24 March 2017 Written by 

అన్నదాతను ముంచిన అకాలవర్షం

grainవాన రాకడ.. ప్రాణం పోకడ తెలియ దని సామెత. పంటలు బాగా పండాలని, అదునుకు వాన కురవాలని పదునైన ఎదురుచూసినప్పుడు మాత్రం రాని వాన, తీరా పంటలు చేతికి అందివచ్చే సమ యంలో మాత్రం ఒక్కసారిగా కుండ పోతగా కురుస్తుంది. ఎదిగిన పంటలను నీటముంచి వికటాట్టహాసం చేస్తుంది. ఈ ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు విలవిల లాడిపోతున్నారు. అసలే మెట్టప్రాంత రైతులు..కొద్దోగొప్పో నీటితో అష్టకష్టాలు పడి పంటలు పండించుకుంటే ఆ పం టంతా హరీమంది. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా, అసలే కరువు వాతపడి రైతులు దీనావస్తలో వున్న సమ యంలో వడగండ్లు పడి మరింత కడ గండ్లు తెచ్చాయి. మండే ఎండల్లో కురిసిన ఈ అకాలవర్షాలు రైతులను మళ్ళీ అప్పుల సుడిగుండంలోకి నెట్టేశాయి. కష్టాల్లో వున్న తమను ఆదుకుని తగు చేయూత నందిం చాలని రైతన్నల కుటుంబాలు ప్రభు త్వాన్ని వేడుకుంటున్నాయి. ఇటీవల

ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, వరికుంటపాడు, కొండా పురం మండలాల్లో కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు మళ్ళీ అష్టకష్టాల పాలయ్యారు. పలుచోట్ల వడగండ్ల వాన కూడా కురవడంతో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతరైతులు కోట్లరూపాయల్లో నష్టాల పాలయ్యారు. అసలే వర్షాభావంతో కరువు దెబ్బకు ఇక్కడ పంటలు వేసిందే తక్కువ. అయినా వరుణుడి ఆగ్రహానికి పంటలన్నీ నీటిపాలై నాయి. రైతులకు కన్నీటినే మిగిల్చాయి. సుమారు 400ఎకరాల్లో వరి నీట మునిగి పోయింది. మరో 250ఎకరాల్లో బత్తాయి, వంద ఎకరాల్లో అరటి, బొప్పాయి తోట లతో పాటు, మొక్కజొన్న, మిరప తదితర పంటలన్నీ మునిగిపోయాయి. అటు వరి రైతులు, ఇటు తోటల రైతాంగం ఈ అకాలవర్షానికి అతలాకుతలమైపోయారు. అప్పోసప్పో చేసి ఎంతో కష్టపడి సాగు చేసుకున్న పంటలు నీట మునగడంతో మళ్ళీ తిరిగి కోలుకోలేనంతగా అప్పుల పాలయ్యారు. వరికుంటపాడు మండలం లోని గణేశ్వరపురం, నారసింహాపురం, తూర్పు రొంపిదొడ్ల గ్రామాల్లోనైతే ఏకంగా వడగండ్ల వానే పడింది. ఈదురుగాలులు, వడగండ్లు కలసి పంటలన్నిటినీ భీభత్సం

చేశాయి. వింజమూరు మండలంలోని వింజమూరు, చాకలకొండ, బత్తినవారిపల్లి, జనార్దనపురం, గోళ్ళవారిపల్లి, ఊటుకూరు, కాటేపల్లి, తమిదపాడు తదితర ప్రాంతా ల్లోనూ, కొండాపురం మండలంలోని గరిమెనపెంట, చల్లవారిపల్లి తదితర ప్రాంతాల్లోనూ వరితో పాటు బత్తాయి, బొప్పాయి తోటలు, తమలపాకు తోటలు, అరటితోటలతో పాటు మిరప, మొక్కజొన్న పంటలు అన్నీ వర్షార్పితమయ్యాయి. ఇక ఆ రైతన్నలకు దేవుడే దిక్కు అన్నట్లుగా అయింది పరిస్థితి. జిల్లా కలెక్టర్‌ తదితర ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరి శీలించి, నష్టం వివరాలను తక్షణం అంచనా వేయించి, నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాల్సి వుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter