Saturday, 11 March 2017 09:36

'దేశం' క్యాంపులో తారల సందడి

Written by 
Rate this item
(0 votes)

galpikaఅది ప్రపంచంలోని మేటి నగరాలన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి బయటకు తీస్తే వచ్చిన అమరావతి రాజధాని నగరం. సీఎం ఛాంబర్‌లో హైటెక్‌రత్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్‌, ఐఆర్‌20-420 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమల

ఉత్పత్తి కేంద్రం నెల్లూరు నుండి వచ్చిన నాయకులు నైట్‌రైడర్‌ నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద రవిచంద్ర, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, ఎమ్మెల్సీ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి... ఇంకా కొంతమంది నాయకులున్నారు. నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి గెలుపోటములపై మాట్లాడ్డానికి చంద్రబాబు అందర్నీ అక్కడకు పిలిపించాడు. నేను స్టేట్‌ అంతా వన్‌సైడ్‌ ఎలక్షన్‌ జరిపించాలనుకుంటున్నాను. ఆ విధంగా కృషి చేస్తున్నాను, ఆ విధంగా ముందుకు పోతున్నాను, అందుకు ఆఖరకు పోలీసులను కూడా మన కార్యకర్తల మాదిరిగా వాడుకుంటున్నాను, నాకు అన్ని జిల్లాలు ఒకెత్తయితే, మీ ఒక్క జిల్లా ఒకెత్తు. మీ నెల్లూరు రెడ్లే నాకు అర్ధం కారు... అన్ని జిల్లాలలో ప్రతిపక్ష నాయకులు మన శిబిరాలలో చేరుతుంటే, మీ జిల్లాలో మాత్రం మనోళ్ళు ప్రతి పక్షంలోకి పోతున్నారు. ఎందుకిలా జరుగుతోంది... నాకు తెలియాలి అని చంద్రబాబు హూంకరించాడు. అప్పుడు బీద రవిచంద్ర లేచి... ఇప్పుడున్నది పూర్తి తెలుగుదేశం పార్టీ కాదు కదా సార్‌, సగానికి పైగా కాంగ్రెస్‌ నాయకులతో నిండిపోయింది, వాళ్ళకు కుదురుగా ఒక చోట ఉండడం తెలియదు. వానలు పడ్డప్పుడు కప్పలు, అటు ఇటూ గుంటల్లోకి ఎగిరినట్లు, ఏ ఎన్నికలొచ్చినా వీళ్ళు కూడా అటూ ఇటూ మారుతుంటారని అన్నాడు. చంద్రబాబు అందుకు... నాకు మీ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మీద సందేహంగా ఉంది. ముఖ్యంగా అవతల ఆనం విజయకుమార్‌రెడ్డి అభ్యర్థి. మీ బ్రదర్స్‌ ఇద్దరూ మీ తమ్ముడి కోసం పని చేస్తున్నారా? లేక పార్టీ అభ్యర్థి కోసం పని చేస్తున్నారా? అని ఆనం రామనారాయణరెడ్డిని ప్రశ్నించాడు. అప్పుడే... ఆపు... అంతకుమించి ఒక్క మాట మాట్లాడినా బాగుండదు... అంటూ తలుపు వైపు నుండి ఓ కేక వినిపించింది. చంద్రబాబుతో పాటు అందరూ తలలు తిప్పి గుమ్మం వైపు చూసారు. అక్కడ స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(65) నిలబడి ఉన్నాడు. చంద్రబాబు రామనారాయణరెడ్డిని నిలదీస్తున్న సమయానికే వివేకా వచ్చి అక్కడ నిలబడ్డాడు. చంద్రబాబు తమ మీద అనుమాన పడ్డం చూసి కోపంతో వూగిపోతూ ఆ మాటన్నాడు. చంద్రబాబూ... నిప్పును పట్టుకో... మండదేమో, నీటిలో మునుగు తడవవేమో... మా చిత్తశుద్ధితో పెట్టుకోకు... తట్టుకోలేవ్‌... ఏమను కుంటున్నావ్‌ మమ్మల్ని, ఏమనుకుంటున్నావ్‌ మా నిజాయితీని, రాజకీయాల కోసం అయినవారిని, అన్నదమ్ములను కూడా కాదను కోవడంలో ఎప్పుడో మిమ్మల్ని మించిపోయాం... నువ్వా మా పనితీరును శంకించేది... అయినా ఈ చీకటిలో మీటింగ్‌లేంటి అని వివేకా అడిగాడు. మొదట అడిగినదానికంతా ఎవరూ ఏమీ అనుకోలేదుగాని, చీకట్లో మీటింగ్‌ లేంటనే సరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకందే ఆ గదంతా లైట్లతో వెలిగిపోతోంది. అందరికంటే ముందు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అసలు విషయాన్ని పసిగట్టి వివేకా కళ్ళకున్న నల్లద్దాలను తీసాడు. అప్పుడు వివేకాకు విషయం అర్ధమైంది. చంద్రబాబు అనుమానాస్పద ప్రశ్నకు వివేకా ఘాటుగా కొంచెం నాటుగా సమాధానమివ్వడంతో అక్కడ వాతా వరణమంతా గంభీరంగా మారిపోయింది.

ఆ నిశ్శబ్దాన్ని చేధిస్తూ చంద్రబాబు... ఇది ఎవరి నీతి నిజాయితీ లకు పరీక్షా సమయం కాదు, నెల్లూరు స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థి వాకాటిని ఎలాగైనా గెలిపించాలి, ఇందుకేం చేయాలని అడిగాడు. మధ్యలో వాకాటి జోక్యం చేసుకుని... వీళ్ళందర్నీ బ్రతిమలాడేందన్నా... మనది అధికారపార్టీ... భయపెట్టి కొందర్ని తెద్దాం, బెదిరించి కొందర్ని తెద్దాం, భయపెట్టినా, బెదిరించినా లొంగనివారిని తాళ్ళతో కట్టేసి మన క్యాంపుకు తెద్దామన్నాడు. అప్పుడే పోలంరెడ్డి లేచి బయటకు పోబోయాడు... ఎక్కడకు వెళుతున్నావని చంద్రబాబు ప్రశ్నించారు... తాళ్ళు కొనుక్కురావడానికన్నా... వాకాటి చెప్పిన ప్రాసెస్‌ చాలా ఈజీగా ఉందన్నాడు. నీ ముఖమాల్నే వుంది కూర్చో... బెదిరించేది, భయపించి గెలిచేది రాజకీయం కాదు. స్థానిక ఓటర్లను మనం ఆకర్షించాలి... అందుకు మనమేం చేయాలో చెప్పండని చంద్రబాబు అడిగాడు. చెప్పను, చేసి చూపిస్తాను, ఆ సంగతి నా కొదిలేయండి అని వివేకా లేచాడు. అందరు కూడా వివేకా నెత్తిన భారం పెట్టి మాకు తలనొప్పి తప్పిందంటూ లేచారు.

--------------

తెల్లారింది. చంద్రబాబు అప్పుడే లేచాడు. యోగాసనాలు వేద్దా మని రెడీ అవుతుండగా ఆయన ఫోన్‌ మోగింది. ఫోన్‌ ఆన్‌ చేసాడు. అవతల నుండి పార్టీ ఏ.పి అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌... సార్‌, కొంప మునిగిందన్నాడు. ఏమైందని చంద్రబాబు ఆతృతగా ప్రశ్నించాడు. ముందు టీవీ ఆన్‌ చేసి 9-9-99 ఛానెల్‌ పెట్టి చూడండన్నాడు. చంద్రబాబు ఫోన్‌ కట్‌ చేసి టీవీ ఆన్‌ చేశాడు.

చెన్నైలో నెల్లూరుజిల్లా తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి క్యాంప్‌ అది... క్యాంప్‌ బయట వందలాదిమంది నిలబడి తమను కూడా క్యాంప్‌లోకి తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. పోలీసులు మాత్రం వాళ్ళను వెనక్కునెట్టేస్తున్నారు. క్యాంప్‌ లోపలవున్న వివేకా, సోమిరెడ్డి, బీద, ఆదాలలు గేటు వద్దకు వచ్చి బయట తోసుకుంటున్న వారిని వారిస్తూ... మీ క్యాంప్‌ ఇక్కడ కాదు, మా వాళ్ళకే ఇక్కడ చోటు చాలడం లేదని చెబుతున్నారు. అయినా అక్కడున్నవాళ్ళు తమను కూడా లోపలకు అనుమతించాలని రచ్చ చేస్తున్నారు. చంద్రబాబుకు పిక్చర్‌ కనిపించింది గాని విషయం అర్ధం కాలేదు. వెంటనే కళావెంకట్రావ్‌కు ఫోన్‌ చేశాడు. ఆయన ఫోన్‌ ఎత్తాడు. నెల్లూరు స్థానికఎమ్మెల్సీ క్యాంప్‌ వద్ద ఏం జరుగుతుందని చంద్రబాబు అడిగాడు. అందుకాయన... మీరు ఆ క్యాంప్‌ బాధ్యత వివేకాకు అప్పగించినట్లున్నారు... అతను క్యాంప్‌లో కాజల్‌, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, హంసానందినిల చేత డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌, అనసూయ, రష్మిల యాంకర్‌లుగా వస్తున్న 'జబర్దస్త్‌' ప్రోగ్రామ్‌లు పెడుతున్నామని ప్రచారం చేసాడు. ఆ ప్రచారం కర్నూలు, కడప జిల్లాల్లో వున్న మన జడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా తెలిసింది. దీంతో నెల్లూరోళ్లే కాదు, కడప, కర్నూలు జిల్లాల వాళ్ళు కూడా అక్కడకు వెళ్ళి తమను నెల్లూరు క్యాంప్‌లోకి అనుమతించాలని గొడవ చేస్తున్నారని చెప్పాడు. ఆ మాటతో చంద్రబాబు... ఎంత పని చేసావు వివేకా అంటూ తల పట్టుకున్నాడు.

Read 206 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter