03 March 2017 Written by 

ఉత్కంఠ రేపుతున్న స్థానిక పోరు

vakati రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్స్‌గా చెప్పుకోదగిన స్థానిక శాసనమండలి పోరుకు రేసుగుర్రాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోనే నెల్లూరుజిల్లా స్థానిక శాసనమండలి పోరు రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ అధికార తెలుగుదేశంకు ఏ మాత్రం తగ్గకుండా వైయస్సార్‌ కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జిల్లా రాజకీయాలలో తమదైన ముద్రవున్న ఆనం కుటుంబానికి చెందిన ఆనం విజయకుమార్‌రెడ్డిని రంగంలోకి దించింది.

ఇక తెలుగుదేశం అయితే కొన్ని రోజులు డ్రామాలు నడిపి చివరకు తాము అనుకున్న వాకాటి నారాయణరెడ్డినే అభ్యర్థిగా రంగంలోకి దించింది. ఈయన సిటింగ్‌ ఎమ్మెల్సీ! అంతకుముందు ఆనమోళ్ళ పుణ్యాన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీగా 9ఓట్ల తేడాతో గెలిచాడు. అది కూడా అప్పుడు కాంగ్రెస్‌ అధికారంలో ఉండింది కాబట్టి ఓట్ల లెక్కింపులో ఆనం వాళ్ళు జంతర్‌మంతర్‌ చేసి గెలిపిం చారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి డిపా జిట్‌ కోల్పోయారు. ఆ తర్వాత అధికార తెలుగుదేశంలో చేరాడు. చేరినప్పటి నుండి చంద్రబాబుకు చెక్కభజన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ పేరుమోసిన పారిశ్రామికవేత్త కమ్‌ ఎమ్మెల్సీ అయిన వాకాటి నారాయణరెడ్డి బ్యాంకులకు వందల కోట్లలో అప్పులున్నాడు. బాకీలు కట్టాలని బ్యాంకులు నెత్తి మీద పడితే చేతులెత్తేసే పరిస్థితి. ఆయన బ్యాంకు అప్పుల మీద మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. వందలు, వేల కోట్లు బ్యాంకుల్లో అప్పులున్నవాళ్లంటే చంద్రబాబుకు మహా ఇష్టం. అందుకే వాకాటిని చేరదీసి ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇచ్చాడు. ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకులను కాదని వాకాటికే ప్రాధాన్యతనిచ్చారు.

నెల్లూరుజిల్లా స్థానిక శాసనమండలి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని ఖరారు చేశారు. జిల్లా పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపిన అనంతరం పార్టీ అధినేత వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్‌, ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి ఈమేరకు నెల్లూరు వచ్చి జిల్లా వైకాపా నాయకులతో సమావేశమై ఎన్నికల్లో విజయావకాశాలు, ఖర్చు తదితర అంశాలపై చర్చించారు.

నెల్లూరుజిల్లా స్థానిక ఎమ్మెల్సీని జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఇప్పటి నుండే పార్టీ శ్రేణులను ఉత్సాహ పరచడానికి ఈ ఎన్నికలను ఒక మార్గంగా ఎంచుకున్నారు. అయితే జిల్లా స్థానిక శాసనమండలి నియోజకవర్గంలో వైకా పాకు ఓట్లు తక్కువున్నాయి. 2014లో ఎక్కువమంది స్థానిక ఓటర్లు వైకాపా తరపున ఎక్కువ మంది గెలిచినప్పటికీ తర్వాత అధికారపార్టీ తెలుగుదేశంలోకి కొంతమంది వెళ్లిపోయారు. దీంతో ప్రతి పక్ష వైకాపా తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కొందరు సంకోచించారు. తొలుత పోటీ చేయడానికి ఉత్సాహం చూపినవాళ్ళు కూడా వెనకడుగు వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికంటే డబ్బుతో కూడుకున్న పని... అలాగని గెలుపు గ్యారంటీ లేదు. ఈ దశలో జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబమైన ఆనం కుటుంబానికి చెందిన ఆనం విజయకుమార్‌రెడ్డి పేరు పరిశీలన లోకి వచ్చింది. తన సోదరులు ముగ్గురు తెలుగుదేశంలో వున్నా ఆయన మాత్రం వైకాపాలో చేరారు. ఇప్పుడు వైసిపి స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడడానికి ముందు కొచ్చారు. పార్టీ శ్రేణులు గట్టిగా కృషి చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం నాయకుల్లో దడ పుట్టించగలడు.

ఇక ఆయన పరంగా చూస్తే ఇప్పటి దాకా తన రాజకీయ చరిత్రలో తన సోదరు లను మోస్తూ వచ్చాడు. వాళ్ల ఎలక్షన్‌లకు ఇతను ఓటర్‌గా, కార్యకర్తగా, ఏజెంట్‌గా పనిచేశాడు. తొలిసారి ఆనం విజయకు ఎమ్మెల్సీ స్థాయి ఎన్నికలలో పోటీ చేసే అవకాశమొచ్చింది. కాని తన సోదరులు ముగ్గురూ తెలుగుదేశంలో వున్నారు. ఇప్పటి దాకా వాళ్లు ఇతని చేత పని చేయించుకు న్నారు. తీరా ఇతనికి అవకాశం వచ్చేసరికి వాళ్లు విరోధులయ్యారు. మరి విజయకు పరోక్ష సహకారమన్నా అందిస్తారో లేదో? పార్టీలను పక్కనపెడితే వాకాటితో పోలిస్తే ఆనం విజయకే మంచి పేరుంది. ప్రస్తుతం అభ్యర్థుల వ్యక్తిత్వమే ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధాన ప్రభావం చూపనుడడం విశేషం!



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • కావలి నాకే కావాలి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో సిటింగ్‌ ఎమ్మె ల్యేలలో ఎక్కువ మందికి తిరిగి టిక్కెట్లిచ్చే అవ కాశాలున్నాయి. అయితే ఒక్క కావలిలో మాత్రం సీటు విషయంలో బలమైన పోటీ నెలకొని వుంది. అది కూడా మాజీఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి నుండే కావడంతో కావలి వైకాపా…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • అవును... వాళ్ళిద్దరూ ఫోన్లు ఎత్తరు!
    మునిసిపల్‌ మంత్రి నారాయణ, కమిషనర్‌ ఢిల్లీరావులపై సర్వత్రా అసంతృప్తి ఒకాయన మునిసిపల్‌ శాఖకు రాష్ట్రాధినేత. సాక్షాత్తూ ఆ శాఖకి మంత్రి. మరొకాయన నెల్లూరు మునిసిపల్‌ శాఖలో అత్యున్నత అధికారి. ఆశ్చర్యం కలిగే విధంగా వీళ్ళిద్దరిలో కామన్‌గా ఒకే గుణం వుండడంతో అది…

Newsletter