నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ యోగాంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తలు కలికి శ్రీలత, కలికి కోదండరామిరెడ్డి తెలిపారు. 19వ తేదీ బుధవారం ఉదయం 11గంటలకు శ్రీ సాయినాథునికి బ్రహ్మకళశాభిషేకం, 21వ తేదీ శుక్రవారం సాయంత్రం 5గంటల నుండి శ్రీ షిరిడిసాయినాథ, శ్రీరామ, శ్రీ ఆంజనేయ పరివార దేవతామూర్తుల రథోత్సవం నేత్రపర్వంగా జరుగుతుందన్నారు. 22వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు శ్రీ యోగాంజనేయస్వామి వారికి బ్రహ్మకళశాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు.
ప్రతిరోజు మధ్యాహ్నం 12గంటలకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని, భక్తులు వేలాదిగా విచ్చేసి శ్రీ స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించాలని వారు కోరారు.