Saturday, 04 March 2017 07:20

ట్రంప్‌ను చెడగొట్టిన కేసీఆర్‌

Written by 
Rate this item
(0 votes)

galpikaఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యా లయం. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్‌, రాజ్‌ నాథ్‌సింగ్‌, మనోహర్‌ పారికర్‌, అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడులు ఉన్నారు. అమెరికాలో జరిగిన ఎన్నారై శ్రీనివాస్‌ కూచిబొట్ల హత్యోదంతంపై వాళ్లు సమావేశమయ్యారు. జరిగిన దారుణాన్ని అందరూ తీవ్రంగా ఖండించారు. దీనిపై అమెరికా ప్రభుత్వానికి నిరసన తెలియ జేయాలని కూడా తీర్మానించారు. అమెరి కాలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దుర్మార్గాలు లేవు. దోపిడీలు, దొమ్మీలు ఉండేవి గాని, జాతి వివక్ష కారణంగా హత్యలు జరగలేదు. అమెరికాలో కూడా జాతి వివక్ష ఉందంటే ఇక ఈ ప్రపం చాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఈ జాతి వివక్షతకు అధ్యక్షుడు ట్రంపే కారణంగా కనిపిస్తున్నాడని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వ్యాఖ్యానించాడు. అప్పుడు వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని... నో... అక్కడ జాతి వివక్షకు కారణం ట్రంప్‌ కాదు, మన తెలంగాణ సీఎం కేసీఆర్‌ అని అన్నాడు. ఆ మాటకు మోడీతో సహా అందరూ ఆశ్చర్యపో యారు. అమెరికాలో జాతి వివక్షకు కేసీఆర్‌ కారణమా... అదెలా అని ప్రశ్నిం చారు. అప్పుడు వెంకయ్య... ఇలా అంటూ అందర్నీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లాడు.

2016వ సంవత్సరం. అమెరికా అధ్యక్షుడి ఎన్నికల సీజన్‌! అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ నుండి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ నుండి హిల్లరీ క్లింటన్‌ పోటీ పడుతున్నారు. పలు అంతర్జాతీయ వార్తా సంస్థల సర్వేలన్నీ కూడా హిల్లరీకే అధ్యక్ష పీఠం అని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో డొనాల్డ్‌ ట్రంప్‌ తన నివాసంలో పార్టీ ముఖ్యులతో సమావేశ మయ్యాడు. గత రెండు దఫాలుగా డెమో క్రట్లే అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈసారి మనం గెలవకపోతే పరువు పోతుంది. కాని, సర్వేలు మాత్రం ఆ హిల్లరీ గెలుస్తుందని చెబుతున్నాయి. దీనిని మార్చే మార్గమే లేదా అని ట్రంప్‌ ప్రశ్నించాడు. అప్పుడు రిపబ్లికన్‌ పార్టీ ముఖ్యనేత ఫిడేల్‌ కంప్‌ లేచి... సార్‌, ఈ విషయంలో మనం ఇండియన్‌ నేత లను ఫాలో అయితే కొంచెం రిజల్ట్‌ ఉండొచ్చన్నాడు. ఎవరిని ఫాలో అయితే బెటర్‌ అని ట్రంప్‌ అడిగాడు. నాకు తెలిసి స్వల్పకాలంలో ప్రజలలో ప్రాంతీయ భావోద్వేగాలు రెచ్చగొట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ను ఫాలో అయితే బాగుంటుందని కంప్‌ సలహా ఇచ్చాడు. అంతే అప్పటికప్పుడు ఇండియా నుండి కేసీఆర్‌ ప్రసంగ సీడీలను ట్రంప్‌ తెప్పించుకున్నాడు. వాటిని ప్రతిరోజూ రోజుకొక గంట లెక్కన చూడసాగాడు. కేసీఆర్‌ ప్రసంగంలో ప్రాంతీయ భావా లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ట్రంప్‌ను బాగా ఆకర్షించాయి. ప్రియమైన తెలంగాణ బిడ్డలారా... సోనియాగాంధీని బజారు కీడ్చయినా తెలంగాణ తెచ్చుకొంటాం, తెలంగాణ కోసం ఛస్తాం, లేదంటే చం పుదాం, పంచుడో, దంచుడో... ఏదో ఒకటి తేలుద్దాం. ఆ ఆంధ్రోళ్లు దొంగలు, మన ఆస్తులను, మన ఉద్యోగాలను కాజేసిండ్రు, వాళ్లను ఇక్కడ నుండి తరిమి తరిమి కొట్టాలి. హైదరాబాద్‌ నుండి ఆంధ్రోళ్లను వెళ్లగొడితే వారి ఇళ్లు, పొలాలు, స్థలాలు అన్నీ తెలంగాణ బిడ్డలకే... జాగో, బాగో... తెలంగాణ ఇవ్వకపోతే రక్తపుటేరులే... తెలంగాణ ఇస్తే చాలు... నాకు పార్టీ అక్కరలేదు, నా పార్టీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేస్తా... అంటూ కేసీఆర్‌ ఉపన్యాసం

ఉంది.

ఇంకో సిడిలో తెలంగాణ ఇచ్చాక కేసీఆర్‌ ప్రసంగం... తెలంగాణ ఇచ్చే దానికి సోనియా గాంధీ ఎవరు... మనమే మన్నా అడుక్కున్నామా, తెలంగాణ ఏమన్నా ఇటలీలో వున్నవాళ్లబ్బసొత్తా... తెలంగాణ మన హక్కు... భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చిన ఎలిజిబిత్‌ రాణిని ఎవరూ అనుకోరు, స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ మహాత్ముడే మనకు ఆదర్శం. కాబట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా కంటే తెచ్చిన నేనే గొప్ప అని కేసీఆర్‌ ఉపన్యాసం వుంది.

కేసీఆర్‌ ప్రసంగాలకు ట్రంప్‌ బాగా ఆకర్షితుడయ్యాడు. కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో రెచ్చిపోయాడు. విద్వేష పూరిత ప్రసంగాలు చేయసాగాడు. తాను అధ్యక్షుడినైతే అమెరికాలో ఉద్యోగాలన్నీ అమెరికన్‌లకేనన్నాడు. మన ఉపాధి అవకాశాలను దోచుకుపోతున్న విదేశీ యులను మెడపట్టి గెంటేస్తానన్నాడు. ఆయన ప్రసంగాలతో స్థానికులు రెచ్చి పోయారు. ఒక్కసారిగా అమెరికాలో ఓటింగ్‌ సరళి మారింది. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాడు.

అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్‌ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడం మొదలుపెట్టాడు. అంటే జాతి విద్వేషాలు రగిల్చి విదేశీయులను వెళ్ల గొట్టడానికి పొగపెట్టాడు.

``````````

ఇక్కడితో ఫ్లాష్‌బ్యాక్‌ అయిపోయింది. వెంకయ్య వారితో... మన కేసీఆర్‌ను అతను ఆదర్శంగా తీసుకున్నాడు. కాబట్టే అమెరికా అలా మండిపోతోందన్నాడు. అప్పుడు మోడీ... ఆ తిక్క ట్రంప్‌ పూర్తిగా ఇండియన్‌ లీడర్స్‌ను ఫాలో కావడం కాదు, కాబట్టే అలా తయారయ్యాడు. నా దగ్గర కేసీఆర్‌ ప్రసంగానికి సంబంధించిన సి.డినే ఒకటుంది. మీరు వెంటనే అమెరి కాకు వెళ్లి ఆ మెంటలోడికి ఆ సి.డి చూపించండి. అతనిలో కొంతన్నా మార్పు రావచ్చని చెప్పి వెంకయ్య చేతికి ఒక సి.డి ఇచ్చాడు. దానిని తీసుకుని సుష్మాస్వరాజ్‌, వెంక య్యలు అమెరికా బయలుదేరారు.

`````````

వైట్‌హౌస్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌, అతని మంత్రులు వున్నారు. వెంకయ్య, సుష్మా స్వరాజ్‌లు తాము తీసుకెళ్లిన కేసీఆర్‌ స్పీచ్‌ సి.డిని అతనికిచ్చారు. ట్రంప్‌ ఆ సి.డిని ప్లేయర్‌లో పెట్టి ఆన్‌ చేశాడు. టీవీ స్క్రీన్‌ మీద కేసీఆర్‌ స్పీచ్‌ సీన్‌...

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆంధ్రోళ్లు ఎక్కువుగా వుంటున్న కూకట్‌పల్లి ఏరియాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రసంగం... ఇండియాలో ఉన్న వాళ్లంతా ఇండియన్స్‌ అయినప్పుడు, హైదరాబాద్‌లో ఉన్న మనమంతా హైద్రా బాదీలం కాలేమా... మూసీ నది నీళ్లు తాగేవాళ్లంతా అక్కచెల్లెల్లయినప్పుడు... మందాకిని వైన్స్‌లో మందు తాగే వారి మంతా అన్నదమ్ములం కాలేమా... కుల మత ప్రాంతాలకు అతీతంగా మన మంతా ఒక్కటే... ఆంధ్రోళ్లకు నేను అన్నగా ఉంటా... అండగా ఉంటా... ఆంధ్రోళ్లంతా నా తమ్ముళ్ల లాంటి

వాళ్లు... మీ ఆస్తులకు, మీ ప్రాణాలకు నేను కాపలాగా ఉంటా... ఎవరన్నా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే వారి అంతు చూస్తా... అంటూ కేసీఆర్‌ ప్రసంగం ముగించాడు.

ఆ ప్రసంగం విని ట్రంప్‌ నోరు తెరిచాడు. అప్పుడు వెంకయ్య... మీరు ఇండియన్‌ లీడర్స్‌ను ఫాలో కావాలంటే పూర్తిగా ఫాలోకండి... మీరు కేసీఆర్‌ను ఎన్నికల పార్ట్‌ వరకే అనుసరించారు. ఎన్నికల తర్వాత కూడా అతని శైలిని అనుసరించి వుంటే ఈరోజు అమెరికాలో ఇన్ని అనర్ధాలు జరగవు. ఒకటి గుర్తుంచు కోండి.. వాగ్దానాలనేవి ఎన్నికల్లో చెప్పడా నికే గాని ఆచరించడానికి కాదు... మా ఏపికి ప్రత్యేకహోదా మాదిరిగా అంటూ అక్కడ నుండి లేచాడు.

Read 117 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • వారి ఆశలపై... నీళ్ళు చల్లారు!
    రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుండి 225కు పెరుగు తాయనే ప్రచారం మొన్నటివరకు బలంగా వుండింది. ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రచారానికి తెరదించుతూ ఈ ఎన్నికలకే కాదు, ఆ తర్వాత ఎన్నికల నాటికి కూడా సీట్ల పెంపు ఉండదని కుండబద్ధలు…
  • నేరం మా వాళ్ళది కాదు
    రాజకీయ ఒత్తిళ్లకు లొంగి అడ్డదారులు తొక్కితే, రాజకీయ నాయకుల మాటలు నమ్మి వారు చెప్పినట్లు నడుచుకుంటే పరిస్థి తులు ఎలా వుంటాయో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం లోని అధికారులకు తెలిసొచ్చింది. ఇటీవల పసుపు కొనుగోలు వ్యవహారం జిల్లాలో సంచలనం కావడం తెలిసిందే!…
  • నంద్యాల ఎన్నికలో... పెట్టుబడిదారులూ నెల్లూరోళ్ళే!
    నంద్యాల ఎన్నికల ప్రచారంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇరు పార్టీల నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. తామే పోటీ చేసినంత కసిగా పని చేస్తున్నారు. అయితే నంద్యాల ఎన్నికలకు ప్రచారకర్తలే కాదు పెట్టుబడి దారులు కూడా నెల్లూరోళ్ళేనని సమాచారం. నంద్యాల వైకాపా అభ్యర్థి…
  • ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య రాజీనామా!
    ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌, ఉమాభారతి, సుష్మాస్వరాజ్‌, స్మృతి ఇరానీలు సమావేశమైవున్నారు. మొదట మోడీ మాట్లాడుతూ... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మన పార్టీ వాళ్లంతా బాగా పనిచేసారు. బాధ్యతలను సక్రమంగా…
  • బెట్టింగ్‌ తీగ లాగుతూనే వున్నారు... డొంక కదులుతూనే ఉంది
    నెల్లూరుజిల్లాకు పిహెచ్‌డి రామకృష్ణ అనే ఒక ఎస్పీ వస్తాడని, బెట్టింగ్‌ రాయుళ్ళపై ఈ స్థాయిలో విరుచుకు పడతాడని, బుకీల బొక్కలు విరిచేస్తాడని ఎవరూ ఊహించ లేదు. అసలు బెట్టింగ్‌పై ఈ స్థాయిలో పోలీస్‌ ఆపరేషన్‌ వుంటుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు.…

Newsletter