03 March 2017 Written by 

పోర్టు పుణ్యం.. ఎయిర్‌పోర్టు ఎగిరిపోనుందా?

aeroనెల్లూరుజిల్లా దగదర్తి మండలం దామవరం వద్ద హైవే పక్కన ఎయిర్‌ పోర్టు... దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖరరెడ్డి హయాంలో పురుడు పోసు కున్న కల. ఎయిర్‌పోర్టు కోసం ఇక్కడ భూసేకరణ జరిగింది. సర్వే ముగిసింది, నిధులు మంజూరు కూడా అయ్యాయి. ఇక కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపనే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఇక్కడ విమానాలు ఎగరడం మాట అటుంచి అసలు ఎయిర్‌పోర్టే ఎగిరిపో యిందని తెలుస్తోంది. ఎగిరి ఎక్కడికో పోలేదు, నెల్లూరు జిల్లాలోనే ముత్తుకూరు మండలంలో రిలయన్స్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం సేకరించిన 2వేల628 ఎకరాల భూముల్లో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం కాను న్నట్లు సూచాయగా తెలుస్తోంది. దేశం లోనే పెద్ద పోర్టుగా, ఎగుమతులు, దిగు మతులలో దూసుకుపోతున్న కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఒత్తిడితోనే ఎయిర్‌ పోర్టును అక్కడనుండి ఇక్కడకు మార్చినట్లు తెలుస్తోంది. కృష్ణపట్నం పోర్టుకు అనుసం ధానంగా, పోర్టు వాణిజ్యానికి అనుకూ లంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో పాటు, రిలయన్స్‌ కోసం సేకరించిన భూములు ఎలాగూ ఖాళీగా వున్నాయి కాబట్టి భూ సేకరణ సమస్య కూడా లేకపోవడంతో ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పచ్చ జెండా ఊపారని సమాచారం.

దామవరం వద్ద ఎయిర్‌పోర్టు అయితే నెల్లూరుజిల్లా ప్రయాణీకులతో పాటు ప్రకాశం జిల్లా ప్రయాణీకులకు కూడా అనువుగా ఉండేది. ముఖ్యంగా పడమర మండలాల వారికి చాలా సౌకర్యంగా ఉండేది. దామవరం అయితే హైవేకు పక్కనే ఉండడం, జిల్లాలోని అన్ని వైపుల నుండి హైవేలోకి మంచి కనెక్టివిటీ ఉం డడం వల్ల ప్రయాణీకులకు సులువుగా ఉండేది. ఇప్పుడు రిలయన్స్‌ కోసం సేక రించిన భూముల్లో ఎయిర్‌పోర్టు పెడితే జిల్లాలో అదొక కొసన అవుతుంది. అదీగాక రోడ్డు కనెక్టివిటీ సరిగా లేదు. ఏ ప్రాంతం వాళ్లైనా నెల్లూరు, ముత్తుకూరు రోడ్డు ద్వారా అక్కడికి చేరుకోవాలి. ఇప్పటికే ఆ రోడ్డులో ట్రాఫిక్‌ నరకంగా వుంటుంది. ఇక ఎయిర్‌ పోర్టు పడితే పెరిగే ట్రాఫిక్‌తో అరగంట ప్రయాణం ఒకటిన్నర గంట అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

అయితే ఒకటి నిజం... కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా ఎయిర్‌పోర్టు ఇక్కడ వస్తే ప్రయాణీకుల సౌకర్యం మాట అటుంచి, పారిశ్రామికాభివృద్ధికి అవకాశం ఉంటుంది. కృష్ణపట్నం పోర్టుకు ఎయిర్‌ కార్గో పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు రాకపోకలు సాగించ డానికి అనువుగా వుంటే పరిశ్రమలు పెరగవచ్చు. రిలయన్స్‌ భూముల్లో ఎయిర్‌ పోర్టు ఖాయమైతే ముత్తుకూరు రోడ్డులో రియల్‌ భూమ్‌ మళ్ళీ ఒక ఊపు ఊపొచ్చు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter