14 April 2017 Written by 

రాటుదేలిన జగన్‌

jaganఆవేశం కాదు ఆలోచనతో కూడిన ప్రసంగం... అర్ధం పర్ధం లేని మాటలతో కాదు అర్ధవంతమైన వివరాలతో విమర్శలు... ఏ అంశం చర్చకు వచ్చినా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం... ఏ ప్రశ్న వేసినా ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాలేకపోవడం... మొన్న ముగిసిన ఏపి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను చూస్తే రాటుదేలిన ప్రతిపక్ష నేతగా వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి కనిపిస్తాడు. ఈ సమావేశాలలో ఆయన ఎంతగానో రాణించాడు. ప్రతి అంశంపై చర్చలోనూ ఓర్పు - నేర్పు ఆయనలోని పరిణితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా ఈ సమావేశాల ద్వారా జగన్‌ తన పార్టీ శ్రేణులకు తనది బలమైన నాయకత్వమనే ఒక నమ్మకాన్ని కలిగించాడు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా ప్రజల దృష్టిలోనూ పడ్డాడు.

గతంలో అసెంబ్లీ సమావేశాలను ప్రజలు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఏదో సభలో అరుచుకుంటుంటారు, ఆ గోల మనకెందుకులే అన్నట్లుండేవాళ్ళు. కాని సమాజంలో ఇప్పుడు మీడియా విప్లవం వచ్చింది. ఇప్పుడు ప్రతి ఇంటి లోనే కాదు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్‌ ఫోన్‌లు ఉంటున్నాయి. అసెంబ్లీలో ఎవరు ఏం మాట్లాడుతున్నారన్నది అప్పటికప్పుడు చూస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వచ్చాక దేనిగురించైనా తెలుసుకోవడం సులభమవుతోంది!

ఈ సమావేశాలలో ప్రభుత్వ చర్య లను, అవినీతి అక్రమాలను ఉతికి ఆరేయ డంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ సక్సెస్‌ అయ్యాడు. ప్రతిపక్ష నేత దాడిని నేరుగా ఎదుర్కోలేక సభను వాయిదా వేయించడం, చర్చలను పక్కదారి పట్టించడం లేదా చర్చకు సంబంధం లేని అంశాలను లేవనెత్తి గందరగోళం సృష్టించడం వంటి చర్యల ద్వారా ప్రభుత్వం తన అసమర్ధతను చాటు కుంది. ముఖ్యంగా ఈ సమావేశాలలో కరువు, విజయవాడలో ఆర్టీఏ కమిషనర్‌పై తెలుగుదేశం ప్రజాప్రతినిధుల దౌర్జన్యం, అగ్రిగోల్డ్‌ భూముల కొనుగోలు, నారాయణ విద్యాసంస్థల్లో టెన్త్‌ పరీక్ష పేపర్ల లీకేజీ వంటి అంశాలు ప్రభుత్వాన్ని బాగా ఇరకాటంలో పెట్టాయి. జగన్‌ కూడా ఈ అంశాలపై అర్ధవంతంగా మాట్లాడారు. టెన్త్‌ పేపర్ల లీకేజీ విషయంలో వియ్యం కులు మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణలకు ముచ్చెమటలు పట్టిం చారు. అగ్రిగోల్డ్‌ భూముల కొనుగోలులో మంత్రి పత్తిపాటి పుల్లారావు పాత్రను బయటపెట్టారు. ప్రభుత్వం గొప్పలకు పోయి అధిక శాతం వృద్ధిరేటు చూపడాన్ని కూడా ఏకిపారేసారు. ఆఖరకు వ్యక్తిగత చురకల విషయంలోనూ చంద్రబాబు వైఖరిని జగన్‌ ఎండగట్టిన తీరు ప్రశంస లందుకుంది.

