31 March 2017 Written by 

రాష్ట్రంలో గూండా రాజ్యం!

gundagiriఅభివృద్ధిలో ఏపిని దేశంలోనే నెంబర్‌ వన్‌ చేస్తానని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతున్నాడు. అయితే రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్‌వన్‌ కావడంలేదు గాని అవినీతిలో మాత్రం నెంబర్‌వన్‌గా వుందని ఓ ప్రైవేట్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం తెలిసిందే!

ఒక రాష్ట్రం అవినీతిలో అగ్రస్థానంలో వున్నా ఇబ్బంది లేదేమోగాని శాంతిభద్రతల విషయంలో విఫలమైతే మాత్రం అభివృద్ధి పరంగా అంగుళం కూడా ముందుకు కదిలే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలో రౌడీయిజం పెరిగి, అధికారుల మీద దాడులు జరిగి, ప్రజాప్రతినిధులే దౌర్జన్యాలకు పాల్పడుతుంటే... ఇక ఆ రాష్ట్రం వైపు కన్నెత్తి చూసేదెవరు? పెట్టుబడులు పెట్ట డానికి వచ్చేదెవరు?

ఏపిని అభివృద్ధిలో నెంబర్‌వన్‌ చేయడం మాటేమోగాని ప్రశాంతంగా వున్న రాష్ట్రాన్ని మరో బీహార్‌గా మారుస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు బీహార్‌లో గుండాగిరి అంతరించి అభివృద్ధికి బీజం పడింది. అదే సమయంలో ఏపిలో అభివృద్ధి సంస్కృతి తెరమరుగై గూండారాజ్‌ సంస్కృతికి తెరలేచింది. రాష్ట్రంలో అధికారపార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రానికి బెజవాడ రాజధాని అయితే ఎలాంటి అరాచకాలు జరుగుతాయని ప్రజలు భయపడ్డారో ఇప్పుడు అదే జరుగుతోంది. రౌడీ సంస్కృతికి బెజవాడ పుట్టిల్లు. అలాంటి బెజవాడను పరిపాలనా కేంద్రంగా చేసుకుంటే అధికారులు అక్కడ ప్రశాంతంగా పనులు చేయలేరన డానికి మొన్న జరిగిన సంఘటనే ఒక ఉదాహరణ. ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు యాక్సిడెంట్‌ కేసుకు సంబంధించి తాము చెప్పినట్లు రిపోర్ట్‌ తయారు చేయలేదని కేశినేని ట్రావెల్స్‌ అధినేత, విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ఆర్టీఏ కమిషనర్‌ బాల సుబ్రహ్మణ్యంపై దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన ఈ ప్రభుత్వ అసమర్ధతకు, రాష్ట్రంలో విస్తరిస్తున్న రౌడీరాజ్‌ సంస్కృతికి అద్దం పడుతోంది. రాష్ట్ర ప్రజలందరు కూడా ఈ సంఘటనను చూసారు. ఒక ఐపిఎస్‌ అధికారి నిబంధనల ప్రకారం తన విధులను తాను నిర్వహిస్తే తెలుగు దేశం ప్రజాప్రతినిధులు అతనికిచ్చిన బహుమానం బండబూతులు తిట్టడం. కొద్దిరోజుల క్రితమే, ఇదే కృష్ణాజిల్లాలో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురై 13మంది ప్రయాణీకులు మృత్యువాత పడ్డారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ప్రతి పక్షనేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి బస్సు డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదేమని కలెక్టర్‌ను నిలదీసి అడిగిన పాపానికి అతని మీద కేసులు పెట్టారు. ఆరోజు జగన్‌ అడిగిన దాంట్లో న్యాయముంది. అయినా కేసులు పెట్టారు. మరి నిన్న ఆర్టీఏ కమిషనర్‌ బాలసుబ్ర హ్మణ్యంపై తెలుగుదేశం నేతలు చేసిన దౌర్జన్యం పూర్తిగా అన్యాయం. ఆర్టీఏ కమిషనర్‌ లంచాల కోసం పీడిస్తుంటేనో, లేక పనుల కోసం తిప్పుకుంటుంటేనో వీళ్ళు జులుం చేసినా ప్రజలు పట్టించు కోరు. కాని వీళ్ళ ఉద్దేశ్యం పక్కా అన్యాయ మని తెలిసిపోయింది. పోటీ ట్రావెల్స్‌ సంస్థను దెబ్బతీయాలని చెప్పి తప్పుడు రిపోర్ట్‌ కోసం ఆర్టీఏ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారు. అందుకాయన ఒప్పుకోలేదు. దాంతో వీళ్ళు ఐపిఎస్‌ అధికారని కూడా చూడకుండా, కనీస గౌరవమర్యాదలు లేకుండా ఇష్టమొచ్చినట్లు తిడుతూ దౌర్జన్యానికి దిగారు. జగన్‌ ప్రజల కోసం అధికారులను నిలదీస్తే కేసులు పెట్టిన ప్రభుత్వం, తమ వ్యాపారాల కోసం ఐపిఎస్‌ అధికారి మీద దౌర్జన్యం చేసిన సొంత పార్టీ నాయకులను మాత్రం 'సారీ'లు చెప్పించి వదిలేసింది.

మొన్నటి సంఘటనలో...

పరామర్శకు ఆసుపత్రికి వెళ్ళిన జగన్‌ వద్దకి అధికారులే పరిగెత్తుకొచ్చి అనవసర రాద్ధాంతానికి కారకులయ్యారు. అక్కడ జగన్‌ ఏ అధికారివద్దకూ వెళ్ళలేదు, దౌర్జన్యం చేయలేదు. కాబట్టి జగన్‌ ఎవ్వ రినీ క్షమాపణ అడగవలసినంత స్థాయిలో కూడా తప్పు జరగలేదు... కానీ ఈ నిరం కుశ ప్రభుత్వ పెద్దలు వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డిపైన కేసు నమోదు చేయించారు.

నిన్నటి సంఘటనలో...

ఇక్కడ నేతలే ప్రభుత్వ కార్యాలయానికి దండుగా తరలివెళ్ళారు. అధికారులపైన దాడే లక్ష్యంగా వాదులాటకు దిగారు. అడ్డొచ్చిన గన్‌మెన్‌పై చేయి చేసుకున్నారు. అయితే ఈ సంఘటనలో ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సివుండగా ఇక్కడ మాత్రం కేవలం సారీ చెప్పించి సరిపుచ్చేశారు. ఈ సంఘటనే అధికారపార్టీ కుటిల నీతికి అద్దం పడుతుంది.

ఈ సంఘటనలో 'సారీ' అనే రెండక్ష రాలతో తెలుగుదేశం నాయకులు బయట పడి వుండొచ్చు. సమస్యను రెండక్షరాలతో ముగించేసానని చంద్రబాబు చంకలు గుద్దు కోవచ్చు. కాని ఈ పరిణామాలకు భవి ష్యత్‌లో తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది చంద్రబాబునాయుడే! ఈ సంఘ టనతోనే ప్రభుత్వం మీద ఉద్యోగులలో, ప్రజల్లో ఒక వ్యతిరేకత భావన వచ్చింది. సమస్యల పరిష్కారం కోసం అధికారులను నిలదీస్తే ప్రజలు హర్షిస్తారు, ఆమోదం తెలుపుతారు. నాయకులు తమ స్వార్ధం కోసం అధికారుల మీద చేసే ఏ దౌర్జన్య కాండను కూడా ప్రజలు అంగీకరించరు.

తహశీల్దార్‌ వనజాక్షిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇసుక రీచ్‌లో జుట్టుపట్టి ఈడ్చినప్పుడు చంద్ర బాబు అతనిమీద సీరియస్‌ యాక్షన్‌ తీసు కోలేదు, సరికదా ఆరోజు వనజాక్షిదే తప్ప న్నట్లు చంద్రబాబు పంచాయితీ తీర్పి చ్చాడు. ఈమధ్య తమ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి 'సాక్షి' పత్రికల్లో వచ్చిన కథనాలపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఆయన అనంతపురం 'సాక్షి' కార్యాలయం ఎదుట ధర్నాకు దిగి సభ్య సమాజం తలదించుకునే రీతిలో వై.యస్‌.జగన్‌ను తిట్టాడు. ఈ సంఘట నలను దేశవ్యాప్తంగా చూసారు. జేసీ నోట వచ్చిన మాటలను ఎవరూ హర్షించరు. తాగుబోతుల లాంగ్వేజీ వాడాడాయన. చంద్రబాబు తన గదిలోకి పిలిచి ఆయనను మందలించడం కాదు, ఆయనపై క్రమ శిక్షణా చర్యలు తీసుకుని వుంటే ఈరోజు చంద్రబాబు పట్ల ప్రజల ఆలోచన ఇంకో విధంగా వుండేది.

చంద్రబాబేమో అభివృద్ధి కలలు కంటున్నాడు. నోరు తెరిస్తే దాని గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడచూస్తే తెలుగు తమ్ముళ్ల అరాచకాలతో రాష్ట్రంలో పని చేయాలంటే అధికారులు భయపడుతు న్నారు. పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రా మికవేత్తలు జంకుతున్నారు. ఏపి అభి వృద్ధిలో కాదు, అరాచకాలలో బీహార్‌ను దాటిపోయేటట్లుంది.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • మంత్రి పోటీలో లేకుంటే.. మేమే...
    నెల్లూరు నగరం నుండి మంత్రి నారాయణ పోటీ చేస్తే... గెలుపు ఆయనదే! నెల్లూరు నగర టీడీపీ నాయకుల స్టేట్‌మెంట్‌ ఇది. ఇది పైకి మాత్రమే! ఆయన పోటీ చేయకుంటే మాత్రం సీటు మాకే ఇవ్వాలి. ఇదీ నాయకుల మనసులోని మాట. సీటును…
  • పోలవరం... ఇక కలవరం
    ఈ ప్రాజెక్ట్‌ నువ్వే చెయ్యాలి బాబూ అని వాళ్ళు అడగలేదు... ఆ ప్రాజెక్ట్‌ వాళ్ళ బాధ్యత... పూర్తి చేయాల్సింది వాళ్ళు... రాష్ట్ర విభజన చట్టంలో క్లియర్‌గా వుంది. ఈయన తగుదునమ్మా అంటూ వెళ్ళాడు... పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత మేమే తీసుకుంటామన్నాడు.…
  • ప్రాణాలను మింగుతున్న చెరువులు
    అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ…
  • ఆత్మకూరులో... సమన్వయం సాధ్యమేనా?
    2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ…
  • వీళ్ళు... సీతయ్యకు అన్నయ్యలు
    మోచేతి నీళ్ళు తాగే ఆఫీసర్లు ఉన్నంతవరకే ప్రజాప్రతినిధులు ఏ ఆటయినా ఆడగలరు. అధికారి అడ్డం తిరిగాడంటే ప్రజా ప్రతినిధి కాదు కదా ముఖ్యమంత్రి కూడా ఏమీ చేయలేడు. అది ఏ పార్టీ అయినా... ఏ ప్రభుత్వమైనా! అధికారులు కరెక్ట్‌గా వుంటే ప్రజాప్రతినిధులు…

Newsletter