24 March 2017 Written by 

సయోధ్యతోనే సాధ్యం

ramalayamఎంతటి జటిలమైన సమస్యలనైనా సయోధ్యతో పరిష్కరించుకోవచ్చు. శాంతియుతంగా.. సుహృద్భావ వాతావరణంలో సానుకూల సంప్రదింపులు-చర్చలతో ఎంతటి సున్నితమైన అంశాలనైనా పరిష్కరించుకునేందుకు మంచి దారులు వేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా భారత సర్వోన్నత న్యాయస్థానం సూచిస్తున్నదదే. ఎంతోకాలంగా నలుగుతున్న జటిల సమస్యకు పరిష్కారం సూచించేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న శ్రద్ధ..చొరవ అపూర్వమైనవే. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థల వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు చేసిన సూచనలు సర్వత్రా అందరూ ఆహ్వానించదగినవే. ఎంతో సున్నితమైన ఈ వివాదానికి కోర్టు వెలుపల ఒక పరిష్కారాన్ని అన్వేషించడానికి సంబంధిత పక్షాలన్నీ తప్పనిసరిగా మరోసారి ప్రయత్నాలు చేయాల్సివుందని సుప్రీంకోర్టు చేసిన సూచన ఎంతైనా ఆహ్వానించదగినది. ఇది చక్కని మార్గదర్శకతను చూపే సూచనే. అ అయోధ్య వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు చేసిన సూచనపై బిజెపి హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదానికి సంబంధించి, మతంతో పాటు, సున్నితమైన భావోద్వేగాలు ముడిపడివున్నందున, ఆ సమస్యను చర్చలద్వారా పరిష్కరించుకోవడం ఎంతో ఉత్తమ మని, ఈ సమస్యకు కోర్టు బయటే పరిష్కారం కనుగొనాలని, అంతా కలసి ఈ సమస్యకు ఒక సానుకూల పరిష్కారం కనుగొనాల్సివుందని.. ఆ దిశగా మళ్ళీ ప్రయత్నాలు చేపట్టాలని జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొనడం, తద్వారా ఆ సమస్య పరిష్కారానికి తనవంతు కృషికి సంకల్పించడం ఎంతైనా హర్షదాయకం. అవసరమైతే, ఈ విషయంలో తానే స్వయంగా మధ్యవర్తిత్వం వహిస్తానని, సహచర న్యాయమూర్తులు కూడా ఈ సమస్య పరిష్కారం కోసం సహకరిస్తారని జస్టిస్‌ ఖేహర్‌ స్పష్టం చేయడం ద్వారా, ఈ జటిలమైన సమస్య పరిష్కారానికి తమవంతు సహకారం అందిం చేందుకు ముందుకు రావడం నిజంగా అద్భుతమైన విషయమే. దీంతో, ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం కుదిరేందుకు మార్గం సుగమం అవుతుందనే ఆశించవచ్చు. ఈ వివాదం అంశం గత

ఆరేళ్ళుగా నలుగుతోందని, త్వరలో దీనిపై విచారణ జరగాల్సిన అవసరం వుందని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి కోర్టును కోరగా, జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సమస్య పరిష్కారానికి అన్ని భాగస్వామ్య పక్షాలు కలసి మరోసారి ప్రయత్నించాలని, అందరూ కలసి ఏకాభిప్రాయానికి రావాలని స్పష్టం చేసింది. అంతేకాదు, 'ఈ వివాదానికి ముగింపు పలకడానికి అవసరమైతే మధ్యవర్తిని ఎంపిక చేసుకోండి. చర్యల కోసం ఇరుపక్షాలూ ఎంపిక చేసుకునే మధ్యవర్తితో నేను మాట్లాడాలని ఉభయులూ కోరుకున్నట్లయితే దానికి నేను కూడా సిద్ధమే''..అని జస్టిస్‌ ఖేహర్‌ స్పష్టం చేయడం.. త్వరితగతిన సమస్య పరిష్కారమయ్యేందుకే. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో..ఈ వివాదాన్ని అర్ధవంతంగా, చిత్తశుద్ధితో పరిష్కరించుకోవచ్చని, అమోదయోగ్య పరిష్కారం కోసం అవసరమైతే తమ సేవల్ని అందించేందుకు సిద్ధమేనని చెప్పడం ద్వారా ఆ సమస్య పరిష్కారానికి అవసరమైన సంప్రదింపుల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లయింది. ఇరువర్గాలూ కోరుకుంటే ప్రధాన మధ్యవర్తిని తామైనా నియమిస్తామని జస్టిస్‌ సంసిద్ధత వ్యక్తం చేస్తూ, దీనిపై సంబంధిత పక్షాలతో సంప్రదింపులు జరిపి నిర్ణయమేమిటో ఈ నెల 31న తమకు తెలియజేయాలని కూడా ఆదేశించారు. దీంతో, సుప్రీంకోర్టు సూచనలతో.. అందరి సహకారం.. ఆమోదంతో ఇక ఈ సమస్య త్వరలోనే ఒక పరిష్కారానికి రావచ్చనే అభిప్రాయాలు సర్వత్రా వినవస్తు న్నాయి. అయినా 'రామజన్మభూమి-బాబ్రీమసీదు'కు సంబంధించిన వివాదం ఇప్పటిది కాదు. మనదేశంలో ఏళ్ళతరబడి నలుగుతున్న సమస్య ఇది. ఎంతోకాలంగా ఇది వివాదంగానే వుంది. 1992 డిసెంబరు 6న కూల్చివేతకు గురైన ఆ వివాదాస్పద కట్టడ స్థలం కేంద్ర సున్నీ వక్ఫ్‌బోర్డుకు చెందుతుందా, అఖిలభారత హిందూ మహాసభకు చెందుతుందా అనే వివాదం తలెత్తింది. అక్కడ రామమందిర నిర్మాణం జరగాలంటూ బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి గతంలో పిటిషన్‌ వేసివున్నారు. అంతేకాదు, మందిరం నిర్మాణాన్ని అనుమతించాలంటూ గతంలో ఆయన మరో పిటి షన్‌ కూడా వేసివున్నారు. ఇదిలావుంటే, వివాదాస్పద స్థలాన్ని మూడు సమానభాగాలుగా విభజించాలని, వాటిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖడా, రాం లల్లాకు పంచాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు ధర్మాసనం తీర్చునిచ్చిన విషయం విదితమే. అయితే, 2011లో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హిందూ, ముస్లిం సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాక, అలహాబాద్‌ హైకోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాత, ఆ స్థలంలో ఆలయం నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 2016లో బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆయన తాజాగా కోరడంతో, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ మేరకు ఈ వివాదం పరిష్కారానికి తగు సూచనలు చేసింది. ఏదేమైనా, ఈ వివాదం ఇకనైనా ఒక కొలిక్కిరావాలంటే సుప్రీంకోర్టు సూచనలను మార్గదర్శకం చేసుకోవడం ఎంతో ఉత్తమం. సర్వోన్నత న్యాయస్థానం సూచించిన మేరకు ఇరుపక్షాలూ చర్చలు-సంప్రదింపులతో..అందరూ ఏకాభిప్రాయానికి రావడమే మంచిమార్గం. అందుకు అందరూ కలసి చర్చించుకుని సమస్య పరిష్కారానికి కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. అయోధ్య వివాదం పరిష్కారం సయోధ్యతోనే సాధ్యమవుతుందని భావించవచ్చు. అందుకు ఇది సానుకూల సమయం కూడా. ఒకవైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజారిటీ వుండడం, మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి అత్యధిక మెజార్టీ రావడం.. ఈ తాజా పరిణామాలతో అయోధ్య సమస్య కూడా ఒక కొలిక్కి వచ్చేదిశగా ప్రయత్నాలు ప్రారంభం కావడం ఒక ముందడుగేనని భావించవచ్చు.Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
  నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
 • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
  2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
 • ప్రాణాలను మింగుతున్న చెరువులు
  అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
 • పోలవరం... ఇక కలవరం
  ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
 • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
  మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter