11 March 2017 Written by 

హక్కులకు టాటా... అవస్థల్లో వాటా

womensమార్చి 8

అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

ఇది ఎంతో గొప్ప సందర్భం.

మహిళాలోకానికి సాధికారత కల్పించాలన్నదే ఐక్యరాజ్యసమితి ప్రధాన లక్ష్యం. 2030 నాటికి అన్ని రంగాల్లో సమానత సాధించాలన్న ఐరాస ఆశయం ఎంతో గొప్పది. అయితే. మన దేశంలో మాత్రం ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించకపోవడమే బాధాకరం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళవుతున్నా స్త్రీలకు సమానత్వం కాదు కదా..కనీసం స్వేచ్ఛ కూడా లేదు. స్త్రీ విద్య కోసం, సమానహక్కుల కోసం..సమన్యాయం కోసం నేటికీ మహిళాలోకం అలుపెరుగని పోరాటం చేస్తూనే వుంది. మహిళా సాధికారతను సాధించడంలో మన పాలకులు, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నామమాత్రం. మహిళల జీవనం నిత్యం సమస్యలూ..సవాళ్ళతోనే ప్రారంభం.. దేశంలో రోజూ మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలకు అఘా యిత్యాలకు లెక్కే లేదు. అడుగడుగునా లైంగిక వేధింపులు, రకరకాల అవమానాలు.. అనుమానాలు, మహిళలపై దాడులు, హత్యలు, మానభంగాలు.. దౌష్ట్యాలకు అసలు అంతే వుండడం లేదు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు.. ఆస్తుల్లో వాటాలు.. అభివృద్ధి పథకాల్లో ప్రధాన భాగాలు.. ఇలా చెప్పేవన్నీ మాటల నీటిమూటలే తప్ప, ఆచరణలో ఆడవారికి దక్కే భాగ్యం అంతంత మాత్రమే. భద్రత లేని బతుకులతో, స్వేచ్ఛ లేని జీవితంతో ఎంతోమంది స్త్రీలు సమాజంలో నిత్యం నానా రకాల బాధలు పడుతూనే వున్నారు. చివరికి. కట్టుకున్న భర్తలే కాలయముళ్ళవుతున్న వైనాలు, అబల అని కూడా చూడకుండా, మహిళలపై ఘోరాలకు అంతూపొంతూ వుండడం లేదు. ఒక బిడ్డగా..ఒక అక్కగా..చెల్లిగా..ఇల్లాలిగా..తల్లిగా..స్త్రీ తన జీవిత దశల్లో ఆత్మీయతానురాగబంధాలను పెనవేస్తూ..ప్రేమైకభావంతో కుటుంబ వ్యవస్థను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నా, కనీస కృతజ్ఞత కూడా లేని దురహంకారంతో, పురుషాధిక్యతతో మగవారు పెడుతున్న రకరకాల గృహహింసలకు కూడా అంతే వుండడం లేదు. కాస్తంత అభిమానంతో ప్రోత్సాహమిస్తే చాలు..అత్యద్భుతమైన ప్రతిభాపాటవాలతో రాణించగల ధీర నారీమణులు ఎందరో వున్నా...అడుగడుగునా వారి ప్రతిభకు అడ్డుకట్ట వేసే మగమహానుభావులకు మనదేశంలో కొదవే లేదు. మహిళలపై అకృత్యాల నివారణకు మహిళా చైతన్యమే సరైన సమాధానం. అయినా, మహిళా రిజర్వేషన్లం టారే కానీ..ఎక్కడున్నాయో అవి. అన్నీ ఆకాశపుష్పాలే!..మహిళాభ్యున్నతికి భలేభలే పథకాలంటారు.. ఏవీ.. అన్నీ నేతిబీరలే. 33 శాతం మహిళా రిజర్వేషన్లలో ఎస్సీఎస్టీ ఓబిసిలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు ప్రధానమైన రాజకీయపార్టీలు ఎలాంటి చొరవ తీసుకోకపోవడం వల్లనే కదా మహిళా బిల్లుకు నేటికీ మోక్షం లేకపోవడం?..మాటలకు చేతలకు పొంతనలేని చేష్టల వల్ల ఎవరికి ప్రయోజనం? మరోవైపు నానాటికీ వ్యాపారసంస్కృతి, పాశ్చాత్య ధోరణులు ప్రబలిపోతూ, అశ్లీల సంస్కృతి వీరవిహారం చేస్తోంది. ఆడపిల్లల బతుకులకు భద్రత కరువైపోయింది. మహిళలకు భద్రత కల్పిస్తామని, మహిళాభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామని పాలకులు, ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నా ఆచరణలోకొచ్చేసరికి అన్నీ శూన్యహస్తాలు..శుష్కవాగ్దానాలే. రాత్రనక పగలనక అటు కుటుంబానికి, ఇటు సమాజాభ్యున్నతికి అహరహం కృషిచేసే స్త్రీమూర్తులపై మగరాయుళ్ళ పెత్తనం పెరిగిపోతూనే వుంది. మమతల పందిరి వేసి, కుటుంబాల్లో ప్రేమాభిమానాలకు పాదులు వేసి, సమాజాన్ని.. కుటుంబ వ్యవస్థను అనురాగమయం చేసే త్యాగమయి.. మహిళ. అలాంటి మహిళాలోకానికి ఎన్ని జన్మలెత్తినా మనం రుణం తీర్చుకోలేం. అయినా వారి స్వేచ్ఛకు సంకెళ్ళు వేసి, వారి జీవితాన్ని బందిఖానాగా చేసి వికృతహాసం చేస్తున్నా..నేటికీ ఎందరో మహిళలు అన్నిటినీ మౌనంగానే భరిస్తూ.. తమ జీవితాలను ఆయా కుటుంబాల శ్రేయస్సుకే అర్పిస్తూ తమ గొప్పదనాన్ని చాటుకుంటూనే వున్నారు. 'స్త్రీమూర్తి' అనే అమృతమయమైన పదానికి సార్థకతను చేకూరుస్తూనే వున్నారు. మరోవైపు మహిళలకు సమానావకాశాలు కల్పించడంలో, మహిళాభ్యున్నతికి కృషిచేయడంలో మన ప్రభుత్వాలు ఇంకా సన్నాయినొక్కులు నొక్కు తూనే వున్నాయి. అనేకమంది మహిళామణులు ఎంతో ధైర్యసాహసాలతో, ప్రతిభా పాటవాలతో అనేక రంగాల్లో ముందుకు సాగుతున్నప్పటికీ, మహిళలకు ఆయా రంగాల్లో తగినంత అవకాశాలు కరువవుతూనే వున్నాయి. ముఖ్యంగా నిరుపేదలైన బాలికలు, మహిళలది నిత్యం జీవన పోరాటమే. కార్మికులు, వ్యవసాయ కూలీల పరిస్థితి మరెంతో దయనీయం. ఒకవైపు పేదరికం..మరోవైపు అనారోగ్యం..ఇంకోవైపు కుటుంబ బాధ్యతలు.. మహిళలోకానికి ఈ సమస్యల కొలిమినుంచి విముక్తి ఎప్పుడో?!..

ఏదేమైనా, అటు ప్రభుత్యాలు, పాలకులు..ఇటు కుటుంబసభ్యులు.. అందరూ కలసి మహిళల పట్ల సరైన అవగాహనతో వుండాలి. వారి అభ్యున్నతికి చేయూతనివ్వాలి. అందుకు ముందుగా మగవారు మారాలి...పురుషాధిక్య మనస్తత్వం మారాలి. మహిళల పట్ల సానుకూల దృక్ఫధం అలవరచుకోవాలి. మానవత్వంతో పరిమళిస్తూ.. మహిళలను సాటి మనుషులుగా.. మన తల్లిగా.. చెల్లిగా..ఆత్మీయులుగా.. మానవతామూర్తులుగా భావించి గౌరవించాలి..ఆదరించాలి. వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో బాటలు వేయాలి. అప్పుడే.. అటు మహిళా సాధికారతకైనా..ఇటు మహిళా దినోత్సవాలకైనా.. నిజమైన సార్ధకత! ఆ దిశగా అడుగులు వేద్దాం...!Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter