03 March 2017 Written by 

నా దారి... అడ్డదారి!

addadhariప్రజాక్షేత్రంలో గెలవనివాడు, ప్రజల అభిమానాన్ని పొందనివాడు ప్రజా నాయకుడు అవుతాడా...? కాలేడు, ఎప్పటికీ కాలేడు. దేశానికి ఇందిరాగాంధీ, వాజ్‌పేయి, ఇప్పుడు నరేంద్ర మోడీ... ప్రధానులుగా పని చేసారు. పని చేస్తున్నారు. అలాగే మన్మోహన్‌సింగ్‌ కూడా ప్రధానిగా చేసారు. కాని వాళ్లకు మన్మోహన్‌సింగ్‌కు ఎంత తేడా? వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచారు. తమ పార్టీ లను గెలిపించారు. మరి మన్మోహన్‌సింగ్‌... పదేళ్ళు ప్రధానిగా చేసినా రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆ పదవిలో కూర్చున్నారే గాని, ఒక్కటంటే ఒక్కసారి కూడా లోక్‌సభ ఎన్నికల పోరులో నిలబడి ప్రజల్లో తనకేపాటి ఆదరణుందో నిరూపించుకోలేదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాక్షేత్రంలో కూడా దొడ్డి దారిగుండా పదవులు అనుభవించవచ్చు. రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబు వారసుడిగా వున్న నారా లోకేష్‌ కూడా ఇప్పుడు అదే దొడ్డిదారి పట్టాడు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టి లోకేష్‌కు మంత్రి కుర్చీ ఇవ్వనున్నారు. ఇందు కోసం ఆయనను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని మొన్న జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో తీర్మానించారు.

రాజకీయాలతో సంబంధం లేని ఓ రిటైర్డ్‌ ఉన్నతాధికారినో, మేధావినో, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులనో మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నప్పుడు... (అంటే నారాయణ బోటోళ్లని) ఇలా ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే బాగుంటుంది. కాని లోకేష్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి ఇది సరైన మార్గం కాదు. ఎందుకంటే చంద్రబాబు తర్వాత తెలుగుదేశంపార్టీ బాధ్యత లోకేష్‌దే! ఇందులో సందేహం లేదు. పార్టీని నడి పించాల్సినవాడు ముందు ప్రజల నుండి ఎన్నిక కావాలి. ప్రజల్లో తన టాలెంట్‌ను, నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవాలి. ప్రజల నమ్మకాన్ని పొందాలి. కనీసం ముందు ఒక అసెంబ్లీ సెగ్మంట్‌ ప్రజలలోనన్నా తనను తాను నాయకుడిగా ఋజువు చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు తలిస్తే రాష్ట్రంలో ఏదో ఒక అసెంబ్లీ నుండి వున్న ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి లోకేష్‌ను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా గెలిపించడం పెద్ద సమస్య కాదు. లోకేష్‌ ప్రజల నుండి ఎన్నికైతే అతని నాయకత్వం మీద తెలుగుదేశం నాయకులకు కూడా నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు లోకేష్‌ అడ్డదారిలో ఎమ్మెల్సీ అయ్యి, మంత్రి పీఠమెక్కితే... అతని వరకు సరిపోతుంది. మరి రేపు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని నడిపించాలి. నాయకులను ఒప్పించాలి. ప్రజలను మెప్పించాలి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఏ నాయకుడికైనా ఆ నేర్పు వస్తుంది. మరి అడ్డదారిలో గద్దెనెక్కిన లోకేష్‌ రేపు పార్టీని ప్రజాయుద్ధంలో ఎలా గెలిపించగలడు.

దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి తలచుకుని వుంటే తన కొడుకు జగన్‌ను రాజ్యసభకు పంపి కేంద్రమంత్రిని కూడా చేసుండేవాడు. కాని, ఆయన అలా చేయలేదు. 2009 ఎన్నికల్లో కడప లోక్‌సభ నుండి జగన్‌ను అభ్యర్థిగా నిలబెట్టాడు. ప్రజల్లో తిప్పాడు. ప్రజలతో కలవడం, మాట్లాడడం, వారి మనోభావాలను గుర్తించడం నేర్పాడు. కాబట్టే ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగానైనా జగన్‌, ఈ రాష్ట్రంలో ఇంకే నాయకుడికీ లేనంత ప్రజాదరణ పొందగలుగుతున్నాడు. ప్రజలలో ఎన్నిక కావడం కంటే ఏ దారయి తేనేం పదవే ముఖ్యమనుకునే లోకేష్‌, చంద్రబాబు తర్వాత పార్టీనేం నడిపించగలడు?Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter