Friday, 24 March 2017 08:25

సన్యాసుల పాలనలోనే శాంతి సౌభాగ్యాలు - భేతాళకథ

Written by 
Rate this item
(0 votes)

galpikaపట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీమార్నింగ్‌ ఎయిట్‌ థర్టీకల్లా నిద్ర లేచాడు. బాత్‌రూంకు వెళ్ళి పొద్దున చేయాల్సిన పనులన్నీ ముగించుకుని మద్రాసుబస్టాండ్‌ వద్దనున్న మురళీకృష్ణ హోటల్‌లోకి వెళ్ళాడు. మూడు ఇడ్లీలలో మూడు బకెట్ల సాంబార్‌ లాగించి మళ్ళీ రోడ్డు మీదకొచ్చాడు. ఆయన రోడ్డు పక్కన నిలబడ్డాడోలేదో ఆయన ముందు పాతిక ఆటోలు ఆగాయి. విక్రమార్కుడు ఒక ఆటోలో ఎక్కబోయేలోపే ఇంకో ఆటో సర్రున దూసుకొచ్చింది. ఒక్క ఉదుటున విక్రమార్కుడిని ఆ ఆటోలోకి లాక్కుని ఆటోవాలా షార్‌ నుండి వదిలిన రాకెట్‌లా ముందుకు దూసుకుపోయాడు. చిత్తశుద్ధితో టైం టూ టైం విధులు నిర్వ హించే వైద్యులు పనిచేస్తున్న పెద్దాసుపత్రి ముందు ఆటో ఆగింది. విక్రమార్కుడు అక్కడ దిగి పెద్దాసుపత్రిలోకి వెళ్లాడు. ఆసుపత్రి ప్రాంగణంలో ఎటు చూసినా పెద్ద పెద్ద భవనాలు కనిపించసాగాయి. విక్రమార్కుడు మనసులో... ఇక్కడ మెడి కల్‌ కాలేజీ రాకముందే బాగుండింది, మార్చురీ ఎక్కడ వుందో ఈజీగా అర్ధ మయ్యేది, ఇన్ని బిల్డింగ్‌ల మధ్య మార్చురీ ఎక్కడ ఉందో అనుకుంటూ అక్కడే వున్న వార్డుబాయ్‌ని మార్చురీకి ఎటు వెళ్ళాలని అడిగాడు. అతను చెప్పిన రూటులో వెళ్ళి విక్రమార్కుడు మార్చురీకి చేరుకున్నాడు. అక్కడ కల్తీసారా తాగి చనిపోయిన ఓ వ్యక్తి బాడీని భుజనా వేసుకుని బోడిగాడి తోటలోని రోటరీ క్లబ్‌ శ్మశానవాటిక వైపు బయల్దేరాడు విక్రమార్కుడు. ఆయన అలా నడుచుకుంటూ యం.జి మాల్‌ వద్దకు వచ్చేసరికి ఎండ బాగా కాస్తుండడంతో నీరసం వచ్చేసింది. ఇంత దూరం నడి చినా శవంలోని భేతాళుడిలో ఉలుకు పలుకు లేదేంటబ్బా అనుకుంటూ విక్ర మార్కుడు... భేతాళ... భేతాళ అంటూ భుజం మీద వున్న డెడ్‌బాడీని గట్టిగా తట్టాడు. అప్పుడు బాడీలోని భేతాళుడు... నీరసంగా ఊ కొట్టాడు. విక్రమార్కుడు వుండి... రొటీన్‌గా నువ్వు చెప్పే సోది చెప్పి, అడిగే క్వశ్చన్‌ అడిగితే ఈరోజుకు నా బాధ్యత తీరి రూమ్‌కు పోయి రెండు బీర్లు కొట్టి పడుకుంటానన్నాడు. అప్పుడు భేతాళుడు... ఆ బీర్‌ ఏదో ఇప్పుడే కొడదాం పదా.. అలా బార్‌కెళ్లి కూర్చుని మాట్లాడుకుందాం అంటూ హోటల్‌ డి.ఆర్‌ ఉత్తమలోని బార్‌కి వెళ్లారు. నాలుగు బీర్లు ఆర్డర్‌ చేసుకున్నారు. విక్రమార్కుడి రిక్వెస్ట్‌తో భేతాళుడు లేటెస్ట్‌ పొలిటికల్‌ స్టోరీ ఒకటి చెప్పడం మొదలు పెట్టాడు.

రాజా, ఇటీవలే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా భావిం చిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుపొందడం చూసే ఉంటావు. యూపీ ముఖ్యమంత్రి పదవి కోసం రాజ్‌నాథ్‌సింగ్‌, దినేశ్‌ శర్మ, కేశవ ప్రసాద్‌మౌర్య లాంటి వాళ్ళు పోటీ పడ్డారు. అందరూ కూడా వీరిలో ఒకరిని ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని వూహిం చారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ అనూహ్యంగా పెళ్ళి పెటాకులు లేని యోగి ఆదిత్యనాథ్‌ను సీఎంగా ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి పదవికి సంసా రులు ఎంతో మంది లైన్‌లో వుండగా సన్యాసి అయిన యోగిఆదిత్యనాథ్‌ను సీఎంను చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆంతర్యం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నేను పుట్టినప్పటి నుండి 'ఈ'టీవీలో వస్తున్న 'పెళ్లాం కొట్టిన మేకులు... మొగుడు పెట్టిన కేకలు' సీరియల్‌ను మొదటి ఎపిసోడ్‌ నుండి మొత్తం చూపిస్తానన్నాడు. ఆ మాటకు విక్రమార్కుడు భయపడి... భేతాళ అంత పనిచేయొద్దు, ఇది సింపుల్‌ క్వశ్చన్‌... ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యం ప్రశాంత మైన భారతదేశాన్ని నిర్మించడం. ఈ లక్ష్యం నెరవేరాలంటే ప్రజల్లో కోరికలు, ఆశలు చచ్చిపోవాలి, ప్రజలకు సంపాదన మీద, వైవాహిక సుఖాల మీద విరక్తి పెరిగేలా చేయాలి. అందుకే నరేంద్రమోడీ మొదట పెద్దనోట్లను రద్దు చేశారు. ఈ నోట్ల రద్దు తర్వాత చాలామందికి డబ్బంటే విరక్తి లుగుతోంది. నాలుగు వేల రూపాయలు కావాలన్నా నాలుగు రోజులు ఏటిఎంల ముందు, బ్యాంకుల ముందు నిలబడే పరిస్థితి కల్పించాడు. పెద్దనోట్ల రద్దు తర్వాత తలెత్తిన పరిణా మాలతో ''డబ్బు ఒక మాయ... ఆస్తులు ఒక మిధ్య'' అనే భావాన్ని కల్పించారు. సంసార జీవితం లేని మోడీ ప్రధానిగా ఉంటే దేశంలో ప్రజలందరు కూడా సన్యాసులుగా మారే పరిస్థితి వచ్చింది. అట్లాగే ప్రతి రాష్ట్రానికీ ఒక పెళ్లి పెటా కులు లేని సన్యాసి ముఖ్యమంత్రిగా వుంటే అతను ఆ రాష్ట్ర ప్రజలను కూడా తన మార్గంలోకి తెచ్చుకోగలడు. ప్రజలకు వైవాహిక సుఖాల మీద విరక్తి కలిగేలా పరిపాలన చేయగలడు. సుఖసంసార బాంధవ్యాల నుండి విముక్తి పొందేలా బోధనలు చేయగలడు. భగవంతుడి ధ్యానంతో పొద్దుపుచ్చేలా ప్రజల మనసు లను మార్చగలడు. ప్రజలు ఆశలు, కోరికలను ఎప్పుడైతే వదులుతారో అప్పుడు ఆ సమాజంలో ఆస్తుల గొడవ లుండవు, పదవుల కోసం పగలుండవు, చంపుకోవడం, నరుక్కోవడం ఉండవు. ఒకరి పట్ల ఒకరు ప్రేమతో జీవిస్తారు. అప్పుడు ఆ రాష్ట్రం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది. అలాగే మోడీ చేస్తున్న మరో కార్యక్రమం అందరిచేత 'యోగ' చేయిం చడం. దీనివల్ల కోపతాపాలు తగ్గి ప్రశాంతంగా వుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఋషులు, మునుల కాలంలో ప్రజలు ప్రశాంతంగా జీవించే వాళ్ళు. అలాంటి ప్రశాంత జీవనం కోసమే ఇప్పుడు నరేంద్రమోడీ సన్యాసులను, ఋషులను వెదికి వెదికి సీఎంలను చేస్తున్నారని చెప్పాడు విక్రమార్కుడు. ఆ వివరణకు సంతృప్తి చెందిన భేతాళుడు రెండు బీర్‌ సీసాలను ఖాళీ చేసి టక్కున మాయమయ్యాడు.

Read 134 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • అసలు పని వదిలేసి... అన్న క్యాంటిన్‌లు ఎందుకో?
    గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి... అని పెద్దలు చెప్పిన పాత మోటు సామెత అందరూ వినే వుంటారు. పారిశుద్ధ్య కార్మికుడి పని వీధులను శుభ్రంగా ఉంచడం... ఆ పని అతనే చెయ్యాలి. అదే…
  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • ఆ పైపులతో... ఆయకట్టుకు నీళ్ళు కట్‌
    చేసే అభివృద్ధి పనులు ప్రజలకు మంచి చేసేలా వుండాలేగాని ఇంకొంచెం ఇబ్బందిగా మారకూడదు. ఒకరి సమస్య తీర్చడానికి చేస్తున్న పని ఇంకో పది మందికి సమస్య కాకూడదు. కాని, నెల్లూరు రూరల్‌ పరిధిలోని 31వ డివిజన్‌ శ్రామికనగర్‌ వద్ద కనుపూరు కాలువపై…
  • ఓటమి నేర్పిన పాఠమేంటి?
    గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్‌... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచమేంటో నీకు తెలుస్తుంది. రాజకీయాలలో గెలుపును ఆస్వాదించే వాడు కాదు, ఓటమిని భరించేవాడు, ఆ ఓటమితో పాఠాలు నేర్చుకునే వాడు, ఆ ఓటమిని రేపటి విజయానికి మెట్లుగా మలచుకునేవాడే నిజమైన రాజకీయ…
  • వైకాపాలోనూ... నేతలమధ్య కలతలు
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటి ఈ జిల్లా ఇప్పుడు వైకాపాకు పెట్టనికోట అయ్యింది. 2014 ఎన్నికల్లో నెల్లూరు, తిరుపతి ఎంపి స్థానాలతో పాటు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆ…

Newsletter