24 March 2017 Written by 

మళ్ళీ ఆ ముగ్గురే!

3నెల్లూరుజిల్లా స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గానికి జరిగిన ఎన్ని కల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన వాకాటి నారాయణరెడ్డి 87 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డిపై గెలిచాడు. 2012లోనూ ఆయన నెల్లూరు స్థానిక ఎమ్మెల్సీ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 9ఓట్ల తేడాతో గెలవడం జరిగింది. వరుసగా ఆయనకు స్థానిక ఎమ్మెల్సీగా ఇది రెండో విజయం. అలాగే తూర్పు రాయలసీమ(చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) ఉపాధ్యాయుల శాసనమండలి నియోజకవర్గం నుండి వైకాపా బలపరచిన పిడిఎఫ్‌ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం 3,553 ఓట్ల తేడాతో తెలుగుదేశం అభ్యర్థి వాసుదేవనాయుడుపై విజయం సాధిం చారు. అలాగే అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్‌ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డిపై 3,232 ఓట్ల తేడాతో నెగ్గడం జరిగింది. ఈ ముగ్గురిలోనూ విఠపు బాలసుబ్రహ్మణ్యంది హ్యాట్రిక్‌ విజయం కాగా, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, వాకాటి నారాయణరెడ్డిలు ఎమ్మెల్సీ పోటీలో వరుసగా రెండోసారి గెలిచి మండలికి వెళుతుండడం విశేషం.

ఈ మూడింటిలోనూ ఉపాధ్యాయుల నియోజకవర్గం గురించి పెద్దగా చెప్పుకో నవసరం లేదు. ఉపాధ్యాయ సంఘాలలో యూటిఎఫ్‌ బలమైంది కాబట్టి ఆ యూని యన్‌ బలపరచిన అభ్యర్థి గెలవడం సాధా రణ విషయమే. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విషయానికొస్తే గెలుపు కోసం అధికారపార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కింది. సొంతపార్టీ వాళ్ళకు రెండు లక్షలు, అవతల నుండి వచ్చిన వాళ్ళకు 5లక్షలు లెక్కన ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటర్లకు డబ్బులిచ్చే విషయంలో వైకాపా వాళ్ళు అధికారపార్టీతో పోటీపడలేక పోయారు. అదీగాక వైకాపా వైపు సమిష్టి నాయకత్వం, ఉమ్మడి వ్యూహం కొరవ డింది. ఎవరి ఓట్లు వారే దాచిపెట్టుకోవా లన్నట్లు నాయకులు వ్యవహరించారు. ముఖ్యంగా జిల్లా పార్టీకి పెద్దగా వ్యవహ రిస్తున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి నాయ కత్వం వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండడం లేదన్నది మరోసారి బహిర్గత మైంది. వైకాపాలోని లోపాలే తెలుగు దేశంకు బలమయ్యాయి. అదీగాక స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికను చంద్రబాబు, లోకేష్‌ బాబులతో పాటు మంత్రులు పి.నారా యణ, శిద్ధా రాఘవరావులు దగ్గరుండి పర్యవేక్షించారు. క్యాంపులకు కాపలా కాసారు. ఇన్ని చేస్తే తెలుగుదేశం అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి 87ఓట్ల తేడాతో గెలవగలిగాడు. ఇక పట్టభద్రుల నియోజక వర్గంలో తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డి ఓటమితో ఆ పార్టీలోనే అంతర్మధనం మొదలైంది. చంద్రబాబు ఈ నియోజకవర్గాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్నాడు. మంత్రి తన అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని అభ్యర్థిగా పెట్టుకున్నాడు. పట్టాభిని తాను గెలిపి స్తానని చంద్రబాబు వద్ద కోతలు కోసి వచ్చాడు. పట్టభద్రుల ఎన్నికలలో గెల వడం కోసం ఎన్ని నికృష్టపు పనులు చేయాలో అన్నీ చేశాడు. వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్చారు. దొంగ సర్టిఫికే ట్లను సృష్టించారు. ఎన్నికల రోజు భారీ గానే దొంగఓట్లు వేయించారు. ఇన్ని చేసినా కూడా అధర్మానికి అపజయం తప్పలేదు. నీతికి, నిజాయితీకి మారుపేరైన పిడిఎఫ్‌ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధిం చాడు. మొత్తానికి గెలిచిన ముగ్గురు కూడా శాసనమండలికి పాతోళ్ళే కావడం విశేషం.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ల్యాండవుతున్న విమానం
    దగదర్తి విమానాశ్రయం కల సాకారానికి రోజులు దగ్గరపడ్డాయి. త్వరలోనే విమానాశ్రయం నిర్మాణానికి టెండర్లు పిలవడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసర మైన 1350 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణకు సంబంధించి రైతుల పరిహారానికి నిధులు…
  • కార్పొరేషన్‌లో కోల్డ్‌వార్‌
    వివాదాలకు, విభేదాలకు నెల్లూరు కార్పొరేషన్‌ కేరాఫ్‌ అడ్రస్‌ లాంటిది. నెల్లూరు నగరంలో ఎన్ని రకాల సమస్యలుంటాయో నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలే వుంటాయి. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే పాలకవర్గం వుంటే అధికారులు సహకరించరు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులున్నప్పుడు…
  • ఆనంకు చుక్కెదురు?
    నెల్లూరు నగరంలో తమ ఆధిపత్యానికి ఆయువు పట్టులాంటి విఆర్‌ విద్యాసంస్థలపై తమ పట్టు నిలుపుకోవాలని ఆనం సోదరులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. న్యాయస్థానంలో వరుస దెబ్బలు తగులుతూనే వున్నాయి. విఆర్‌ విద్యాసంస్థల పాలక కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది…
  • పాదయాత్ర చేస్తున్నా... ఆశీర్వదించండి
    వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారిని కలుసుకున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని తనకు చేతనైన మేరకు వారికి సహాయసహకారాలు అందించడానికి త్వరలో నవ్యాంధ్రలో…
  • ఎగువ జిల్లాల్లో వర్షం.. నెల్లూరు జిల్లాలో హర్షం
    నెల్లూరుజిల్లా ప్రజలకు ఈ జిల్లాలో వర్షాలు పడితేనే కాదు, ఎగువ జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడితేనే ఎక్కువ సంతోషం. ఆ జిల్లాల్లో వర్షాలు పడితే ఎక్కువ ప్రయోజనం పొందేది మనమే. నెల్లూరుజిల్లాలో భారీ వర్షాలు కురిసి…

Newsletter