11 March 2017 Written by 

బాక్సుల్లో భవిష్యత్‌

boxతూర్పు రాయలసీమ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలు 9వతేదీ జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 6గంటలకు ముగిసింది. పట్టభద్రుల నియోజకవర్గం నుండి 13మంది, ఉపా ధ్యాయ నియోజకవర్గం నుండి 9మంది బరిలో నిలిచారు. మూడుజిల్లాలకు సంబంధించిన ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి పిడిఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన విఠపు బాలసుబ్రహ్మణ్యం, టీడీపీ మద్దతుదారుగా పోటీ చేసిన వాసుదేవనాయుడుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అలాగే పట్ట భద్రుల నియోజకవర్గంలో పిడిఎఫ్‌ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం పట్టభద్రుల నియోజకవర్గంలో 64.95శాతం, ఉపా ధ్యాయ నియోజకవర్గంలో 87.1శాతం పోలింగ్‌ నమోదైంది. నెల్లూరుజిల్లా వ్యాప్తంగా పట్టభద్రులకు 85 పోలింగ్‌ కేంద్రాలను, ఉపాధ్యాయులకు 48 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసారు. పోలింగ్‌ కేంద్రాలలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా 133 వెబ్‌కెమెరాలను అమర్చారు. ఈ వెబ్‌కెమెరాల ఏర్పాటుతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తీరును కలెక్టరేట్‌ నుండే పర్యవేక్షించారు.

కాగా, పోలింగ్‌ కేంద్రాల వద్ద అధి కారపార్టీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల హడావిడి ఎక్కువుగా కని పించింది. మండలి ఎన్నికలకు కూడా సార్వత్రిక ఎన్నికల కలరింగ్‌ తెచ్చారు. తెలుగుదేశం నాయకులు ప్రతి మండల నాయకులకు ఖర్చుల క్రింద 50వేలు, లక్ష లెక్కన ఇచ్చారు. ఉపాధ్యాయుల నియోజక వర్గంలో పోలింగ్‌ శాతం మెరుగ్గా వుంది. పట్టభద్రుల నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం తక్కువుగా వుంది. పోల్‌ అయిన ఓట్లలో సగానికి పైగా 1వ ప్రాధాన్యత క్రమం ఓట్లు వచ్చిన వాళ్ళే విజేతలు. అయితే పట్టభద్రుల నియోజకవర్గంలో 13మంది అభ్యర్థుల మధ్య సగం ఓట్లు తెచ్చుకోవడం ఎవరికైనా కష్టమే కాబట్టి 2వ ప్రాధాన్యత ఓటు కూడా కీలకమయ్యే అవకాశముంది.

ఏదేమైనా పోలింగ్‌ ముగిసింది. అభ్యర్థుల జాతకం బ్యాలెట్‌ బాక్సుల్లోకి చేరింది. 20వ తేదీ బాక్సులను బద్దలు చేస్తే ఎవరి భవిష్యత్‌ ఏంటో తేలుతుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • భానుడు... భగభగ
    సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తు న్నాడు. ఏప్రిల్‌ నెలాఖరుకే సినిమా చూపిస్తున్నాడు. ఇప్పటికే ఎండలు 43డిగ్రీలను తాకాయి. ఇంకా వడ గాల్పులు మొదలుకాలేదు. మే నెల రాలేదు. రోళ్లు పగిలే రోహిణికార్తె ముం దుంది. ఇప్పుడే ఎండలు ఈ రేంజ్‌లో వున్నాయంటే, ఇంక…
  • కావలి ప్రజల దాహార్తి తీర్చండి
    కావలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే ఈ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు నీరందించి ఆదుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి కోరారు. ఈనెల 16న ఆయన కావలి పెద్ద చెరువును…
  • దాహార్తికి మూగజీవాలు విలవిల
    తాగడానికి గుక్కెడు మంచినీరు దొరక్క జనం అల్లాడిపోతుంటే, దాహార్తికి మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. ఈ ఏడాది జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలు అడుగంటి ఎటుచూసినా ఎడారే కనిపిస్తోంది. దీంతో దాహంతో మూగజీవాలు గిలగిల కొట్టుకుంటూ వేలసంఖ్యలో మృత్యువాత…
  • కలుస్తారా... కలసి నడుస్తారా?
    టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వైసిపి, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా... ఇంకా పలు పార్టీలను గ్రైండర్‌లో వేసి గంటసేపు రుబ్బిన తర్వాత వచ్చిన పదార్ధమే నేటి తెలుగుదేశంపార్టీ! ఒకప్పటి ఎన్టీఆర్‌ ఒరిజినల్‌ పార్టీ మాత్రం ఇది కాదు. ఇది పక్కా చంద్రబాబు తెలుగుదేశం.…
  • తిరుగుబాట్లతో తలపోటు
    కాంగ్రెస్‌కు సోనియాగాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ, డిఎంకెకు కరుణానిధి, ఎంఐఎంకు అసదుద్దీన్‌ ఓవైసీ... అధినేతలు. ఆ పార్టీలకు నియంతలు. వీళ్లను విమర్శించిగాని, ఎదిరించి మాట్లాడిగాని ఆ పార్టీల్లో ఎవరూ నిలబడలేరు. ఈ పార్టీల మాదిరిగానే, ఈ పార్టీల అధినేతల మాదిరిగానే…

Newsletter