04 March 2017 Written by 

అగ్రరాజ్యం... విద్వేషానికి ఆజ్యం

usa flagఅమెరికాలో ఇటీవల బాగా పెచ్చరిల్లిపోతున్న జాత్యహంకార విద్వేషపూరిత వాతావరణం చివరికి ఒక అమాయక భారతీయ ఇంజనీర్‌ ప్రాణాలను బలి తీసుకోవడం దారుణం. అమెరికాలో మెరుగైన అవకాశాలుంటాయని ఆశపడి ఖండాంతరాలకు వలసపోయిన తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌ను జాతి విద్వేషం నరనరానా జీర్ణించుకుపోయిన ఒక దుండగుడు కాల్చి చంపడం ఘోరం.. ఘోరాతిఘోరం. ఇలాంటి విద్వేష పరిణామాలకి ఆజ్యం పోస్తున్న అమెరికన్‌ పాలకుల వైఖరి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురవుతోంది. అయినా... ఇదెక్కడి విద్వేషమో ఎవరికీ అర్ధం కావడం లేదు. అందరినీ శత్రువుల్లా చూస్తే ఎలా?..అమెరికాలో ఉద్యోగాలన్నిటినీ ఇతర దేశాల వారు కొల్లగొడుతున్నారంటూ అమెరికన్లను రెచ్చగొట్టే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాటలు విద్వేషాగ్నులు రగిలించేవారికి బాగా ఊతమిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం మంచి అవకాశాలను వెదుక్కుంటూ దేశదేశాల నుంచి అమెరికా వెళ్ళిన వారికి ఈ విద్వేషాగ్నులు అనునిత్యం భయ కంపితుల్ని చేస్తున్నాయి. జాతి, మతం, వర్ణం, వర్గం, ప్రాంతాల భేదాలతో ఏదేశమైనా కునారిల్లిపోతే పెరిగేది విద్వేషమే తప్ప వికాసం కాదన్నది అందరికీ తెలిసిన సత్యమే. మనిషి గుణాన్ని నిర్వచించేవి నలుపు-తెలుపు రంగులు కాదు. మానవత్వం వుండడమే మనిషికి ప్రధానం. అయినా, తమకు ఉద్యోగాలిచ్చి ఉపాధి కల్పించి మంచి జీవితాలనిచ్చిన వారిపై మానవత్వం వున్నవారెవరైనా ఆత్మీయతను, అభిమానాన్ని పెంచుకుంటారే తప్ప.. ద్వేషంతో వుంటారా?.. అందులోనూ మంచికి-మానవత్వానికి, శాంతికి- సామరస్యానికి ప్రతీకలైన భారతీయులు ఎప్పుడైనా అలాంటి విద్వేషాల జోలికి వెళ్తారా?... ఎక్కడైనా విద్వేషాలకి బలైపోవడమే తప్ప, ఎవరిపైనైనా అలాంటి దుశ్చర్యలకు పాల్పడాలనే పాపిష్టి ఆలోచనలు భారతీయులకు ఏనాడైనా వున్నాయా?.. దాదాపు 32 లక్షల మందితో కూడిన భారతీయ అమెరికన్‌ సమాజం, మరో లక్షమంది విద్యార్థులతో అమెరికాలో వున్న భారతీయులు ఇప్పుడు అమెరికన్‌ పాలకుల విధానాలతో భద్రత కరువై అనునిత్యం సతమతమైపోతున్నారంటే పరిస్థితి అక్కడ ఎంత విషమంగా వుందో!.. భారతీయులంతా ఇప్పుడు భవిష్యత్తుపై బెంగతో అల్లాడిపోతున్నారు. అమెరికాలో విద్వేష ముఠాల సంఖ్య పెరిగిపోతుండడంతో ఎప్పుడు ఏ విపత్తు వచ్చిపడుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు. అమెరికా అభ్యున్నతికి అహరం పనిచేసే భారతీయులు ఏనాడూ అమెరికాకు శత్రువులు కారు..కాలేరు. అయినా, తమకు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో అగ్రరాజ్యం తెలుసుకోకపోతే ఎలా?.. భారతీయులు అమెరికాకి ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఆప్తులే.. ఆత్మీయులేనన్న వాస్తవాన్ని అమెరికన్‌ పాలకులు గ్రహించడం అత్యవసరం. అమెరికాలో వుంటున్న భారతీయులకు స్నేహహస్తాన్నందించి అమెరికా మరింతగా ఎదగాలి.. సమున్నతంగా ఎదగాలన్నదే భారతీయుల ఆకాంక్ష. ఒకవైపు అమెరికాతో సహా..ప్రపంచాన్నే భయపెడుతున్న ఉగ్రవాదం కోరలు పెరికేయాలని, ప్రపంచాన్ని శాంతియుతంగా వుంచాలని..ఉగ్రవాదం నిర్మూలనకోసం ప్రపంచమంతా ఏకం కావాలని పిలుపునిచ్చే శాంతియుత భారత్‌ను రెండుచేతులా కావలించుకోవాల్సింది పోయి...భారతీయులపైనే విద్వేషంతో వుండడం ఎంత బాధాకరం?..

శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో ప్రపంచంలోనే అగ్రగామిగా వున్న అమెరికాయేనా ఇలా వుండాల్సింది?.. ఇంకా ఏ పురాతన కాలంనాటి ద్వేషాలు..విద్వేషాలు, జాత్యంహంకారాలనో పట్టుకుని వేలాడడం ఎంతవరకు సమంజసం?..ఎవరి తాటాకు చప్పుళ్ళకూ భయపడాల్సిన అవసరం అమెరికాకి ఇప్పుడే కాదు.. ఎప్పుడూ లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశమైన అమెరికా..ప్రపంచానికే పెనుసవాల్‌గా నిలిచిన

ఉగ్రవాదం వంటి దుర్మార్గాలను దునుమాడి, ప్రపంచానికి శాంతిని కాంతినీ కలిగిస్తూ..మానవాళికి మహోపకారం చేసే విధానాలతో ప్రపంచానికే మార్గదర్శకంగా వుండాల్సిన సమయంలో, ఇంకా జాతివిద్వేషాలతో కునారిల్లిపోవడం ఏమిటా అని ప్రపంచమే విస్మయచకితమవుతోంది. ప్రపంచంలో ఎన్నో పేదదేశాలున్నాయి.. పేదరికంతో అల్లాడిపో తున్నాయి. ఎంత ప్రతిభ వున్నా సరైన అవకాశాలు లేక దేశదేశాల్లో ఎంతోమంది యువత నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిభకు పట్టం కడుతూ, ప్రగతిని అందలమెక్కించాల్సిన దేశంలో అభద్రతాభావం పొడచూపడమా?.. ఇది ఏనాటికీ మంచి పరిణామం కాదు. ఇప్పటికే కొన్ని దేశాలు

ఉగ్రవాదభయంతో కంటికి నిద్రలేకుండా వున్నాయి. మరోవైపు వాతావరణ అసమతుల్యతలు, పర్యావరణ సమస్యలు భగ్గుమంటున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా వున్న అశాంతిని పారదోలి, అగ్రరాజ్యంగా ఈ ప్రపం చానికి నేనున్నాంటూ తనవంతు పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన అమెరికాయేనా.. ఇలా విద్వేషాలకు నిలయంగా మారడమని అందరికీ వేదన కలిగిస్తోంది. అమెరికాలోని అత్యధికశాతం ప్రజలుకూడా మానవత్వంతో..ఇలాంటి విద్వేషాలను వ్యతిరేకిస్తున్నా అక్కడి పాలకులు పట్టించుకోకపోవడం మరింత దారుణం. అమెరికాలో శ్రీనివాస్‌పై దాడి జరిగినప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నించి గాయపడింది కూడా ఒక అమెరికన్‌ యువకుడే. ఆయన పేరు గ్రిలట్‌.. జాత్యహంకారంతో శ్రీనివాస్‌పై దాడి జరుగుతున్నప్పుడు అడ్డుకున్న మానవతావాది ఆయన. 'సాటి మనిషి కోసం ఏమి చేయాలో అదే నేనూ చేశాను' అని ఆయన సంతోషంగా అంటున్నప్పుడు ఆ మాటల్లో పరిమళించిన మానవత్వం ప్రపంచాన్నే గుభాళింపజేసిందంటే అతిశయోక్తి కాదు. అలాంటి మానవతావాదులున్న అమెరికాలో... జాత్యహంకారం ముసురుకోవడం మంచిది కాదు. ఇకనైనా ఆ తీరు మారాలి. అమెరికాలో విద్వేషాలు కాదు..మానవత్వం పెల్లుబుకాలి. విద్వేషాగ్నులను చల్లార్చి.. మానవత్వంలోనూ అమెరికాయే ప్రపంచంలో అగ్రగామి అనిపించాలి!..



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…

Newsletter