏ.పి. తెలుగుదేశం పార్టీ.

''ఇంకెన్నాళ్ళు ఈ చెత్త పనులు...'' అనే స్లోగన్‌తో ఈ మధ్య ఆర్టీసీ బస్సుల వెనుక ఓ ప్రకటన చూస్తున్నాం. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ స్వచ్ఛభారత్‌ ప్రచారం కోసం ఇచ్చిన ప్రకటన అది. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్‌ మంత్రి నారాయణల అందమైన ఫోటోలు కూడా ఉంటాయి. బహిరంగ మల, మూత్ర విసర్జన, వీధుల్లో చెత్త వేసుకోవడం, ఇంటి పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచుకోవడమేనా చెత్త పనులు..? రాజకీయాలలో చెత్త పనులు లేవా? ఇప్పుడు స్వచ్ఛభారత్‌ అన్నది సమాజంతో పాటు రాజకీయపార్టీలకు, అందులోనూ తెలుగుదేశం పార్టీకి అవసరం. ఎందుకంటే తెలుగుదేశంలో జరిగేవన్నీ చెత్తపనులే!

స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశంపార్టీని స్థాపించారో, చంద్రబాబొచ్చి ఆ ఆశయాలను పూర్తిగా నీరుగార్చాడు. పార్టీలో ఒక సిద్ధాంతం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక విలువ లేదు. సిన్సియార్టీకి గౌరవం లేదు, సీనియార్టీకి ప్రాధాన్యత లేదు. వీధుల్లోనే కాదు రాజకీయా ల్లోనూ గుట్టలు గుట్టలుగా చెత్త ఉంటుందని చూపిస్తున్నాడు చంద్రబాబు. ప్రజల కోసం పనిచేసేవాళ్ళను కాకుండా తమ వ్యాపారాలు, కాంట్రాక్ట్‌ల కోసం పని చేసుకునే వాళ్ళను రాజ కీయాలలో ప్రోత్సహిస్తున్నాడు. 'ఇంకెన్నాళ్ళు ఈ చెత్త పనులు'' అని ప్రకటన చేస్తున్న మున్సిపల్‌ మంత్రి కూడా ఈ చెత్త సరుకులో తానుముక్కే! అసలు నారాయణ మంత్రి పదవికి అర్హుడా? చదువుల పేరుతో వేలకోట్ల వ్యాపారం చేసుకున్న నారాయణకు మంత్రి పదవి ఇవ్వడమేంటి? మూడేళ్ల క్రితం నెల్లూరులోని ఆయన ఆసుపత్రిలో నిర్మాణంలో వున్న భవనాలే కూలిపోయాయి. అలాంటి వ్యక్తికి రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగిరచడమేంటి? పార్టీ కష్టనష్టాల్లో వున్నప్పుడు కనిపెట్టుకుని నిలబడ్డ సీనియర్‌ నాయకులను కాకుండా ఒక వ్యాపారవేత్తను మంత్రిని చేయడం చెత్త పని కాదా? మారిషస్‌ బ్యాంకుల్లో వేలకోట్ల అప్పులు ఎగ్గొట్టి, వారి నుండి నోటీసులు అందుకున్న సుజనాచౌదరిని రాజ్యసభకు పంపించడం, ఆ తర్వాత కేంద్రమంత్రిని చేయడం చెత్త పని కాదా? రాయపాటి సాంబశివరావు, సీఎం రమేష్‌లు, నామా నాగేశ్వరరావులు ఇదే బాపతు కాదా? కనీసం ఎమ్మెల్సీ అభ్యర్థు లుగానన్నా పార్టీలోని సీనియర్‌ నేతలను నిలబెట్టకపోవడం చెత్త పని కాదా? బ్యాంకులకు వందల కోట్లు అప్పులున్న వాకాటికి నెల్లూరుజిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటివ్వడం చెత్తపని కాదా?

ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తెలుగుదేశంలో చేర్చుకోవడం చెత్తపని కాదా? వాళ్ళల్లో కొందరికి మంత్రిపదవులు ఇవ్వాలనుకోవడం చెత్త పని క్రిందకు రాదా? వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకోవడం ఎలా ఉందంటే పక్కవాడి పొలంలో పండిన పంటను మనం కోసుకుపోయినట్లుగా వుంది. చంద్రబాబు వైపు నుండి చూస్తే రాజకీయంగా ఇంకా చాలా చెత్తవుంది. ఆయన పరిపాలనలో అయితే మొత్తం చెత్తే!

''ఇంకెన్నాళ్ళు ఈ చెత్త పనులు'' అంటూ చంద్రబాబు ప్రజ లను ప్రశ్నించడం కాదు... ఈ చెత్త రాజకీయాలు ఇంకెన్నాళ్ళు అంటూ ప్రజలే చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. మేం చెత్తపనులు మానేస్తాం సరే... మీరు చెత్త రాజకీయాలను ఇకనన్నా మానుకోండని సలహా ఇస్తున్నారు. స్వచ్ఛభారత్‌ ప్రోగ్రాం సమాజంలోనే కాదు... అర్జంట్‌గా తెలుగుదేశంపార్టీలో కూడా అవసరమంటున్నారు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • బాలయ్య మాటిచ్చాడు... చంద్రబాబు పదవిచ్చాడు
    నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) తొలి ఛైర్మెన్‌గా తెలుగుదేశం నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మెన్‌గా శీనయ్యతో పాటు డైరెక్టర్‌లుగా మరో ముగ్గురిని నియమించారు. కావలి నియోజకవర్గం నుండి బీద…
  • ఇఫ్కో అక్రమ భూములను స్వాధీనం చేసుకోవాలి
    ఇఫ్కో కిసాన్‌సెజ్‌ అక్రమంగా తన ఆధీనంలో ఉంచుకున్న 596 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని కోరారు. వివాదాలేమీలేని ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter