24 March 2017 Written by 

హేమలంబ పంచాంగము

swyampaజ్యోతిశ్శాస్త్రము నందు లోకవ్యవహారము కొరకు మనదేశమున చంద్ర సూర్య బృహస్పతి మానములని మూడు ప్రధానముగా విభజించారు. తిరుమలగిరికి దక్షిన ప్రాంతము సౌరమానమని, తిరుమలగిరి-వింధ్య పర్వతముల మధ్య ప్రాంత మును చాంద్రమానమని, వింధ్య పర్వతములకు ఉత్తర ప్రాంతము బార్హస్పత్య మానమని ప్రచారము లోనున్నది. చాంద్ర, సౌరమానముల వారికి దుర్ముఖి నామ సంవత్సరము జరుగుతుంది. బార్హస్పత్య మానము వారికి సౌమ్యనామ సంవత్సరము జరుగుతుంది.

ప్రభవాది అరవై సంవత్సరములలో 31వది హేమలంబ నామ సంవత్సరము. యుగమనగా సంవత్సరము (కాలము) యుగము యొక్క ఆది అనగా ప్రారంభము, యుగాది అయినది. వ్యవహా రములో 'ఉగాది'గ పిలవబడుతున్నది. ఉగాదినాడు వారి వారి వర్ణాచారాల ప్రకారం మంగళస్నానము చేసి, దైవాన్ని చిత్తశుద్ధితో ఆరాధించి, షడ్రుచులు కల వేప ప్రసాదాన్ని స్వీకరించి పంచాంగ విష యాన్ని తెలుసుకొనవలసి వుంటుంది. పంచాంగం ఎందుకు వినటం, తెలిసికొనడం జరగాలంటే..

'శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం

దుస్స్వప్న దోషాపహం

గంగాస్నాన విశేష పుణ్యఫలదం

గోదాన తుల్యం నృణాం

ఆయుర్వృద్ధిద ముత్తమం శుభకరస్త్రం

సంతాన సంపత్స్రదమ్‌

నానాకర్మ సుపాధనం సముచితాం

పంచాంగ మాకర్ణ్యతాం'..

ప్రతి సంవత్సరము నవనాయకులని, 21 మంది ఉపనాయకులని పిలవబడుతూ గ్రహముల కాలానికి శుభాశుభ ఫలితములనిస్తాయి. చైత్ర శుక్ల పాఢ్యమి వారాధిపతి రాజు, రవి మేషరాశి ప్రవేశవారాధిపతి మంత్రి, రవి సింహరాశి ప్రవేశ వారాధిపతి సేనాధిపతి, రవి కర్కాటక సంక్రమణ ప్రవేశవారాధిపతి సస్యాధిపతి, ధనుర్మాస ప్రవేశ వారాధిపతి ధాన్యాధిపతి, మిధున సంక్రమణ ప్రవేశ వారాధిపతి అర్ఘాతిపతి, ఆర్ద్రకార్తె ప్రవేశవారాధిపతి మేఘాధిపతి, తులా ప్రవేశ సమయమ వారాధిపతి రసాధిపతి, మకర ప్రవేశవారాధిపతి నీరసాధిపతి అని నవనాయకులు, సహాయకులైన 21మంది

ఉపనాయకులని పిలవబడతారు. ముందుగా ఫలి తాలు చూస్తూ ఈ విధంగా వున్నాయి.

ఈ సంవత్సరమున రాజు-బుధుడు, మంత్రి- శుక్రుడు, సేన, అర్ఘమేఘాధిపతుడు-గురువు, సస్యాధిపతి-చంద్రుడు, ధాన్యాధిపతి-శని, రసాధి పతి-బుధుడు. నీరసాధిపతి-రవి. నవనాయకులలో 7 మంది శుభువలు, ఇద్దరు పాపులు, ఉపనాయ కులతో 12 మంది శుభులు, 9 పాపులు, పశుపాలకుడు బలరాముడగుటచే క్షీరసమృద్ధి, తృణ సమృద్ధి కలదు.

చాంద్రమానాబ్ద హేమలంబ సంవత్సర ఫలమ్‌ :

పరిపాలకులు ప్రజలను చక్కగా పరిపాలిం చెదరు. ప్రభువులకు పరస్పర విరోధ భావము లుండును. అచ్చటచ్చట ప్రజలకు బాధలు కలిగి ననూ సుఖవంతులై యుందురు. ధాన్యాదుల ధరలు సమముగా యుండును. అల్పవర్షములు కొన్నిచోట్ల దుర్భిక్ష భయం ఉరుములు మెరుపులతో కూడిన గాలి వర్షములుండును.

హేమలంబ సంవత్సరాధిపతి రాహువు భయో త్సాతములు రోగభయములు, భూకంపాద్యుపద్రవ ములు, వ్యాపారమందు వడిదుడుకులుండును. చైత్ర వైశాఖ మాసములందు పీడలు, ధాన్యాది సమస్త వస్తువులకు ధరలు తగ్గును. సరిహద్దులలో యుద్ధ వాతావరణము తలపించును. జ్యేష్టాది మాస త్రయమున ధాన్యాదుల ధరలు పెరుగును. భాద్ర పద ఆశ్వయుజ మాసము లందు అధికవర్షములుం డును. పసుపు, మిర్చి, చింతపండు, ఉప్పు, మిరియాలు, దంతములు, వెండి, బంగారము ధరలు పెరుగును. కార్తీకమాసమున కొన్నిచోట్ల పరిపాలకుల మార్పులు కలిగి ప్రజాపీడ, ఖనిజ ముల ధరలు సరసముగా యుండును. పశువులకు పీడ మార్గశిరం మొదలు సంవత్సరాంతము వరకు పరిపాలకులు మంచి ఆలోచనలతో జనరంజ కముగా ప్రజాభీష్టములు నెరవేర్చెదరు.

రాజాధి-నవనాయకల ఫలితములు :

రాజు-బుధుడు: బుధుడు రాజగుటచే భూమియందు గాలితో కూడిన మధ్యమ కృషి కల్గి, ప్రజలు వివా హాది శుభకార్యముల, యజ్ఞయాగాది కార్యక్రమ ముల పట్ల ఉత్సాహం ప్రదర్శించెదరు. మధ్యమైన ధనధాన్యవృద్ధి కలిగియున్నప్పటికినీ ప్రజలు సుభిక్షముగా నుందురు

మంత్రి-శుక్రుడు: మంత్రి శుక్రుడగుటచే మంచి వర్షములు, ప్రజలు సుఖసౌఖ్యాదులను అనుభవిం చెదరు. ఆవులు సమృద్ధిగా పాలనిచ్చును. ధాన్య జాతులు బాగుగా ఫలించి ప్రభువులు ఉన్నతమైన సౌఖ్యములనొందెదరు.

సేనాధిపతి-గురువు: గురుడు సేనాధిపతియగుటచే సువృష్టియు, ప్రజలు అత్యంత అనురాగవంతు లగుట, దేవతలు ఉత్సవములను, బ్రాహ్మణులు యజ్ఞములు చేయుట, ప్రభువులు ప్రజారంజక పాలన చేయుటయు కల్గును. సైనిక పటిష్టత, ఆధునిక, యుద్ధ యంత్ర సామగ్రుల సమీకరణ బాగుండును.

సస్యాధిపతి-చంద్రుడు: చంద్రుడు సస్యాధిపతి యగు టచే అధిక వృష్టి కల్గి మెట్ట పల్లప ప్రాంతమున ఆహార ధాన్యములు, పప్పు ధాన్యములు బాగుగా ఫలించును. ప్రజలు సుఖసంతోషాదులతో కూడి యుందురు.

ధాన్యాధిపతి-శని: ధాన్యాధిపతి శనియగుట వలన మేఘాడంబరము కల్గి అల్పవృష్టి, ప్రజలకు వ్యాధులు వలన భయం కలిగి భయాందోళన నొందెదరు. ధాన్యాదులకు కొరత ఏర్పడును.

మేఘాధిపతి-గురువు: మేఘాధిపతి గురువు యగు టచే సువృష్టియు మరియు ప్రభువులకు స్వల్ప వైరములు కల్గియున్ననూ అన్యోన్య మైత్రి కలిగి యుందురు. ధర్మబద్ధమైన విధానములో ప్రజలు నడిచెదరు.

అర్ఘాధిపతి-గురువు: గురుడు అర్ఘాధిపతి యగుటచే సువృష్టియు, ధనధాన్యభివృద్ధియు, యజ్ఞకర్మల యందు బ్రాహ్మణులు శ్రద్ధ వహించుట, ప్రపంచ మందు ఉత్సవములు, శుభకార్యములు అధిక మగును. స్వల్పముగా ధరల పెరుగుదల వుండును.

రసాధిపతి-బుధుడు: రసాధిపతి బుధుడుయగుటచే నేరేడు, బెల్లం, ఉసిరి, శిలాజిత్తు తీగలతో చుట్ట బడిన వస్తువు క్రేన్‌ వస్తువులు మొదలగు వస్తువులకు అభివృద్ధియుండును. కుంటలు, వాగులు, సెలయేళ్ళు పొంగిపొర్లును. ధాన్యములు ఫలించును.

నీరసాధిపతి-రవి: సూర్యుడు నీరసాధిపతి యగు టచే రాగి, చందనము, రత్నములు, మాణిక్యములు, ముత్యములు మొదలగు వస్తువులును వృద్ధిగా నుండును.

వర్షలగ్నము, జగర్లగ్నములు :

వర్షలగ్నము మేషము మరియు జగర్గగ్నము కుంభము అయినవి. వర్షలగ్నమును పరిశీలింపగా లగ్నాధిపతి అయిన కుజుడు స్వక్షేత్రమును పొంది బలీయుడగుట, గురు శుక్రులు సమసప్తక స్థితిని పొంది లగ్నాత్‌ షష్ట వ్యయస్థానములు పొందుట మరియు ఇతర గ్రహములు బలహీనముగా నుండెను. జగర్లగ్నమును పరిశీలింపగా లగ్నాధిపతి శని లాభ స్థానమును పొందుట, శుక్రుడు యోగకారకుడై ఉచ్ఛస్థితిని పొందియుండుట, విక్రమ స్థానమందు రవి ఉచ్ఛ స్థితి పొందుట, బృహస్పతి అష్టమస్థితిని పొందెను. గ్రహయోగములన్నింటినీ పరిశీలింపగా ఉభయ తెలుగు రాష్ట్రములు అత్యధిక విశ్వాసములతో గంభీరముగా ప్రజాపాలన సాగిం తురు. స్పష్టమైన ఆధిక్యముతో ప్రత్యేక కృషి సల్పుదురు. ఆర్ధిక లోటుపాట్లు వున్ననూ సంక్షేమము, సంస్కరణలకు సమ ప్రాధాన్యతనిచ్చి నడిపించెదరు. లక్ష్యసాధనకు అనేక ఒడిదుడుకులు ఎదురు కావచ్చును. మౌలిక సదుపాయముల కల్పన, భారీ నీటిపారుదల, విద్యుత్‌ ఉత్పత్తి, విద్యా సాంకేతి కీకరణ వంటి విషయములకు కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక సహకారములందించును. ఆర్ధిక లోటును పూరించుటకు కేంద్ర సహకారము తప్పనిసరి అగును. కేంద్రప్రభుత్వము అత్యంత సాహసోపేత నిర్ణయములు తీసుకొనుట ఊహించని మార్పులు తెచ్చును. ఎటువంటి నిర్ణయమునైనా గంభీరముగా, స్థిరముగా వ్యవహరించెదరు. ఇనుము, ఉక్కు, సహజ వాయువు వెలికితీత వంటి భారీ నూతన ప్రయ త్నములకు అవరోధములు ఎక్కువగా నుండును. భారతదేశము తమ పొరుగు రాజ్యములతో సంఘీభావముతో మెలగుటతో అత్యున్నత గౌరవ ప్రతిష్టలు పొందును. సరిహద్దులలో యుద్ధమేఘాలు ఆవరించినప్పటికీ, ప్రతిఘటింపు మరియు దౌత్య వ్యవహారములతో శాంతి వాతావరణము నెల కొనును. విద్యా విషయములలో పెనుమార్పులు తీసుకువచ్చును. మొదటి ఆరుమాసముల తద నంతరం ఆర్ధికపరిపుష్టి కలుగును. ప్రజారోగ్యము ఔషధముల లభ్యత పెరిగి సామాన్యునికి సైతము అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోనికి వచ్చును. ఇంధన పొదుపు లభ్యత పెరుగుటచే ధరలు అందుబాటులో నుండుట, స్వదేశీ ద్రవ్య మారక విలువలు మునుపెన్నడూ లేనివిధంగా పెరుగుట జరుగును. రోదశీ పరిజ్ఞానము అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యత పెరుగును. రోడ్డు, మరియు రైలు మార్గముల విస్తరణ అభివృద్ధికి దోహదపడును. ఆంధ్రరాష్ట్ర రాజధాని నిర్మాణ ములో ప్రగతిపధమున నడుచును. భూమి, స్థిరాస్థి వ్యాపారములు కొంత మందకొడిన సాగును. జనులు విపరీత ధన వ్యయము, విలాసములను కొంతమేరకు తగ్గించుకొనుటకు ప్రయత్నించెదరు. అమెరికా వంటి పశ్చిమదేశాలలో అస్థిర నిర్ణయము వలన ఆ యొక్క దేశ ఆధిపత్యము, ప్రాభవము తగ్గును. కమ్యూనికేషన్స్‌, పర్యాటక, బస్సు, రైలు విమానయానములందు కొన్ని అపశ్రుతులు జరు గును. పంచాయతీరాజ్‌, మునిసిపాలిటీ, గృహ నిర్మాణ, గనులు, పౌల్ట్రీ, విద్యాసంస్థలందు ఖర్చులు పెరుగును. చలనచిత్ర, రాజకీయ క్రీడారంగము లందు ప్రముఖులకు బాధలుండును. సైన్యము, పోలీసు వ్యవస్థలు సుస్థిరముగనుండును. ఆఫ్రికా, వాయవ్య ఆసియా దేశాలందు యుద్ధవాతావర ణము, ప్రజా ఆస్తి సంపదల ధ్వంసకాండ జరు గును. తుఫాన్‌ల వల్ల నష్టము కలిగే అవకాశములు ఎక్కువగా నుండును. కేంద్రప్రభుత్వ నిధులపై రాష్ట్రములు ఆధారపడును. నేరచరిత పెరిగినను ప్రభుత్వ అదుపులోనుండును.

కావేరీనదీ పుష్కరములు :

గురువు తులారాశి ప్రవేశ సమయము నుండి 12 రోజులపాటు కావేరీనదీ పుష్కరములు జరుగు తాయి. ఈ సంవత్సరము భాద్రపద బహుళ సప్తమి మంగళవారము తేది.12.09.2017 నుండి కావేరీనదీ పుష్కరములు ప్రారంభమగును.

కర్తరీ నిర్ణయము :

తేది.04.05.2017 గురువారము నుండి డొల్లు కర్తరీ ప్రారంభము. తేది 11.05.2017 గురువారము నుండి తేది.28.05.2017 ఆది వారము వరకు నిజకర్తరి. ఈ కర్తరిలో 'మృచ్ఛిలా దారు కర్మాణి వర్జయేత్‌' అను ప్రమాణము వలన మట్టి, రాయి, కొయ్యతో కూడిన నిర్మాణములు పనికిరావు.

మౌఢ్యములు :

సూర్యునకు అత్యంత సమీపమును ఏ గ్రహము వచ్చినను అస్తంగత దోషము కలుగును. శుభగ్రహ ములగు గురు శుక్రులు రవి సమీపమునుకు వచ్చి నచో అస్తంగతులగుదురు. కాబట్టి గురు శుక్ర మౌఢ్యములుగా చెప్పబడినవి. ఏ రకములైన శుభ కార్యములు కూడా చేయరాదని ధర్మశాస్త్ర, జ్యోతి శ్శాస్త్ర ప్రమాణము. తేది. 30.03.2017 వరకు శుక్రమౌఢ్యమి జరుగును. ఆశ్వీయుజ బహుళ అష్టమి శుక్రవారము తేది.13.10.2017 నుండి కార్తీక బహుళ పంచమి బుధవారము తేది. 08.11.2017 వరకు గురుమౌఢ్యమి జరుగును. మార్గశిర శుక్ల చతుర్దశి శనివారం తేది. 02.12.2017 నుండి మాఘ బహుళ అమావాస్య గురువారము తేది. 15.02.2018 వరకు శుక్ర మౌఢ్యమి జరుగును.

మకర సంక్రమణం :

తేది.14.01.2018 పుష్య బహుళ త్రయోదశి ఆదివారం రాత్రి 7.11 గంటలకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించును. దీనిని ఉత్తరాయణ పుణ్య కాలమని, సంక్రాంతి అని పిలుస్తారు.

దక్షిణాయనగే భానౌ కలికాలే నరై: కృతమ్‌

పాపం మూర్తీభవత్సరం బహర్వ్యాప్యుత్తరాయణే!!

దక్షిణాయనంలో జనులు చేసిన పాపములన్ని ఘోరం రూపంలో మకర సంక్రమణ సమయంలో సూర్యాంశ గ్రహతారులు ప్రత్యక్షమగు రూపమే మకర సంక్రాంతి పురుష రూపము. అందుకే పితృ దేవతలను పూజిస్తారు. మకర సంక్రాంతి పురుషల లక్షణములను పరిశీలిస్తే దేశమున సుభిక్ష క్షేమారోగ్య ములుండును. జంతు నష్టములు కలుగును. జల ప్రళయములు, దొంగతనాలు, రోగభయాలు ఈ సంవత్సరము ఉండును. పంటలు బాగా పండును. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాల సమయములలో పితృదేవతలను ఆరాధించి రుణం తీర్చుకోవాలి.

ఆర్త్రకార్తె ప్రవేశము : (తొలకరులు)

జ్యేష్ట బహుళ త్రయోదశి గురువారము తేది 22.06.2017న 12.46 గంటలకు కన్యా లగ్న మున ఆర్ద్రకార్తె ప్రవేశము 'పూర్వాహ్ణకాలే జగతో విపత్తి:'.. మధ్యాహ్న కాలము కావున వర్షాల వల్ల నష్టములు, ధాన్యాదుల ధరలు పెరుగుట, అకాల వర్షముల వలన పంట నష్టములు, ప్రజలకు అనా రోగ్యబాధలు కలుగును.

గ్రహణములు :

తేది 07.08.2017 సోమవారం శ్రావణ శుక్ల పూర్ణిమ రాత్రి 10.48 నుండి 12.52 వరకు శ్రవణా నక్షత్రమున కేతుగ్రస్థ చంద్రగ్రహణము కలుగును. శ్రవణ ధనిష్ట నక్షత్రముల వారు చూడకూడదు.

తేది 31.01.2018 బుధవారం మాఘ శుక్ల పూర్ణిమ రోజున సాయంకాలము 5.15 నుంచి 8.43 వరకు ఆశ్లేషా నక్షత్రమునందు సంపూర్ణ చంద్రగ్రహణము కలదు. పుష్యమి, ఆశ్లేషా నక్షత్ర ముల వారు చూడకూడదు. యధోచితముగా శాంతిని నిర్వహించుకొనవలెను.

ఆదాయ వ్యయయులు -

రాజపూజ్య అవమానములు

ఆ వ్య రా అ

మేష 5 5 3 1

వృషభ 14 11 6 1

మిధున 2 11 2 4

కర్కాటక 11 8 5 4

సింహ 14 2 1 7

కన్య 2 11 4 7

తుల 14 11 7 7

వృశ్చిక 5 5 3 3

ధనుః 8 11 6 3

మకర 11 5 2 6

కుంభ 11 5 5 6

మీన 8 11 1 2

సర్వాదాయం 65 53Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
  ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
 • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
  నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter