సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఏప్రిల్‌లో జిఎస్ఎల్వి-ఎఫ్09, జిఎస్ఎల్వి-మార్క్3, పిఎస్ఎల్వి-సి38 ప్రయోగాలను నిర్వహించేం దుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 15న 104 ఉపగ్రహాల ప్రయోగంతో విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఏకకాలంలో మూడురాకెట్ల అనుసంధాన పనులు చేస్తున్నారు. రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ భవనం(వీఏబి)లో జిఎస్ఎల్వి-ఎఫ్09 అనుసంధాన పనులు జరుగుతున్నాయి. సాలిడ్ స్టేజి అసెంబ్లింగ్ బిల్డింగ్(ఎస్ఎస్ఏబి)లో జిఎస్ఎల్వి-మార్క్3 రాకెట్ అనుసంధాన పనులు కూడా ముమ్మరంగా జరుగు తున్నాయి. దీనికి సంబంధించి ఎస్-200, ఎల్-110, సి-25 అనే మూడు దశలకు భూస్థిర పరీక్షలను నిర్వహించి విజయవంతమయ్యాక ఆ దశలను అనుసంధానం చేస్తున్నారు. జిఎస్ఎల్వి-ఎఫ్09 రాకెట్ ద్వారా రెండు టన్నుల బరువైన జీశాట్-9, జిఎస్ఎల్వి మార్క్3 రాకెట్ ద్వారా నాలుగు టన్నుల బరువు కలిగిన జిశాట్-19 సమాచార ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకు సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నారు. మొదటి ప్రయోగ వేదికపై వారంరోజుల్లో పిఎస్ఎల్వి-సి38 పనులను ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో దూర పరిశీలన ఉపగ్రహంతో పాటు వాణిజ్యపరమైన ఉపగ్రహాలు ఉండే అవకాశం వుంది.
Published in
జాతీయ వార్తలు
Tagged under

Lawyer
Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly
Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.