ప్రధానంగా సవాళ్ళు ప్రతిసవాళ్ళతో ఈ సభ దద్ధరిల్లింది. ఈడి అటాచ్‌ చేసిన తన ఆస్తులకు సంబంధించిన చర్చలో జగన్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించడానికి అధికారపార్టీ నాయకులెవరూ ముందుకు రాలేకపోయారు. దమ్ముంటే వైకాపా నుండి తెలుగుదేశంలో చేరిన 21మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకోమన్న జగన్‌ ఛాలెంజ్‌ను తెలుగుదేశం నేతలు స్వాగతించలేదు. చంద్రబాబు టైం బాగుండి పట్టిసీమ ప్రాజెక్ట్‌ పై కాగ్‌ నివేదిక అసెంబ్లీ సమావేశాల ఆఖరిరోజు వెలువడింది. ఒక్కరోజు ముందు 'కాగ్‌' రిపోర్ట్‌ వచ్చివున్నా దీనిపై సభలో పెద్ద యుద్ధమే జరిగివుండేది. పట్టిసీమ ప్రాజెక్ట్‌లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, పోలవరం పూర్తయితే ఇది నిరర్ధక ప్రాజెక్ట్‌గా మారుతుందని 'కాగ్‌' తన రిపోర్ట్‌లో తూర్పారబట్టింది. ఎన్ని వందల కోట్లు అవినీతి జరిగిందో లెక్క లతో సహా బయటపెట్టింది. ఒక్కరోజు ముందు ఈ రిపోర్ట్‌ వచ్చివున్నా అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఆడుకుని ఉండేది. పట్టిసీమ దండగమారి ప్రాజెక్ట్‌ అని, పోల వరం పూర్తయితే దీనివల్ల ఉపయోగముండ దని అసెంబ్లీలో జగనే కాదు బయటకూడా ఎంతోమంది మేధావులు చెప్పారు. కాని చంద్రబాబు పట్టుదలగా పట్టిసీమను చేపట్టడం వెనుకవున్న ఉద్దేశ్యం వేరే! కాగ్‌ ఇచ్చిన రిపోర్ట్‌లోనే ఆ ఉద్దేశ్యం ఏంటో బయటపడింది.

సభలో ఆద్యంతం ప్రతిపక్షంపై ఎదురు దాడి ప్రయత్నమే జరిగింది. ప్రతిపక్షాలకు మాట్లాడే విషయంలో పక్షపాత వైఖరి కనిపించింది. నలుగురు సభ్యులున్న బీజేపీ శాసనసభ పక్ష నేతకు ఎంత సమయం కేటాయించారో 70 మంది సభ్యులున్న ప్రతిపక్ష నేతకు కూడా దాదాపు అంతే సమయం కేటాయించడం వివక్షకు అద్దం పడుతోంది. అయినా కూడా తనకు వచ్చిన తక్కువ సమయాన్నే జగన్‌ బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకుని... ఇక పులితో వేట... జగన్‌తో ఆట ఒకటే అన్న రీతిలో రెచ్చిపోయాడు.



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com Email This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరు నగరాభివృద్ధికి... నాలుగు స్థంభాలు
    కన్నతల్లిని జన్మభూమిని ఎప్పుడూ మరచిపోకూడదని మన కేంద్రమంత్రి యం.వెంకయ్యనాయుడు ప్రతి సభలోనూ చెబుతుంటారు. మరి ఎంతమంది ఆ మాటను చెవికెక్కించుకుంటారన్నది వేరే విషయం. కాని ఆయన చెప్పే మాట ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. కన్నతల్లిని జన్మభూమిని మరువవద్దని ఆయన చెబుతున్న మాటలను…
  • తీరంకు సిఇజడ్‌ హారం
    డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి…
  • ఆర్టీసీని... ఆధునీకరించడం కాదు... తరలించడమే ఉత్తమం
    నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్‌కు నాలుగు దశాబ్దాల పైబడిన చరిత్ర ఉంది. అప్పట్లో ఈ బస్టాండ్‌ నగరానికి దూరంగా ఉన్న ట్లుండేది. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నగరం నలువైపులా విస్తరించింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌ నగరానికి నడిబొడ్డులో వున్నట్లయ్యింది. కొన్నేళ్ల క్రితం…
  • నేలటూరువాసులకు సివిఆర్‌ జ్యోతులు
    ఈ నెల 20వ తేదీన కృష్ణపట్నం పోర్టు సివిఆర్‌ జ్యోతి పథకంలో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులోని 150మంది మత్స్యకార కుటుంబాల వారికి ఉచితంగా గ్యాస్‌స్టౌలను అందించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరణ మార్పు శాఖ అధికారులు దీపక్‌ శ్యామ్యూల్‌, భూమత్‌…
  • నాయుడుపేట టు పూతలపట్టు... ఆరులైన్లకు ఆమోదం
    ఏపిలోనే అత్యంత రద్దీ ఉన్న రహదారులలో ప్రధానమైనది నాయుడు పేట - బెంగుళూరు రోడ్డు. ఏపి నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గమిది. అంతేకాదు, ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రాలన్నీ కొలువైన రహదారి. శ్రీకాళహస్తి, తిరుమల,…

Newsletter