Friday, 31 March 2017 08:27

తడ నుండి జిల్లా కడదాకా... ఆవిర్భవించిన 'నుడా'

Written by 
Rate this item
(0 votes)

nudaఅభివృద్ధి జరిగినా జరగకపోయినా కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త సంస్థలను ఏర్పాటు చేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య! వ్యాపారాలలో ఉండే కొందరు పనులు లేకున్నా పనులను సృష్టిస్తుంటారు. చంద్రబాబునాయుడు కూడా అంతే... ఇక్కడ రాజకీయాలలో శూన్యత ఆవరించినా తనకంటూ ఏదో ఒక పని సృష్టించుకుని, రాష్ట్రంలో ఏదో అద్భుతం జరిగిపోతుందనే భ్రమలను ప్రజలకు కల్పిస్తుంటాడు. ఈ కోవలోనే అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో ఏదో ఒక డెవలప్‌మెంట్‌ చేస్తున్నామని చెప్పుకోవడానికి కొన్ని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను ఏర్పాటు చేశారు. వాటిలో నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఒకటి.

నెల్లూరు, చిత్తూరుజిల్లాలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాల్టీలను కలిపి మొత్తం కావలి కడ నుండి తడ దాకా 21మండలాలు, 156 గ్రామాలతో 'నుడా'ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జి.ఓను జారీచేసింది. అపాయింటెడ్‌ నోటిఫికేషన్‌ను కూడా నెల్లూరు, చిత్తూరుజిల్లాల కలెక్టర్లకు పంపించారు. నెల్లూరుజిల్లాలో జాతీయ రహదారికి ఇరువైపులా వుండే కావలి, జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు, కొడవలూరు, కోవూరు, నెల్లూరురూరల్‌, టీపీ గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, గూడూరు, చిల్లకూరు, ఓజిలి, నాయుడుపేట, డి.వి.సత్రం, సూళ్ళూరుపేట, తడ మండలాల్లోని 145 గ్రామాలు, చిత్తూరుజిల్లా పరిధిలోని సత్యవేడు, వరదయ్యపాలెం మండలాలకు చెందిన 11గ్రామాలను 'నుడా'లో కలిపారు.

అపాయింటెడ్‌ తేదీ నుండి 'నుడా' అధికారికంగా మొదలైనట్లే! నెల్లూరు కేంద్రంగా 'నుడా' పనిచేస్తుంది. ప్రస్తుతానికి 'నుడా'కు పాలకవర్గాన్ని నియమించలేదు. దీనిలో ఛైర్మెన్‌ పదవి కీలకం. ముఖ్యమంత్రి ఆశీస్సులు ఎవరికి వుంటే వారికే ఈ పదవి దక్కుతుంది. ఇక స్పెషల్‌ గ్రేడ్‌ అధికారిని వైస్‌ఛైర్మెన్‌గా లేదా సిఇఓగా నిమించవచ్చు. ప్రభుత్వ శాఖల్లో మున్సిపల్‌, ఆర్ధిక, విద్యుత్‌, రోడ్లు భవనాలు, ఎన్విరాన్‌మెంట్‌ శాఖలకు చెందిన అధికారులు ప్రభుత్వం తరపున డెవలప్‌మెంట్‌ అథారిటీలో సభ్యులుగా కొనసాగుతారు.

మేయర్‌ అధికారాలకు కత్తెర

కార్పొరేషన్‌ పరిధిలో ఆదాయం వచ్చే మార్గం రియల్‌ ఎస్టేట్‌! కొత్తగా లే అవుట్‌ వేయాలన్నా, అపార్ట్‌మెంట్‌లు, భవన నిర్మాణాల ప్లాన్‌లు అప్రూవల్‌ కావాలన్నా కార్పొరేషన్‌ లేదా మున్సిపాల్టీలకే అధికారముండేది. ఇప్పుడు ఈ అధికారాలన్నీ కూడా 'నుడా'కు బదిలీ అవుతాయి. లే అవుట్‌లు వేసే వాళ్ళకు డిటిసిపి అప్రూవల్స్‌ నెల్లూరులో అందుతాయి. ఇంతకు ముందు పిటిసిపి అప్రూవల్స్‌ కోసం గుంటూరు పోవాల్సి వచ్చేది. ఆరు నెలలు తిరగాల్సి వచ్చేది.

పరిధి చాలాపెద్దది

రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలున్నాయి. గతంలో కొన్ని నగరాలకే అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను పరిమితం చేశారు. కాని, ఇప్పుడు సువిశాల ప్రాంతాలతో అర్బన్‌ డెవలప్‌మెంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు సగం నెల్లూరుజిల్లాతో 'నుడా'ను ఏర్పాటు చేసినట్లయ్యింది. జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన కృష్ణపట్నం పోర్టు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, ఇఫ్కో సెజ్‌, చింతవరం సెజ్‌, మేనకూరు సెజ్‌, మాంబట్టు సెజ్‌, శ్రీసిటీ సెజ్‌లే కాకుండా ఇసుక, సిలికా మైకాలున్న మండలాలు, ఆక్వాసాగు చేసే మండలాలు కూడా 'నుడా' పరిధిలోకే వచ్చాయి. కాబట్టి నెల్లూరు మేయర్‌ కంటే కూడా 'నుడా' ఛైర్మెన్‌ పదవి ఎంతో కీలకమైనది, విలువైనది కూడా కాబోతోంది.

Read 1087 times
Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ముగ్గురు మొనగాళ్లు
    ఒక ఎమ్మెల్యే సమర్ధవంతంగా పనిచేస్తే ఒక నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక కలెక్టర్‌ సమర్ధవంతంగా పనిచేస్తే... ఒక ఎస్పీ కార్యదక్షత చూపిస్తే... ఒక కమిషనర్‌ పట్టుదలతో పనిచేస్తే... ఒక జిల్లా, ఒక నగరమే బాగుపడుతుంది. అదే ఈ ముగ్గురు కలిసి పనిచేస్తే…
  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • పాదయాత్రతో మరో చరిత్ర
    గతానికి భిన్నంగా, గతంకంటే ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డు గుంటూరు కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగిన వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రభుత్వంపై ప్రజల్లో వున్న వ్యతిరేకతకు, ప్రజానేత జగన్‌పై వున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ప్రతిఏటా ఇడుపులపాయలో వైసిపి ప్లీనరీలు…
  • ఆనం... భవిష్యత్‌ శూన్యం?
    ఒకప్పుడు తెలుగుదేశంలో వున్నా, గత పాతికేళ్ళుగా ఆయ నకు ఆ పార్టీ అంటే గిట్టేది కాదు. ఆ పార్టీ జెండాను చూస్తే అలర్జీగా వుండేది. చంద్రబాబు ఫోటో కన పడితే ముఖం చిట్లించుకునేవాడు. అలాంటి నాయకుడే చివరకు అదే పార్టీలో చేరాల్సివచ్చింది.…

Newsletter