31 March 2017 Written by 

చదివినోళ్ళు బేజారు చిట్టాలోళ్ళు హుషారు!

10th leakఏడాది పాటు చదివారు. గ్యాప్‌ లేకుండా చదివారు. కంటి మీద కునుకులేకుండా చదివారు. ఆటలు మాని, సరదాలు వదిలి, సంతోషాలు మరచి కేవలం పుస్తకాల పురుగులై అక్షరం అక్షరం చదివారు. ఆ చదివిన ప్రతి అక్షరాన్ని తమ మెదళ్లలో నిక్షిప్తం చేసారు. ఏడాదిపాటు చదివిన చదువునంతా కూడా రెండున్నర గంటల పరీక్షలో ఉపయోగించుకోవాలి. ఏడాది పాటు చదివినా ఆ రెండున్నర గంటల పరీక్షలో ప్రతిభ చూపకపోతే, ప్రతి ప్రశ్నకు సమాధానం రాయలేకపోతే ఏడాది పాటు చదివిన చదువంతా కూడా దండగే! ఇంతటి టెన్షన్‌ మధ్య ఏడాదంతా కష్టపడిన విద్యార్థులు పరీక్షలు వ్రాస్తుంటారు. వాళ్ళకు అసలైన బాధ అప్పుడు వుండదు. ఏడాది పాటు చదువులు లేకుండా జులాయిలుగా జల్సాగా తిరుగుతూ, సినిమాలకు పోతూ, షికార్లు కొడుతూ కరెక్ట్‌గా పరీక్షల రోజున లీకైన పశ్న్రాపత్రాలు పట్టేసి, దానికి ఆన్సర్లను బట్టీ పట్టేసి పరీక్షలు వ్రాస్తారు చూడండి... అలాంటివాళ్ళను చూసినప్పుడు ఏడాదంతా చదువుకున్న విద్యార్థులు పడే బాధ వర్ణనాతీతం.

ప్రస్తుతం టెన్త్‌ పరీక్షలు ముగిసాయి. ఈ పరీక్షలు ఏ తీరులో జరిగాయో చూసాం. కరెక్ట్‌గా పరీక్ష మొదలైన అరగంటలోపే ప్రశ్నాపత్రం వాట్సాప్‌లలో వచ్చేస్తుంది. ఆ వెంటనే దానికి జవాబులు కూడా రెడీ అవుతున్నాయి. ప్రతి ఎగ్జామ్‌ సెంటర్‌ లోనూ మొద్దబ్బాయిలకు అవి చేరుతున్నాయి. దీంతో చదువుకు న్నోడు, మొద్దోడు ఒకటే అవుతున్నారు. ఈ పద్ధతిలో మొద్దబ్బాయికే ఒక మార్కు ఎక్కువొచ్చినా ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదు.

ముఖ్యంగా రాష్ట్రంలోని విద్యావ్యవస్థనే గబ్బు కొట్టిస్తున్న

ఓ విద్యాసంస్థ యాజమాన్యం మాల్‌ప్రాక్టీస్‌ను, చిట్టాల సంస్కృతిని పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో ఆ విద్యాసంస్థల అధినేత చక్రం తిప్పుతున్నారు. విద్య వీళ్ళకు పెద్ద వ్యాపారం. చాలా ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రతిభ వున్న విద్యార్థు లకే సీట్లిస్తుంటాయి. కాని ఈ రాజకీయ నేత విద్యాసంస్థల్లో మాత్రం పొట్టకోస్తే అక్షరంముక్క రాని వారికి కూడా సీట్లిస్తుం టాయి. లక్షల మంది విద్యార్థులను చేర్చుకుని, వందల కోట్లలో ఫీజులు దండి వందల సంఖ్యలో ర్యాంకులు తెచ్చుకుని, దానిని దేశమంతా ప్రచారం చేసుకోవడం ఈ విద్యా సంస్థల యాజ మాన్యానికి అలవాటే! ఇక్కడ చేరిస్తే చదువురాని సన్నాసులను కూడా ఎలాగోలా గట్టెక్కిస్తారనే నమ్మకం తల్లిదండ్రుల్లో వుంది. అందుకే ప్రతిభావంతులతో పాటు మొద్దబ్బాయిలకు కూడా ఇక్కడ ప్రవేశాలుంటాయి. పరీక్షల సమయంలో ఇలాంటి వారిని పాస్‌ చేసేందుకు ఈ విద్యాసంస్థల యాజమాన్యం తమవంతు ప్రయత్నాలు చేస్తూనే వుంటుంది. ఇప్పుడు పేపర్లు లీక్‌ అయినా, మాల్‌ప్రాక్టీస్‌ జరుగుతున్నా, మొద్దబ్బాయిలకు చిట్టాలు అందు తున్నా అలాంటి ప్రయత్నాల్లో భాగమే! ఈ విద్యాసంస్థలు అనుసరిస్తున్న వ్యాపారాత్మక విపరీత ధోరణుల వల్ల సంవత్సరం పొడవునా కష్టపడి చదివిన విద్యార్థులు అన్యాయమైపోతున్నారు. చదివినోడితో పాటు చదవనోడు కూడా పదికి పది పాయింట్లు తెచ్చుకుంటే ఇక ప్రతిభావంతులను గుర్తించేదెవరు? వారికి ఫ్రీగా ఇంటర్‌ సీట్లిచ్చేదెవరు?



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
    రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
  • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
    గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
  • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
    నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
  • నడిచినా... నిద్రించినా... ఏడాదంతా ప్రజల మధ్యే...
    ప్రజలే దేవుళ్ళు, వారి ఇళ్ళే తనకు గుళ్ళు అని భావించి అనుక్షణం వారి మధ్యే వుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్ట సుఖాలలో తోడుండాలని కోరు కునే ప్రజా నాయకుడు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నిద్ర లేచింది…
  • హోదా పోరుతో... వ్యతిరేకత పోగొట్టుకున్నారు
    నెల్లూరుజిల్లాతో సంబంధం వున్న లోక్‌ సభ సభ్యులు మేక పాటి రాజమోహన్‌ రెడ్డి(నెల్లూరు), వెలగ పూడి వరప్రసాద్‌ (తిరుపతి)లు ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హోదా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ తమ నియోజకవర్గాలలో తమ పట్ల నెలకొన్న…

Newsletter